MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Yamuna: 55 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది?

Yamuna: 55 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది?

Yamuna: ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 35 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఆమె వయసు దాదాపు 55 ఏళ్లు.. అయినా సరే 30 ఏళ్లు అంటే నమ్మేస్తారు. స్టార్ నటి యమున ఇలా ఎలా గ్లామర్ ను మెయింటేన్ చేస్తున్నారు. ఆమె వెల్లడించిన టాప్ సీక్రెట్..

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 12 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రేక్షకుల మనసు దోచిన నటి
Image Credit : Asianet News

ప్రేక్షకుల మనసు దోచిన నటి

తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో తన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి యమున. కన్నడ నటి అయినా.. తెలుగు వారి ఆడపడుచుగా ఆమె గుర్తింపు సాధించుకుంది. హీరోయిన్ గా, సీరియన్ నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సెంటిమెంట్ సీన్స్ కు పెట్టింది పేరు యమున. ఆమె స్క్రీన్ మీద ఏడ్చిందంటే.. మహిళా ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టేవారు. అంతలా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది యమున.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
55 ఏళ్ల వయసులో కూడా ఇంత అందంగానా?
Image Credit : Asianet News

55 ఏళ్ల వయసులో కూడా ఇంత అందంగానా?

యమున ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్లు య్యింది. ప్రస్తుతం ఆమె వయసు దాదాపు 55 ఏళ్లు. కానీ ఆమెకు 30 ఏళ్లు అన్నా నమ్మేస్తారు అలా అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది సీనియర్ నటి. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, యంగ్‌గా , గ్లామరస్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే శారీరక మార్పులను అధిగమించి, ఆమె ఇప్పటికీ అదే గ్లోతో మెరిసిపోవడానికి వెనుక కారణం ఏంటి? ఈ విషయంపై ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యమున స్పందించింది. తన హెల్త్ గ్లామర్ సీక్రేట్ ను వెల్లడించింది.

Related Articles

Related image1
Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..
Related image2
Sobhan Babu: ఇంత తెల్లగా ఉన్నావ్.. నీ వయసెంత... హీరోయిన్ ను ర్యాగింగ్ చేసిన శోభన్ బాబు, ఇంతకీ ఎవరా నటి?
35
ఆహార నియమాలు , మానసిక అలవాట్లు
Image Credit : Asianet News

ఆహార నియమాలు , మానసిక అలవాట్లు

యమున గ్లామర్ సీక్రేట్ తన లైఫ్ స్టైల్. రోజు వారి జీవనశైలి (Lifestyle), ఆహార నియమాలు , మానసిక అలవాట్ల గురించి ఆమె తన ఇంటర్వ్యూలలో స్పష్టంగా పంచుకున్నారు. ప్రకృతిసిద్ధమైన ఆహారపు అలవాట్లు (Diet Routine) చాలా ముఖ్యం. యమున తన దినచర్యలో ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు , పీచు పదార్థాలు (Fiber Content) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. శరీరం తేమగా, కాంతివంతంగా ఉండటానికి రోజుకు తగినంత నీరు తాగడం ఆమె ముఖ్యాంశంగా భావిస్తారు. అతిగా తినకుండా, శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినడం ఆమె అలవాటు. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, ధ్యానం వయసును నియంత్రణలో ఉంచే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనవని ఆమె నమ్ముతారు.

45
వ్యాయామం, భోజనం.. రెండు ముఖ్యమే..
Image Credit : Asianet News

వ్యాయామం, భోజనం.. రెండు ముఖ్యమే..

యమున తన దినచర్య గురించి మాట్లాడుతూ.. '' నేను రోజు ఉదయం లేవగానే అంతా బాగుండాలి.. బాగుంటాను అనే పాజిటీవ్ థాట్ తో లేస్తాను.. మార్నింగ్ లేవగానే రెండు గ్లాసుల వాటర్ తాగుతాను.. రోజు 20 నిమిషాలు వ్యాయమం చేస్తాను.. ఇక తప్పకుండా 1 గంట కచ్చితంగా మెడిటేషన్ చేస్తాను. ఆతర్వాత 10 గంటలకు పక్కాగా భోజనం చేస్తాను. గతంలో బ్రేక్ ఫాస్ట్ చేసేదాన్ని.. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా భోజనం చేస్తున్నాను. ఇక సాయంత్రం ఆరు గంటల వరకూ ఫ్రూట్స్, మజ్జిగ, మధ్యలో కాఫీ.. లాంటివి తీసుకుంటాను. ఇక 6 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తాను. ఎంత డైట్ ఫాలో అయినా కూడా మన మనసు ఎంత పాజిటీవ్ గా ఉంటే.. అంత మంచి ఆరోగ్యం ఉంటుంది. గట్ హెల్త్ కు మైండ్ కి లింక్ ఉంటుంది. కాబట్టి తినేప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఫోన్, టీవీ లేకుండా ప్రతీ ముద్దను ఎంజాయ్ చేస్తూ తినాలి. మా అమ్మగారు చెప్పిన సూత్రాన్ని పాటిస్తాను. ఇక ఇవన్నీ కాకుండా మా అమ్మగారి నుంచి వచ్చిన జీన్స్ నుంచి నాకు ఈ హెల్త్ వచ్చింది'' అని యమున అన్నారు.

55
లైఫ్ ప్టైల్ లో మార్పుల తో ఆరోగ్యం..
Image Credit : Asianet News

లైఫ్ ప్టైల్ లో మార్పుల తో ఆరోగ్యం..

నిత్యం యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వర్కౌట్స్ చేయడం ద్వారా తన శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా, ఆరోగ్యంగా ఉంచుకుంటారు యమున. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ముఖంలో ఆ కాంతి ప్రతిబింబిస్తుందని యమున చెబుతారు. రోజువారీ ధ్యానం వల్ల ఆమె ఒత్తిడిని సమర్థవంతంగా జయిస్తారు. మానసిక శాంతి, పాజిటీవ్ మైండ్ సెట్ అందానికి కేవలం బాహ్య సంరక్షణే కాకుండా, అంతర్గత ప్రశాంతత కూడా అంతే అవసరం అని యమున అభిప్రాయపడ్డారు. సహజ సిద్ధమైన చర్మ సంరక్షణ (Skin Care) కోసం కృత్రిమమైన కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కంటే ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన చిట్కాలు, ఆలోవెరా, పసుపు వంటి ప్రకృత్యుత్పత్తులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. తన సౌందర్యానికి నిద్ర కూడా కీలకం అని ఆమె అన్నారు. టైమ్ కు నిద్రపోవాలి, పడుకునేముందు ఫోన్ పక్కన పెట్టడం, టైమ్ కు పడుకుని త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యకరమైన అలవాటు అని. తన హెల్త్ సీక్రెట్ ఇదే అన్నారు యమున. చాలామంది నన్ను అడిగారు... ఇప్పుడు చెపుతున్నా.. మీరు కూడా పాటించండి అని యయున అందరిని కోరారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..
Recommended image2
Sobhan Babu: ఇంత తెల్లగా ఉన్నావ్.. నీ వయసెంత... హీరోయిన్ ను ర్యాగింగ్ చేసిన శోభన్ బాబు, ఇంతకీ ఎవరా నటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved