MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

జబర్దస్త్ అదిరే అభి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `కర్మాఖ్య`. సముద్రఖని, అభిరామి,ఆనంద్‌, ధన్‌రాజ్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

4 Min read
Author : Aithagoni Raju
Published : Jul 31 2026, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కర్మాఖ్య మూవీ రివ్యూ
Image Credit : X/@MyFilmProdns

కర్మాఖ్య మూవీ రివ్యూ

అదిరే అభి(అభినయ కృష్ణ) జబర్దస్త్ వదిలేసిన తర్వాత దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు ముందు `చిరంజీవ` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `కర్మాఖ్య` అనే చిత్రాన్ని రూపొందించాడు. దీని అసలు పేరు `కామాఖ్య`. కానీ సెన్సార్‌, లీగల్ ఇబ్బందుల కారణంగా `కర్మాఖ్య`గా పేరు మార్చారు. ఈ చిత్రాన్ని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై వడ్డేపల్లి శ్రీ వాణినాథ్‌, యశ్వంత్‌ రాజ్‌ నిర్మించారు. ఇందులో సముద్రఖని, అభిరామి, శరణ్య ప్రదీప్‌, ఆనంద్‌, ధన్‌రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించగా, సమైరా ప్రధాన పాత్రతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 31)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అదిరే అభి హిట్‌ కొట్టాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కర్మాఖ్య మూవీ కథ
Image Credit : X/@MyFilmProdns

కర్మాఖ్య మూవీ కథ

కామాఖ్య దేవత, అక్కడి శక్తిపీఠం గొప్పతనం చెబుతూ సినిమా సాగుతుంది. అక్కడ వారికి అనేక తాంత్రిక విద్యలు వస్తాయి. అలాంటి ఒక ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామానికి వస్తారు. ఆ ఫ్యామిలీ మంత్ర శక్తిని ఉపయోగించేందుకు ఒక గర్భినీని తీసుకెళ్తారు. ఆ విషయం తెలిసి ఊరు ప్రజలు వారిని చంపేస్తారు. కానీ ఆ గర్భిణికి పాప జన్మిస్తుంది. కామాఖ్య అమ్మవారి ఆశీస్సులతో ఆ పాప జీవం పోసుకుంటుంది. అనాథగానే పెరుగుతుంది. కట్‌ చేస్తే ఓ హాస్టల్‌లో కామాఖ్య(సమైరా), ప్రవల్లిక(శరణ్య) మంచి స్నేహితులు. కామాఖ్య జాబ్‌ ఉన్నప్పుడు లోన్‌ తీసుకుంటుంది. జాబ్‌ పోవడంతో లోన్‌ కట్టలేకపోతుంది. లోన్‌ ఏజెంట్లు వేధిస్తున్న నేపథ్యంలో ప్రవల్లిక హెల్ప్ చేస్తుంది. ఒక రోజు ఇన్సురెన్స్ పనిమీద ప్రవల్లిక.. కామాఖ్యని ఇతర విలేజ్‌కి పంపిస్తుంది. అక్కడ సరోజిని(అభిరామి), ప్రభాకర్‌(ఆనంద్‌)ని కలుస్తారు. వాళ్ల కూతురు చనిపోవడంతో ఆ బాధలో ఉంటారు. వాళ్ల అమ్మాయి ఇన్సురెన్స్ కి సంబంధించిన పేపర్స్ దొరకపోవడంతో కామాఖ్య వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ వాళ్లు వెళ్లనివ్వరు. అప్పటి వరకు బాధలో కనిపించిన వాళ్లు ఒక్కసారిగా గాంభీర్యంగా మారిపోతారు. కామాఖ్యని బంధిస్తారు. చనిపోయిన తన కూతురుకి ప్రాణం పోయాలని, అందుకు కామాఖ్యని బలి ఇవ్వాలని ప్లాన్‌ చేస్తారు. మరి కామాఖ్య దీన్ని ఎలా ఎదుర్కొంది? ఈ విషయంలో తిరుపతి(ఎస్‌ఐ) ఏం చేశాడు? ప్రవల్లిక పాత్రలోని ట్విస్ట్ ఏంటి? ఈ బలిదానంలో కామాఖ్య బలయ్యిందా? బయటపడిందా? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Related image2
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
36
కర్మాఖ్య మూవీ ఎలా ఉందంటే?
Image Credit : X/@MyFilmProdns

కర్మాఖ్య మూవీ ఎలా ఉందంటే?

దర్శకుడు అదిరే అభి ఈ మూవీని మిస్టీరియస్‌, సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. కామాఖ్య దేవత శక్తిని ఆధారంగా చేసుకుని, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. అయితే బయటకు ఇది హర్రర్‌ థ్రిల్లర్‌గా కనిపించినా, హర్రర్‌ అంశాలు లేవు. అదే సమయంలో సూపర్‌ నేచురల్‌ అంశాలు కూడా లేవు, చివర్లో దీనికి సంబంధించిన ట్విస్ట్ ఇవ్వడం విశేషం. ఇక సినిమాగా చూసినప్పుడు కామాఖ్య అమ్మవారు, ఆమె శక్తిపీఠం గొప్పతనం చెబుతూ సినిమా సాగుతుంది. మంత్రాలు, తాంత్రిక విద్యలు తెలిసిన ఫ్యామిలీని ఊరు జనం చంపేస్తారు. కానీ వారి పాప బతుకుతుంది. ఆమె పాపనే శరణ్య. ఈ ట్విస్ట్ మాత్రం సినిమాలో అదిరిపోయింది. ప్రారంభంలో కామాఖ్య పాత్ర ప్రధానంగా కథ నడుస్తుంది. ఆమె లోన్‌ ఏజెంట్ల నుంచి తప్పించుకోవడం, దానికి శరణ్య హెల్ప్ చేయడం, ఆ తర్వాత తన పనిమీద ఆమెని అభిరామి, ఆనంద్‌ ఇంటికి పంపడం వరకు స్లోగానే సాగుతుంది. రొటీన్‌గా నడుస్తుంది. కానీ వాళ్ల ఇంట్లోకి వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. అది సస్పెన్స్ క్రియేట్‌ చేస్తూ, ఉత్కంఠభరితంగా మారుతుంది. అభిరామి ఇచ్చిన ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. ఆ ఇంటి నుంచి కామాఖ్య తప్పించుకునేందుకు ప్రయత్నించడం, వాళ్లు అడుకోవడం వంటి సీన్లు ఎంగేజ్‌ చేస్తాయి. మరోవైపు ఎస్‌ఐ తిరుపతి డబ్బులు నొక్కేసే సీన్లు నవ్విస్తాయి. హిలేరియస్‌గా ఉంటాయి. సీరియస్‌గా సాగే కథలో సముద్రఖని పాత్ర రిలీఫ్‌నిస్తుంది. మరోవైపు తన కూతురుని బతికించుకోవడం కోసం కామాఖ్యని బలిచ్చేందుకు వాళ్లు ప్రయత్నించే దగ్గరి నుంచి సినిమా సీరియస్‌గా మారుతుంది. స్పీడందుకుంటుంది. ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఫస్టాఫ్‌ డల్‌గా ఉన్నా, సెకండాఫ్‌  సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది. అంతలోనే శరణ్య పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. సముద్రఖని పాత్ర ఎంట్రీ మరింత ఉత్కంఠకి గురి చేస్తుంది. అయితే క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అవి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఎండింగ్‌ ని కూడా చిన్న వాహ్‌ ఫ్యాక్టర్‌తో ముగించారు.

46
కర్మాఖ్య మూవీలో ప్లస్‌, మైనస్‌లు
Image Credit : X/@MyFilmProdns

కర్మాఖ్య మూవీలో ప్లస్‌, మైనస్‌లు

సినిమా ప్రారంభంలో స్లోగా సాగుతుంది. కొంత సీరియల్‌ని తలపిస్తుంది. రొటీన్‌గా వెళ్తుంది. దీంతో బోరింగ్‌ ఫీల్‌ని తెప్పిస్తుంది. అయితే దర్శకుడు కథని ఎస్లాబ్లిష్‌ చేయడానికి టైమ్‌ తీసుకున్నారు. మెయిన్‌ కథలోకి వెళ్లడానికి ఎక్కవ టైమ్‌ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌ని బాగా రూపొందించారు. కాకపోతే ఇంకా బాగా రాసుకోవాల్సింది. మెయిన్‌గా సినిమాలో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. కథలో లింక్‌లు, కొన్ని లాజిక్స్ మిస్‌ అయ్యాయి. కొన్ని పాత్రల విషయంలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ట్విస్ట్ లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లని మరింత బలంగా రాసుకోవాల్సింది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా అదిరిపోయేది. కాకపోతే ఇంటర్వెల్‌ ట్విస్ట్, సెకండాఫ్‌ లోని కొన్ని ఎపిసోడ్లు థ్రిల్ కి గురి చేస్తాయని చెప్పొచ్చు. సైన్స్ విస్తరించి, మనిషి అభివృద్ధి దిశగా వెళ్తున్న ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలకు ప్రయారిటీ ఇవ్వడం సరికాదని చెప్పిన తీరు బాగుంది. కానీ అంతలోనే ట్విస్ట్ పెట్టి షాకిచ్చారు. రెండో పార్ట్ కి హింట్‌ ఇవ్వడం విశేషం.

56
కర్మాఖ్య మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@MyFilmProdns

కర్మాఖ్య మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

కామాఖ్య పాత్రలో సమైరా బాగా నటించింది. కొత్త అమ్మాయి అయినా ఎక్కడా ఆ ఫీలింగ్‌ రానివ్వలేదు. అమాయకంగా కనిపిస్తూనే తనదైన నటనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. హైలైట్‌గా నిలిచింది. ఎస్‌ఐ తిరుపతి పాత్రలో సముద్రఖని అదరగొట్టాడు. నవ్విస్తూనే మెప్పించాడు. కేసు విషయంలో రియాలిటీగా ఉండి, తాను కూడా ఒక అమ్మాయికి తండ్రినే అని చెప్పిన తీరు బాగుంది.  ఇక ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే నెగటివ్‌ యాంగిల్‌ చూపించి అభిరామి అదరగొట్టింది. ఆమె పాత్ర ఇచ్చిన ట్విస్ట్ క్రేజీగా ఉంటుంది. అలాగే ఆనంద్‌ పాత్రలోని ట్విస్ట్ కూడా అదే ఫీలింగ్‌ ని తెప్పిస్తుంది. ఇక శరణ్య పాత్రలోని ట్విస్ట్ మాత్రం విజిల్స్ వేయించేలా ఉంటుంది. రాకెట్‌ రాఘవ పాత్ర అలా మెరిసి నవ్విస్తుంది. ధన్‌రాజ్‌, మధునందన్‌తోపాటు మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

66
కర్మాఖ్య మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే
Image Credit : X/@MyFilmProdns

కర్మాఖ్య మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే

గ్యాని మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం అదిరిపోయింది. కుషేందర్‌ రమేష్‌ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. శ్రీ వర ఎడిటింగ్‌పై ఇంకా వర్క్ చేయాలి. సినిమా చాలా చోట్ల స్లో అయ్యింది. ఆయా విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు. వాణినాథ్‌ వడ్డేపల్లి సినిమాపై ఉన్న ప్యాషన్‌ కనిపిస్తుంది. బాగా ఖర్చు చేసి సినిమాని రూపొందించారు. దర్శకుడు అభినయ కృష్ణ(అదిరే అభి) మంచి కథని ఎంచుకున్నాడు. కానీ దాన్ని ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ప్రాపర్‌గా కథనాన్ని డిజైన్‌ చేసుకోవాల్సింది. కొన్ని బ్లాక్‌లుగా సినిమాని బాగా తీశాడు. మిగిలిన సీన్లు తేలిపోయాయి. ట్విస్ట్ లు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కాకపోతే ఇటీవల వస్తోన్న థ్రిల్లర్‌ చిత్రాలతో పోల్చితే బెటర్‌గానే ఉంది. కొత్తరకమైన థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

ఫైనల్‌గా:

 సరికొత్త థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందించే మిస్టీరియల్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ `కర్మాఖ్య`. అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకుంటుంది. థ్రిల్‌నిస్తుంది.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image2
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Recommended image3
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image2
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. కృష్ణ మనవడి మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved