- Home
- Entertainment
- Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్ చూపించిన విజయ్.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్ చూపించిన విజయ్.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన `జన నాయగన్` మిశ్రమ స్పందనతో రన్ అవుతుంది. అయితే శుక్రవారం, శనివారం కాస్త డల్‌గా ఉన్న ఈ మూవీ ఆదివారం పుంజుకోవడం విశేషం.

రిలీజ్‌కి ముందు జన నాయగన్ లీక్
విజయ్.. సీఎం కావడానికి ముందు `జన నాయగన్`(జన నాయకుడు) చిత్రంలో నటించారు. ఇది తెలుగులో వచ్చిన `భగవంత్ కేసరి`కి రీమేక్. తెలుగులో బాలకృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఇక్కడ పెద్ద హిట్ అయ్యింది. దీన్నే కొన్ని మార్పులు చేసి తమిళంలో రూపొందించారు. సెకండాఫ్‌లో తమిళనాడు రాజకీయాలు ప్రతిబింబించేలా సీన్లు పెట్టారు. దీంతో సెన్సార్ ఇబ్బందులు ఫేస్ చేసింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ మొన్న జులై 23న విడుదలైంది. అయితే రిలీజ్‌కి ముందే సినిమా లీక్ అయ్యింది. కోటి మందికిపైగానే దీన్ని చూశారు.
ఆదివారం జన నాయగన్ కలెక్షన్ల జోరు
రిలీజ్‌కి ముందే సినిమా పైరసీకి గురికావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఓపెనింగ్ రోజు బాగానే చేసింది. దాదాపు వంద కోట్ల వరకు రాబట్టింది. ఆ తర్వాత శుక్రవారం కలెక్షన్లు తగ్గాయి. శనివారం కూడా తక్కువగానే వచ్చాయి. ఇలా వరుసగా డ్రాప్ కావడంతో అటు సినిమా టీమ్‌ని, ఇటు సినీ వర్గాలను కలవరానికి గురి చేసింది. కానీ ఈ చిత్రం ఆదివారం మాత్రం జోరు చూపించింది. మంచి కలెక్షన్లని రాబట్టింది. ఇది టీమ్‌కి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.
జన నాయగన్ కలెక్షన్లు
నాల్గో రోజు ఆదివారం ఈ సినిమాకి రూ.32కోట్ల ఇండియా నెట్ రాబట్టింది. ఇండియాలో ఇప్పటి వరకు దీనికి రూ.145.98కోట్ల గ్రాస్, 124.75కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఓవర్సీస్‌లో నాల్గో రోజు పది కోట్లు రాగా, మొత్తంగా అక్కడ రూ.71.50కోట్లు వచ్చాయి. ఇక `జన నాయగన్` నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.217.48కోట్ల కలెక్షన్లని రాబట్టడం విశేషం. రూ.120కోట్లకుపైగా షేర్‌ని సాధించింది.
జన నాయగన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్
`జన నాయగన్` మూవీకి రూ.240కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. తమిళనాడు, కేరళా కలుపుకొని రూ.120కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.10కోట్లు, కన్నడలో 20కోట్లు, నార్త్ లో ఆరు కోట్లు, ఓవర్సీస్‌లో రూ.80కోట్ల మేరకు బిజినెస్ అయ్యిందని సమాచారం.ఇది థియేట్రికల్‌గా రూ.240కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈజీగా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయాలి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే అది సాధ్యం కాదనే టాక్ వినిపిస్తుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితేనే అది సాధ్యమని చెప్పొచ్చు.
జన నాయగన్ టీమ్ ఇదే
`జన నాయగన్` మూవీ విజయ్‌కి చివరి సినిమా. సీఎంగా ఉన్నంత కాలం ఆయన సినిమాలు చేయలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిచారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. మమితా బైజు ఆయనకు కూతురు పాత్రలో నటించింది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ విలన్లుగా చేశారు. వీరితోపాటు సునీల్, రేవతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందింది.

