MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 5000 కోట్ల కలెక్షన్ మార్క్ వైపు మైఖేల్ పరుగులు.. 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ

5000 కోట్ల కలెక్షన్ మార్క్ వైపు మైఖేల్ పరుగులు.. 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ

పాప్ ప్రపంచాన్ని ఏలిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్' బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా కలెక్షన్లు  కొల్లగొట్టిందీ మూవీ. 5000 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చరిత్ర తిరగరాస్తున్న మైఖేల్ మూవీ..
Image Credit : Movie Stills

చరిత్ర తిరగరాస్తున్న మైఖేల్ మూవీ..

కొన్ని సినిమాలు రిలీజై బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర రాస్తాయి. ఇప్పుడు 'మైఖేల్' సినిమా అదే పని చేస్తోంది. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు  బ్రేక్ చేస్తోంది. జాఫర్ జాక్సన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
4 రోజుల్లోనే 2200 కోట్లు..
Image Credit : Movie Stills

4 రోజుల్లోనే 2200 కోట్లు..

గత ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా, మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,200 కోట్లు (సుమారు $260 మిలియన్లు) వసూలు చేసింది. ఒక మ్యూజిషియన్ బయోపిక్ ఇంత వేగంగా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి. ఇండియాలోనూ 4 రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా రాబట్టింది.
35
మైఖేల్ జాక్సన్‌గా నటించిన జాఫర్ జాక్సన్
Image Credit : Movie Stills

మైఖేల్ జాక్సన్‌గా నటించిన జాఫర్ జాక్సన్

ఈ భారీ విజయానికి ముఖ్య కారణం మైఖేల్ జాక్సన్‌గా నటించిన జాఫర్ జాక్సన్. ఇతను మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు. మైఖేల్ జాక్సన్ యూనిక్ డ్యాన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్‌ను జాఫర్ అచ్చుగుద్దినట్లు స్క్రీన్‌పై చూపించాడు. అంతే కాదు మైఖేల్ జాక్సన్ జీవితంలోని పోరాటాలు, జాతి వివక్షపై అతని నిరసన, సంగీత ప్రపంచంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా చాలా ఎమోషనల్‌గా చూపించారు.

45
మళ్లీ మొదలైన మైఖేల్ జాక్సన్ మేనియా
Image Credit : Movie Stills

మళ్లీ మొదలైన మైఖేల్ జాక్సన్ మేనియా

ప్రస్తుతం ప్రపంచమంతటా మళ్లీ 'మైఖేల్ జాక్సన్ మేనియా' మొదలైంది. రాబోయే వారాలకు కూడా టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం, ఈ సినిమా రానున్న రోజుల్లో రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
55
 మైఖేల్ జాక్సన్ కు ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గౌరవం
Image Credit : Getty

మైఖేల్ జాక్సన్ కు ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గౌరవం

'మైఖేల్' సినిమా కేవలం కలెక్షన్ల కోసమే కాదు, సంగీత ప్రపంచపు రాజుకు సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. గతంలో వచ్చిన 'బోహేమియన్ రాప్సోడీ' వంటి బయోపిక్ చిత్రాల రికార్డులను ఇది త్వరలోనే బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మైఖేల్ జాక్సన్ మేజిక్ ఇంకా తగ్గలేదని ఈ 4 రోజుల వసూళ్లు నిరూపించాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
హాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image2
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image3
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Related Stories
Recommended image1
Vanisri : అక్కినేనితో సహా ఇండస్ట్రీ అంతా వచ్చారు.. వాణిశ్రీ పెళ్లికి ఎన్టీఆర్ మాత్రం ఎందుకు రాలేదు? కారణం ఏంటో తెలుసా?
Recommended image2
Tabu: 28 ఏళ్ల తర్వాత ప్రియుడితో టబు రొమాన్స్.. 54 ఏళ్ల వయసులో మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved