MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `మిరపకాయ్‌`, `కుమారి 21ఎఫ్‌`, `ది 100`.. ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

`మిరపకాయ్‌`, `కుమారి 21ఎఫ్‌`, `ది 100`.. ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

జులై రెండో వారం(జులై 8-11) వరకు థియేటర్లలో, ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 07 2025, 08:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జులై రెండో వారంలో రాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు
Image Credit : Asianet News

జులై రెండో వారంలో రాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

జులై సినిమాలకు, ఓటీటీలకు మరో డ్రై నెలగా మారింది. మొదటి వారంలో `తమ్ముడు` వచ్చి నిరాశపరిచింది. నాల్గో వారంలో పవన్‌ కళ్యాణ్‌ `హరిహర వీరమల్లు` తప్ప మరే పెద్ద సినిమాలు లేవు. రెండో వారం, మూడో వారం మరింత డ్రైగా మారింది. 

దీంతో చిన్న సినిమాలు, రీ రిలీజ్‌లకు టైమ్‌ కలిసి వచ్చింది. ఈ వారం(జులై 11)న థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో చూద్దాం.

27
జులై 10న `కుమారి 21ఎఫ్‌` రీ రిలీజ్‌
Image Credit : book my show

జులై 10న `కుమారి 21ఎఫ్‌` రీ రిలీజ్‌

ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో రీ రిలీజ్‌ల సందడి నడుస్తోంది. జులై 10న ఒకప్పుడు రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా సంచలనం సృష్టించిన `కుమారి 21ఎఫ్‌` మరోసారి విడుదల కాబోతుంది.

 రాజ్‌ తరుణ్‌, హేబా పటేల్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ రూపొందించారు. 

2015 నవంబర్‌ 20న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది.

Related Articles

Related image1
సెకండ్‌ మ్యారేజ్‌ కి నేను రెడీ.. రేణు దేశాయ్‌ కామెంట్స్ వైరల్‌, ఎప్పుడు చేసుకుంటుందంటే?
Related image2
అల్లు అరవింద్‌ రైటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క మూవీ, చిరంజీవిని మాస్‌ హీరోగా నిలబెట్టింది, దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌
37
జులై 11న రవితేజ `మిరపకాయ్‌` రీ రిలీజ్‌
Image Credit : book my show

జులై 11న రవితేజ `మిరపకాయ్‌` రీ రిలీజ్‌

జులై 11న రవితేజ హీరోగా నటించిన `మిరపకాయ్‌` మూవీ రీ రిలీజ్‌ కాబోతుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేత్‌ హీరోయిన్లుగా నటించారు. 

ఈ మూవీ 2011 జనవరి 13న విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడింది. కానీ ఇందులోని మాస్‌ ఎలిమెంట్లు ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌. అందుకే మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

47
జులై 11న ఆర్కే సాగర్‌ `ది 100` థియేటర్‌ విడుదల
Image Credit : production house

జులై 11న ఆర్కే సాగర్‌ `ది 100` థియేటర్‌ విడుదల

వీటితోపాటు మూడు స్ట్రెయిట్‌ సినిమాలు రాబోతున్నాయి. అందులో టీవీ సీరియల్స్ తో పాపులర్‌ అయిన  ఆర్కే సాగర్‌ నటించిన `ది 100` విడుదల కాబోతుంది. 

సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో రూపొందిన సందేశాత్మక చిత్రమిది. హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.

 కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది.

57
జులై 11న థియేటర్లో సుహాస్‌ `ఓ భామ అయ్యో రామ` విడుదల
Image Credit : production house

జులై 11న థియేటర్లో సుహాస్‌ `ఓ భామ అయ్యో రామ` విడుదల

దీంతోపాటు సుహాస్‌ హీరోగా నటించిన `ఓ భామ అయ్యో రామ` చిత్రం కూడా జులై 11న థియేటర్లోకి రాబోతుంది. రామ్‌ గోదల దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాలో మాళవిక మనోజ్‌ హీరోయిన్‌గా నటించింది. 

పృథ్వీరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. చాలా రోజులుగా హిట్‌ లేని సుహాస్‌కి ఇది విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

ఇదిలా ఉంటే గత వారమే `ఉప్పుకప్పురంబు` చిత్రంతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చారు సుహాస్‌. ఇందులో కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.

67
జులై 11న తమిళ డబ్బింగ్‌ చిత్రం `మై బేబీ` రిలీజ్‌
Image Credit : Asianet News

జులై 11న తమిళ డబ్బింగ్‌ చిత్రం `మై బేబీ` రిలీజ్‌

తమిళంలో మంచి ఆదరణ పొందిన `డీఎన్‌ఏ` చిత్రాన్ని తెలుగులో `మై బేబీ` పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు నిర్మాత సురేష్‌ కొడేటి. ఇది జులై 11న థియేటర్లో విడుదల కాబోతుంది. 

నెల్సన్‌ వెంకటేషన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అధర్వ మురళీ, నిమిషా సజయన్‌ జంటగా నటించారు.

 2014లో ఒక సాఫ్ట్ వేర్‌ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా చేసుకుని క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు. తమిళంలో ఆకట్టుకున్న ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుందా అనేది చూడాలి.

77
జులై 8 నుంచి 11 వరకు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్‌లు
Image Credit : Asianet News

జులై 8 నుంచి 11 వరకు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్‌లు

ఇక ఓటీటీలో ఈవారం పెద్దగా ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌ కనిపించడం లేదు. మలయాళంలో హిట్‌ అయిన `నరివేట్ట` మూవీ ఈ వారం ఓటీటీలోకి రాబోతుంది. సోనీ లివ్‌లో ఇది జులై 11 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. 

ఇందులో టొవినో థామస్‌, సూరజ్ వెంజరమూడు, చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, ప్రణవ్ టియోఫిన్ వంటి వారు నటించారు. అనురాజ్‌ మనోహర్‌ దర్శకత్వం వహించారు. ఇది ఆలోచింపజేసే ఓ ఎంగేజింగ్ డ్రామా. 

వీటితోపాటు జులై 11న నెట్‌ ఫ్లిక్స్ లో `ఆప్‌ జైసా కోయి` హిందీ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

 జియో హాట్‌ స్టార్‌లో `మూన్‌ వాక్‌` అనే మలయాళ చిత్రం జులై 8న స్ట్రీమింగ్‌ కానుంది. 

ఆహాలో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన `ధూమం` మూవీ జులై 11నే స్ట్రీమింగ్‌ కానుంది. 

ప్రైమ్‌ వీడియోలో జులై 9న `బల్లార్డ్` సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. జులై 11న `స్పెషల్‌ ఓప్స్ సీజన్‌ 2`, `వన్‌ నైట్‌ ఇన్‌ ఇదాహో` స్ట్రీమింగ్‌ అవుతాయి. 

నెట్‌ ఫ్లిక్స్ లో జర్మనీ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ `బ్రిక్‌` జులై 10న, హాలీవుడ్‌ మూవీ `టూ మచ్‌` సైతం అదే రోజు స్ట్రీమింగ్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Related Stories
Recommended image1
సెకండ్‌ మ్యారేజ్‌ కి నేను రెడీ.. రేణు దేశాయ్‌ కామెంట్స్ వైరల్‌, ఎప్పుడు చేసుకుంటుందంటే?
Recommended image2
అల్లు అరవింద్‌ రైటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క మూవీ, చిరంజీవిని మాస్‌ హీరోగా నిలబెట్టింది, దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved