- Home
- Entertainment
- RRR మిస్సయింది, రాజమౌళి 'వారణాసి'లో ఛాన్స్ కొట్టేసిన హాలీవుడ్ బ్యూటీ.. మహేష్ బాబుతో రొమాన్స్ ?
RRR మిస్సయింది, రాజమౌళి 'వారణాసి'లో ఛాన్స్ కొట్టేసిన హాలీవుడ్ బ్యూటీ.. మహేష్ బాబుతో రొమాన్స్ ?
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న 'వారణాసి' సినిమాలో ప్రియాంక చోప్రా మాత్రమే కాదు, బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ కూడా నటించబోతోందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Varanasi
రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న 'వారణాసి' సినిమాపై అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది.
అయితే ఇప్పుడు 'వారణాసి' సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రియాంక చోప్రాతో పాటు మరో హాలీవుడ్ నటి కూడా ఈ మోస్ట్ అవేటెడ్ మూవీలో నటించబోతోందట. అంతేకాదు, ఆ నటికీ మహేష్ బాబుకూ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని సోషల్ మీడియాలో గట్టిగా చర్చ జరుగుతోంది.
రాజమౌళి సినిమాను వదులుకున్న నటి!
బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ (Daisy Edgar-Jones) 'వారణాసి' సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహేష్ బాబు, డైసీ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయని, వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్స్ మాత్రమే.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డైసీ ఎడ్గార్ జోన్స్‌ను రాజమౌళి తన 'RRR' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ముందే సెలెక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన 'జెన్నీ' పాత్రకు మొదట డైసీనే అనుకున్నారు.
కానీ వ్యక్తిగత కారణాలు, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు రాజమౌళి తన కొత్త సినిమా 'వారణాసి' ద్వారా ఆమెను మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, 'వారణాసి' సినిమాతో డైసీ ఎడ్గార్ జోన్స్ ఇండియన్ సినిమాలోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది.
'వారణాసి'లో మహేష్-డైసీ రొమాన్స్?
డైసీ, మహేష్ బాబు మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉంటుందనే మాట సినీ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, మరో ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ ఎంట్రీ కథను ఎలా మలుపు తిప్పుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే దీనిపై మూవీ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి ఇండియన్ సినిమా?
'వారణాసి' సినిమాకు సంబంధించిన మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ అంటార్కిటికాలో కూడా జరగనుందట. అక్కడి వాతావరణ పరిస్థితులు, కఠినమైన రూల్స్ వల్ల అంటార్కిటికాలో షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి పరిస్థితుల్లోనూ రాజమౌళి తన సినిమా కోసం అంటార్కిటికాను ఎంచుకున్నారని, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతోందని తెలుస్తోంది.
ఏకంగా రూ. 1300 కోట్ల బడ్జెట్!
రాజమౌళి సినిమాలు అంటేనే భారీ మేకింగ్, అద్భుతమైన విజువల్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'వారణాసి' కూడా దానికి మినహాయింపు కాదు. ఈ సినిమాను దాదాపు 1300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల లిస్ట్‌లో 'వారణాసి' కూడా చేరుతుంది. భారీ బడ్జెట్, లేటెస్ట్ టెక్నాలజీ, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ఇంటర్నేషనల్ యాక్టర్స్.. ఇలా ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు వినిపిస్తుండటం అభిమానుల లో మరింత జోష్ నింపుతోంది. ఇక రాజమౌళి ఇప్పటికే ప్రకటించినట్లుగా, 'వారణాసి' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

