MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..

Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..

Naga Babu:మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముళ్ళిద్దరు ఎంత కలిసిమెలిసి ఉంటారో అందరికి తెలుసు. మరి వీరి మధ్య గొడవలు వస్తే ఎవరు సర్ధిచెపుతారో తెలుసా? మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించిన రహస్యం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 31 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెగా అన్నదమ్ముల అనుబంధం
Image Credit : Asianet News

మెగా అన్నదమ్ముల అనుబంధం

తెలుగు చిత్రసీమలో 'మెగా ఫ్యామిలీ'కి ఉన్న ప్రత్యేకతే వేరు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముళ్లు ఇద్దరు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంత కలిసి మెలిసి ఉంటారో అందరికి తెలుసు. ఇక మెగాస్టార్ కు ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. ఎంతటి ఆప్యాయత ఉన్న కుటుంబంలోనైనా చిన్నపాటి అభిప్రాయ భేదాలు, గొడవలు రావడం సహజం. అన్న చిరంజీవితో తాను కూడా కొన్ని విషయాలలో విభేదిస్తానని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చిన్న చిన్న విషయాలకు తాము వాదులాడుకుంటామని ఆయన అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిరంజీవి-నాగబాబు గొడవపడితే సర్ధిచెప్పేది ఎవరు?
Image Credit : Asianet News

చిరంజీవి-నాగబాబు గొడవపడితే సర్ధిచెప్పేది ఎవరు?

ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ – "నాకు, అన్నయ్య చిరంజీవికి మధ్య ఏదైనా విషయంపై అభిప్రాయ భేదాలు లేదా గొడవలు వస్తే, వదిన సురేఖ గారు మధ్యలో వచ్చి సర్దిచెబుతారు. ఒకవేళ మా ఇద్దరి మధ్య ఏదైనా పట్టింపు వస్తే.. నాది కరెక్ట్ అయితే అన్నయ్య నా మాట వింటారు. లేదంటే నేను వింటాను.. ఒక్కొక్క సారి.. గొడవ పెద్దది అయితే నన్ను పక్కకు పిలిచి... మా వదిన నన్ను ఓదార్చడమో, నచ్చజెప్పడమో చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు" అని వదిన సురేఖ గొప్పతనం గురించి నాగబాబు కొనియాడారు. ఒక తల్లిలాగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ అన్నదమ్ముల మధ్య ఎటువంటి దూరం రాకుండా ఆమె బంధాలను నిలబెడతారని మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

Related Articles

Related image1
Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?
Related image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
34
మెగా సోదరుల మధ్య ఐక్యత
Image Credit : Asianet News

మెగా సోదరుల మధ్య ఐక్యత

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ – ఈ ముగ్గురు సోదరులు సినిమా రంగంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఒకరికొకరు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా నాగబాబు ఎన్నో సందర్భాల్లో తన అన్నయ్య చిరంజీవిని కేవలం అన్నగా మాత్రమే కాకుండా, ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని చెప్పారు. ఇక ఏ విషయంలో అయినా ముగ్గరు మెగా అన్నాదమ్ములు ఒకే మాట మీద ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి మాటంటే తమ్ముళ్లు ఇద్దరు వేదంలా భావిస్తారు. ఏ స్థాయిలో ఉన్న నాగాబాబు, పవన్ కళ్యాణ్ లో చిరంజీవి అంటే భయం, భక్తి రెండు ఉంటాయి. మెగాస్టార్ కోపంలో తిట్టినా ఒక్క మాట అనకుండా భరిస్తుంటారు. చిరంజీవి కూడా తమ్ముళ్లను అంతే ప్రేమగా చూసుకుంటుంటారు. ఏదైనా విషయంలో కోపంతో రెండు మాటలు అన్నా.. ఆతరువాత దగ్గరికి తీసుకోవడం ఆయనకు అలవాటు.

44
తండ్రి తరువాత తండ్రిలా..
Image Credit : Asianet News

తండ్రి తరువాత తండ్రిలా..

అన్నయ్య చిరంజీవి ప్రేమ మా తండ్రి తరువాత తండ్రిలా ఉంటుంది అన్నారు నాగబాబు. ఆయన కోపం వస్తే ఎంతలా తిడతారో.. అంతకంటే రెట్టింపు ప్రేమ చూపిస్తారు. ఎప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. తమ్ముళ్లంటే ఆయనకు చాలా ప్రేమ.. అని నాగబాబు అన్నారు. మాకు ఇంత వయసు వచ్చింది.. మా పిల్లలు కూడా పెద్దవాళ్లు అయ్యారు.. హీరోలు అయ్యారు.. అయినా సరే మేం తప్పుచేస్తే .. అన్న చేతుల్లో చిన్నపిల్లలా తిట్లు తినాల్సిందే అని అన్నారు నాగబాబు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved