MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్

Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్

అఖిల్ తన సతీమణి జైనబ్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై తొలిసారి స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ తప్పదని తనకు పెళ్ళికి ముందే తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Akhil Akkineni
Image Credit : Asianet News

Akhil Akkineni

అఖిల్ అక్కినేని ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్నాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్లకు దక్కిన తొలి విజయం లెనిన్. ఇటీవల విడుదలైన లెనిన్ చిత్రం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అఖిల్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ, నాగార్జున నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లి తర్వాత తొలి హిట్, భార్య తెచ్చిన అదృష్టం
Image Credit : akhil fans insta

పెళ్లి తర్వాత తొలి హిట్, భార్య తెచ్చిన అదృష్టం

అఖిల్ పెళ్లి తర్వాత రిలీజ్ అయినా తొలి చిత్రం ఇదే. జైనబ్ తన జీవితంలోకి వచ్చాక అఖిల్ కెరీర్ లో సూపర్ సక్సెస్ అందుకున్నారు. సక్సెస్ మీట్ లో జైనబ్ కూడా పాల్గొన్నారు. అయ్యగారు నంబర్ 1 అంటూ ముద్దుగా కామెంట్ చేసి మురిసిపోయింది. అయితే పెళ్ళికి ముందు నుంచి జైనబ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. ఒకరకంగా చెప్పాలి అంటే ట్రోలింగ్ అనే అనాలి.

35
అఖిల్, జైనబ్ ఏజ్ గ్యాప్
Image Credit : our own

అఖిల్, జైనబ్ ఏజ్ గ్యాప్

అఖిల్ కంటే జైనబ్ వయసులో పెద్దవారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ వీళ్లిద్దరి రిలేషన్ బయటపడ్డ క్షణం నుంచే మొదలయ్యాయి. ఆమె మతం గురించి కూడా కామెంట్స్ చేశారు. ఈ ట్రోలింగ్ పై అఖిల్ ఎట్టకేలకు స్పందించాడు. జైనబ్ నాకు పరిచయం అయినప్పుడు మా మధ్య వయసు వ్యత్యాసం, ఆమె మతం గురించి మేము ఆలోచించలేదు.

45
పెళ్ళికి ముందే తెలుసు
Image Credit : Instagram

పెళ్ళికి ముందే తెలుసు

కానీ వీటి గురించి పెళ్ళికి ముందే మాట్లాడుకున్నాం. జనాలు ఈ విషయాలపై ట్రోల్ చేస్తారని తెలుసు. పెళ్లి తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ గురించి పట్టించుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోవాలా లేక మా ఇద్దరి 50 ఏళ్ళ జీవితం గురించి ఆలోచించాలా అని ప్రశ్నించుకున్నప్పుడు జీవితం గురించే ఆలోచించడం మొదలుపెట్టా.

55
కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది
Image Credit : X/@AnnapurnaStdios

కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది

ఒక్కసారి పెళ్లయ్యాక కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తాయి. వాటికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని జైనబ్ కి ముందే చెప్పా. ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా ఇద్దరి మధ్య అద్భుతమైన అండర్ స్టాండింగ్ ఉంది. అందుకే మేమిద్దరం వయసు, మతం, కులం దాటి ఆలోచించగలుగుతున్నాం అని అఖిల్ తెలిపారు. తాను మానసికంగా కష్టకాలంలో ఉన్నపుడు జైనబ్ అందించిన సపోర్ట్ మరచిపోలేను అని అఖిల్ తన భార్యపై ప్రశంసలు కురిపించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది
Recommended image2
Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved