- Home
- Entertainment
- ఒకే ఊరి నుంచి వచ్చిన చిరంజీవి, కృష్ణంరాజు మధ్య ఇంత పెద్ద యుద్ధం జరిగిందా..ఆ ఒక్క సంఘటన చాలు
ఒకే ఊరి నుంచి వచ్చిన చిరంజీవి, కృష్ణంరాజు మధ్య ఇంత పెద్ద యుద్ధం జరిగిందా..ఆ ఒక్క సంఘటన చాలు
కృష్ణరాజు, చిరంజీవి ఇద్దరూ మొగల్తూరు నుంచి వచ్చి టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న హీరోలు. 1984లో వీరిద్దరూ తమ చిత్రాలతో ఎలా పోటీ పడ్డారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

కృష్ణంరాజు, చిరంజీవి బాక్సాఫీస్ యుద్ధం
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. చిరంజీవి, కృష్ణంరాజు ఇద్దరూ మొగల్తూరు నుంచి వచ్చి చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు. కృష్ణంరాజు చిరంజీవి కన్నా సీనియర్. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో డ్యాన్స్ చాలా బాగా చేసేవాడు అని, తామంతా చిరంజీవిని ఎంకరేజ్ చేసినట్లు కృష్ణం రాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అల్లుళ్ళొస్తున్నారు, గూండా Vs బాబులుగాడి దెబ్బ
అలాంటి వీరిద్దరూ 1984లో బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో చిరంజీవి నటించిన అల్లుళ్ళొస్తున్నారు, గూండా చిత్రాలు కొద్ది రోజుల గ్యాప్ లోనే విడుదలయ్యాయి. అల్లుళ్ళొస్తున్నారు ఫిబ్రవరి 11న విడుదలయింది. గూండా చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ రెండు చిత్రాల మధ్యలో కృష్ణంరాజు నటించిన బాబులుగాడి దెబ్బ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలయింది. వీటిలో చిరంజీవి గూండా, కృష్ణంరాజు బాబులుగాడి దెబ్బ చిత్రాలు విజయం సాధించాయి.
దేవాంతకుడు Vs కొండవీటి నాగులు
చిరంజీవి, విజయశాంతి నటించిన దేవాంతకుడు చిత్రం ఏప్రిల్ 12న విడుదల కాగా కృష్ణంరాజు కొండవీటి నాగులు మూవీ ఏప్రిల్ 21న విడుదలైంది. వీటిలో చిరంజీవి దేవాంతకుడు యావరేజ్ కాగా కృష్ణంరాజు కొండవీటి నాగులు నిరాశపరిచింది.
ఛాలెంజ్ Vs రారాజు
ఆ తర్వాత ఆగస్టులో మరోసారి చిరంజీవి, కృష్ణంరాజు మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. ఆగస్టు 9న విడుదలైన చిరంజీవి ఛాలెంజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వారం ముందు కృష్ణంరాజు రారాజు చిత్రం విడుదలైంది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో చిరంజీవి, కృష్ణం రాజు ఇంటిగుట్టు, భారతంలో శంఖారావం చిత్రాలతో పోటీ పడ్డారు. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ లో మరోసారి చిరంజీవి, కృష్ణంరాజు పోటీ పడ్డారు. ఆ నెలలో విడుదలైన చిరంజీవి రుస్తుం, కృష్ణంరాజు రౌడీ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
రాజకీయాలకు అతీతంగా ఫ్రెండ్షిప్
బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడిన ఈ మొగల్తూరు హీరోలు రియల్ లైఫ్ లో మంచి స్నేహితులు. చిరంజీవి ఎవ్వరికీ హాని చేయడు. కుదిరితే సాయం చేస్తాడు. చిరంజీవి నాకు మంచి మిత్రుడు అని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకసారి చిరంజీవి బర్త్ డే రోజున పార్టీకి వెళ్ళాను. నా చేతులో ఉన్న కెమెరా చూసి చిరు ఆశ్చర్యపోయాడు. ఇది చాలా కాస్ట్లీ నేను లండన్ లో చూశాను అని చిరంజీవి అన్నారు. నేను వెంటనే ఆ కెమెరాని చిరంజీవి మేడలో వేసి నీ బర్త్ డే కి ఇదే నా గిఫ్ట్ అని చెప్పినట్లు కృష్ణం రాజు పేర్కొన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు మధ్య స్నేహ బంధం ఎంత గొప్పదో చూడడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా కృష్ణంరాజు చేరారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినప్పటికీ రాజకీయాలకు అతీతంగా వీరి స్నేహం కొనసాగింది.