- Home
- Entertainment
- అమ్మ చనిపోయినంత బాధ కలిగింది, చిరంజీవి మూవీపై క్రేజీ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు.. మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
అమ్మ చనిపోయినంత బాధ కలిగింది, చిరంజీవి మూవీపై క్రేజీ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు.. మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
చిరంజీవి నటించిన ఓ చిత్రం విషయంలో ఒక క్రేజీ కమెడియన్ తనకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి ఎలా స్పందించాలో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

చిరంజీవి గొప్ప మనసు
మెగాస్టార్ చిరంజీవి ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తారు. అవసరమైన సాయం అందిస్తారు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. తన చిత్రాల్లో నటించే నటీనటులు ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, వాళ్లు బాధపడకూడదు చిరంజీవి భావిస్తారు. చిరంజీవి నటించిన ఓ చిత్రం విషయంలో ఒక క్రేజీ కమెడియన్ తనకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కమెడియన్ ఆవేదన
ఆ విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి ఎలా స్పందించాలో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆ కమెడియన్ ఎవరో కాదు ఇటీవల ఎక్కువగా వివాదాల్లో నిలిచిన పృథ్వీరాజ్. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 విషయంలో పృథ్వీరాజ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అసలు ఏం జరిగింది? ఆ సంఘటనకి చిరంజీవి ఎలా స్పందించారు? అనేది ఇప్పుడు చూద్దాం.
ఖైదీ నెంబర్ 150
ఖైదీ నెంబర్ 150 చిత్రంలో కమెడియన్ పృథ్వీ కేవలం ఒకే ఒక్క సన్నివేశంలో నటించారు. కానీ ఆ సన్నివేశం కథలో అంతగా సెట్ కావడం లేదని, లెంత్ కూడా పెరుగుతోందని డైరెక్టర్ వివి వినాయక్ ఎడిటింగ్ లో తొలగించారు. ఈ సంగతి తెలుసుకున్న కమెడియన్ పృథ్వీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పృథ్వీ ఓపెన్ గా ఖైదీ నెంబర్ 150 చిత్రం గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అమ్మ చనిపోయినంత బాధ కలిగింది అంటూ..
ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నేను నటించిన సన్నివేశాన్ని తొలగించడం నన్ను చాలా బాధించింది. మా అమ్మ చనిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో.. ఈ చిత్రంలో నా సీన్ తీసేసినప్పుడు కూడా అంతే బాధపడ్డాను అని తెలిపారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి వరకు వెళ్లాయి. దీంతో చిరంజీవి వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన వెంటనే అతడికి ఫోన్ చేశాను.
చిరంజీవి ఏం చేశారంటే..
పృథ్వీ నువ్వేమి బాధపడకు.. నువ్వు నటించిన సన్నివేశం ఈ చిత్రంలో తప్పకుండా ఉంటుంది.. నేను హామీ ఇస్తున్నా. ఈ మాత్రం దానికి అమ్మ చనిపోయిన అంత బాధ కలిగిందని మాట్లాడడం సరైనది కాదు అని మందలించినట్లు చిరంజీవి తెలిపారు. వెంటనే వివి వినాయక్ తో మాట్లాడాను. అప్పటికే ఖైదీ నెంబర్ 150 చిత్ర సెన్సార్ కూడా పూర్తయింది. ఒకసారి సెన్సార్ కంప్లీట్ అయిన చిత్రంలో మళ్లీ ఇంకో సన్నివేశం యాడ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.
సెన్సార్ పూర్తయిన చిత్రానికి తిరిగి సెన్సార్
చిన్న సన్నివేశం యాడ్ చేసిన రీ సెన్సార్ చేయాల్సి ఉంటుంది. అది కష్టంతో కూడుకున్న ప్రాసెస్. ఎంత కష్టమైనా పృథ్వీ నటించిన సీన్ ని యాడ్ చేయమని వివి వినాయక్ కి చెప్పాను. దీంతో వివి వినాయక్ ఆ సన్నివేశాన్ని తిరిగి యాడ్ చేశారు అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి పెద్ద మనసుతో స్పందించి అందరి హృదయాలు గెలుచుకున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం కావడంతో తన పాత్ర ఉండాలని కమెడియన్ పృథ్వీ బలంగా కోరుకున్నారు. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారు.