- Home
- Entertainment
- మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా, భార్యగా రెండు పాత్రల్లో నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా, భార్యగా రెండు పాత్రల్లో నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లు ఆయన జంటగా నటించారు. కాని చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెతో మెగాస్టార్ ఎన్ని సినిమాలు చేశారు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్‌లో మంచి ఊపుమీదున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య తప్పించి చిరంజీవికి ఈ నాలుగేళ్లలో వెంట వెంటనే ప్లాప్ లు పలుకరించాయి. కాని వాటిని పట్టించుకోకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే చిరు రెండు రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర, మరొకటి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మరో ప్రాజెక్ట్.
చిరంజీవి చెల్లి, భార్యగా నటించిన నయనతార
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. కొంత మందికి మెగా మూవీద్వారానే స్టార్ డమ్ కూడా వచ్చింది. ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. అయితే మెగాస్టార్ కెరీర్ లో ఆయనకు భార్యగా నటించి ఆతరువాత చెల్లి పాత్ర చేసిన ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే. నయనతార చిరుతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో భార్యగా నటించింది. ఆతరువాత గాడ్ ఫాదర్ సినిమాలో చెల్లిగా నటించింది. ఇప్పుడు మరోసారి చిరుతో కలిసి మరో ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.
అనిల్ రావిపూడి సినిమాలో లేడీ సూపర్ స్టార్
విశ్వంభర కాకుండా చిరంజీవి నటిస్తున్న మరో సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెడుతోంది. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్న టీమ్.. రెండో షెడ్యుల్ ను స్టార్ట్ చేశారు. దానికి సబంధించి రీసెంట్ గా అప్ డేట్ కూడా రిలీజ్ చేశారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది ఈసినిమా.
నయనతార సినీ ప్రయాణం
40 ఏళ్ల వయస్సులో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ చూస్తోంది నయనతార. సౌత్ సినిమాలో ఆమె చాలా కీలకంగా మారింది. అంతే కాదు సౌత్ సినిమాలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార, తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో హిట్లు అందుకుంది. ఈమధ్య కాలంలోనే జవాన్ సినిమాతో హిందీ సినిమాలలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక హీరోయిన్లలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుంది కూడా నయనతారే. తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్ననయన్.. తెలుగులో చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
విశ్వంభర
యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. కాని ఇప్పటికే కొన్నిసార్లు ఈమూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
చిరంజీవి ఫిట్‌నెస్
69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఎనర్జీ, ఫిట్‌నెస్‌తో యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు. కొత్త లుక్స్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్నారు మెగాస్టార్. డాన్స్, యాక్షన్ సీన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు చిరు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇవి మేకింగ్ దశలో ఉండగా, త్వరలోనే రిలీజ్ డేట్స్, టైటిల్స్, ఫస్ట్ లుక్స్ వంటి విషయాల్లో అధికారిక ప్రకటనలు రావొచ్చని సమాచారం.