MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Injury: రష్మిక మందన్నకు ప్రమాదం, షూటింగ్ లో గాయపడ్డ నేషనల్ క్రష్.. ఇప్పుడెలా ఉందంటే?

Rashmika Injury: రష్మిక మందన్నకు ప్రమాదం, షూటింగ్ లో గాయపడ్డ నేషనల్ క్రష్.. ఇప్పుడెలా ఉందంటే?

Rashmika Injury: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ప్రమాదం జరిగింది. షూటింగ్ లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రష్మిక, విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆమెకు ఇప్పుడు ఎలా ఉంది?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 31 2026, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రష్మిక మందన్నకు ప్రమాదం
Image Credit : instagram

రష్మిక మందన్నకు ప్రమాదం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ భార్య, స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ప్రమాదం జరిగింది. రష్మిక డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి.. ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ భామ, ఒక సినిమాకు సంబంధించి సాంగ్ షూట్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలేం జరిగింది?
Image Credit : Instagram

అసలేం జరిగింది?

ప్రతి సినిమాలోనూ నటనతో పాటు డ్యాన్స్‌లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపే రష్మిక, ఒక సినిమాలోని కష్టమైన డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో ఊహించని విధంగా ఆమె కాలు జారి పడటంతో కాలు బెణికి, నడుముకు కూడా తీవ్రమైన గాయమయినట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే మూవీ టీమ్ ఆమెను వైద్యుల వద్దకు తరలించారు.

Related Articles

Related image1
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Related image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
34
వైద్యుల సలహా ‌- షూటింగ్‌లకు తాత్కాలిక బ్రేక్
Image Credit : instagram

వైద్యుల సలహా ‌- షూటింగ్‌లకు తాత్కాలిక బ్రేక్

రష్మికను పరీక్షించిన వైద్యులు ఆమె కోలుకోవడానికి కనీసం 6 వారాల పాటు (నెలన్నర) పూర్తి విశ్రాంతి అవసరమని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎలాంటి శారీరక శ్రమ లేదా షూటింగ్‌లలో పాల్గొనకూడదని, విశ్రాంతి తీసుకుంటేనే గాయం త్వరగా తగ్గుతుందని హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు పాన్-ఇండియా చిత్రాలు, భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైద్యుల సూచన మేరకు ఆమె తన రాబోయే సినిమాల షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఆమె నటిస్తున్న కొన్ని సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

44
కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు
Image Credit : Asianet News

కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు

రష్మిక గాయపడిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "గెట్ వెల్ సూన్ రష్మిక" అంటూ నెటిజన్లు, విజయ, రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని, మళ్లీ మునుపటి ఉత్సాహంతో సెట్స్‌లోకి అడుగుపెట్టి అలరించాలని కోరుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Recommended image2
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Recommended image3
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Related Stories
Recommended image1
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved