MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఆ హీరో కోసం తమ్ముడి సినిమానే పక్కన పెట్టిన చిరు, దెబ్బకు ఫ్లాప్ కావాల్సిన మూవీ బిగ్గెస్ట్ హిట్

Chiranjeevi: ఆ హీరో కోసం తమ్ముడి సినిమానే పక్కన పెట్టిన చిరు, దెబ్బకు ఫ్లాప్ కావాల్సిన మూవీ బిగ్గెస్ట్ హిట్

ఓ క్రేజీ హీరో కోసం చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాని కూడా పక్కన పెట్టేశారు. చిరంజీవి ఇచ్చిన హెల్పింగ్ హ్యాండ్ తో ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఆ సినిమా ఏంటి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 27 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన అద్భుతమైన వాయిస్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోగా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాయి కుమార్ నటించారు. సాయి కుమార్ నేను తన 66వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సాయి కుమార్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పోలీస్ స్టోరీ మూవీ గురించి, మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాయి కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
Image Credit : Asianet News

సాయి కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

1996లో సాయి కుమార్ నటించిన పోలీస్ స్టోరీ చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఆ మూవీలో సాయి కుమార్ పోలీస్ గెటప్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రం కన్నడలో అఖండ విజయం సాధించింది. తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ సినిమాపై ఎలాంటి బజ్ లేదు.

35
అంతా ఫ్లాప్ అన్నారు
Image Credit : facebook.com/ItsSaiKumar

అంతా ఫ్లాప్ అన్నారు

ఎందుకంటే పోలీస్ స్టోరీ మూవీ అనేది సీరియస్ గా సాగే కథ. అందులో కామెడీ కానీ, పాటలు కానీ ఉండవు. దీనితో బయ్యర్లు అంతా ఇక్కడా ఈ సినిమా ఆడదు. మన ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి అని చేతులెత్తేశారట. చాలా తక్కువ ధరకు ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు. సినిమాపై ఎలాగైనా బజ్ పెంచాలి అని సాయికుమార్ భావించారు.

45
చిరంజీవిని సాయం అడిగిన సాయి కుమార్
Image Credit : our own

చిరంజీవిని సాయం అడిగిన సాయి కుమార్

దీనితో మెగాస్టార్ చిరంజీవిని సాయి కుమార్ హెల్ప్ అడిగారు. చిరంజీవిని సాయి కుమార్ ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దీనితో సాయి కుమార్ తన మూవీ గురించి పాజిటివ్ గా మీడియాతో మాట్లాడమని చిరంజీవిని కోరారు. అయితే చిరంజీవి ఒప్పుకోలేదు. నేను సినిమా బావుందని చెబితే నన్ను నమ్మి ఆడియన్స్ థియేటర్ కి వెళతారు. అక్కడ వాళ్ళు డిసప్పాయింట్ అయితే బాగోదు అని అన్నారు.

55
తమ్ముడి సినిమాని కూడా పక్కన పెట్టిన చిరు
Image Credit : our own

తమ్ముడి సినిమాని కూడా పక్కన పెట్టిన చిరు

పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కూడా అదే టైంలో రిలీజ్ అవుతోంది. ఆ మూవీ గురించి కూడా మాట్లాడమని అడిగారు. నేను వద్దని చెప్పా అని చిరంజీవి గారు అన్నారు. దీనితో నేను ఒక్క మాట చెప్పా. సరే అన్నయ్యా.. అయితే మీరు ముందుగా సినిమా చూడండి. నచ్చితే మీడియాతో మాట్లాడండి. నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి అని కోరా. అప్పుడు ఆయన సినిమా చూశారు. ఆయనకి విపరీతంగా నచ్చేసింది. మరుసటి రోజు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా సినిమాపై బజ్ అమాంతం పెరిగిపోయింది. చిరంజీవికి నచ్చిన సినిమా అని తెగ పబ్లిసిటీ వచ్చింది. 30 లక్షల బడ్జెట్ తో తీసిన పోలీస్ స్టోరీ చిత్రం ఏకంగా 7 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది అని సాయి కుమార్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Recommended image2
Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved