- Home
- Entertainment
- అల్లు అరవింద్ రైటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క మూవీ, చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టింది, దెబ్బకి బాక్సాఫీస్ షేక్
అల్లు అరవింద్ రైటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క మూవీ, చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టింది, దెబ్బకి బాక్సాఫీస్ షేక్
చిరంజీవి సినిమాకి ఆయన బామ్మర్ది అల్లు అరవింద్ రైటర్‌గా పనిచేశారు. ఆయన ఒకే ఒక్క చిత్రానికి రైటర్‌గా పనిచేయడం, అది కూడా బ్లాక్ బస్టర్‌గా నిలవడం విశేషం.
- FB
- TW
- Linkdin
Follow Us

చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య విడదీయలేని అనుబంధం
మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఇద్దరూ బావబామ్మర్దులు. అదే సమయంలో చిరంజీవి సినిమాలను చాలా వరకు ఆయన నిర్మించారు. అనేక హిట్లు ఇచ్చారు.
అల్లు అరవింద్‌ని నిర్మాతగా నిలబెట్టడంలో చిరంజీవి పాత్ర, అలాగే చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో అల్లు అరవింద్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అల్లు అరవింద్ సిస్టర్ సురేఖనే చిరంజీవి మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఒకే ఒక్క చిత్రానికి రైటర్‌గా చేసిన అల్లు అరవింద్
ఇదిలా ఉంటే అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. చాలా సెలక్టీవ్‌గా హిట్ సినిమాలను నిర్మిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ సినిమాలతో పరిగెత్తకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తున్నారు.
అదేసమయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిర్మాతగా కథలను జడ్జ్ చేసే ఆయనలో రైటర్ కూడా ఉన్నారు. ఓ మూవీకి రైటర్‌గా కూడా పనిచేశారు.
అది మెగాస్టార్ చిరంజీవి మూవీనే కావడం విశేషం. ఒకే ఒక్క చిరు మూవీకి ఆయన రైటర్‌గా పనిచేశారు. అది బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది.
`యమకింకరుడు` చిత్రంతో చిరంజీవికి మాస్ ఇమేజ్
నిర్మాత అల్లు అరవింద్ రైటర్‌గా పనిచేసిన మూవీ `యమకింకరుడు`. ఇందులో చిరంజీవి హీరో. రాధిక హీరోయిన్. శరత్ బాబు, జయమాలిని, అల్లు రామలింగయ్య, సిల్క్ స్మిత, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు.
1982 అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. యాక్షన్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో చిరంజీవి మాస్ హీరోగా నిలబడ్డారు.
ఆ టైమ్‌లో చిరంజీవి నటించిన నాలుగు సినిమాలు ఒకేసారి విడుదల కావడం విశేషం. అయినా వాటిని తట్టుకుని నిలబడింది. హిట్ అయ్యింది.
అల్లు అరవింద్ రైటర్‌గా చేసిన ఏకైక మూవీ `యమకింకరుడు`
రాజ్ భరత్ దర్శకత్వం వహించిన `యమకింకరుడు` చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత. గీతా ఆర్ట్స్ పై ఆయన నిర్మించారు. అయితే ఇది ఆస్ట్రేలియన్ మూవీ `మ్యాడ్ మాక్స్` కీ రీమేక్.
హాలీవుడ్ మూవీ `డర్టీ హరీ`, `మ్యాడ్ మాక్స్` లను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ స్క్రిప్ట్ రైటింగ్‌లో అల్లు అరవింద్ బాగా ఇన్ వాల్వ్ అయ్యారు. రైటర్‌గా పనిచేశారు.
ఆయన రైటింగ్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసిన ఏకైక మూవీ ఇదే. చిరంజీవికి తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టడం విశేషం. అదే సమయంలో మంచి వసూళ్లని రాబట్టడం మరో విశేషం.
`యమకింకరుడు` మూవీ కథ, రికార్డులు
ఈ సినిమా కథేంటనేది చూస్తే. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. శరత్‌బాబు మరో అధికారి. వీరిద్దరు కలిసి విలన్ గ్యాంగ్‌ని అరెస్ట్ చేస్తారు.
శరత్ బాబు చెల్లిని చిరంజీవి ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వీరికి ఒక కొడుకు జన్మిస్తాడు. జైల్ నుంచి పారిపోయిన విలన్ గ్యాంగ్ శరత్ బాబుని చంపేస్తారు.
చిరంజీవి అంతు చూడాలని చూస్తుంటారు. వారి ఇంటికెళ్లి భార్య, పిల్లలను హాని కలిగిస్తారు. కొడుకుని ఎత్తుకుపోతారు.
భార్య గాయాలపాలై ఆసుపత్రిలో ఉంటుంది. కొడుకుని కాపాడుకోవడం కోసం చిరంజీవి చేసిన పోరాటమే `యమకింకరుడు` కథ.
ఆద్యంతం యాక్షన్ ఎమోషనల్‌గా మూవీ సాగుతుంది. చిరంజీవి తనదైన స్టయిల్‌లో యాక్షన్‌తో అదరగొట్టాడు. పాటలు కూడా దుమ్మురేపాయి. ఈ చిత్రం మొదటి వారంలోనే రూ.18 లక్షలు వసూలు చేసింది. అప్పట్లో ఇది రికార్డు.