- Home
- Entertainment
- అఖిల్ భార్య నాగార్జునకి ఎలా బర్త్ డే విషెస్ చెప్పిందో తెలుసా.. ఆమె పిలుపు వింతగా ఉందే, వైరల్ పోస్ట్
అఖిల్ భార్య నాగార్జునకి ఎలా బర్త్ డే విషెస్ చెప్పిందో తెలుసా.. ఆమె పిలుపు వింతగా ఉందే, వైరల్ పోస్ట్
నాగార్జున 66వ బర్త్ డే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాక నాగార్జున జరుపుకున్న బర్త్ డే ఇది.

అక్కినేని నాగార్జున శుక్రవారం రోజు తన 66వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, సెలెబ్రిటీలు నాగార్జునకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు అందాయి. నాగార్జున చివరగా రజినీకాంత్ కూలీ, ధనుష్ కుబేర చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
త్వరలో నాగార్జున తన 100 వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున 66వ బర్త్ డే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాక నాగార్జున జరుపుకున్న బర్త్ డే ఇది. గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ లో అఖిల్, జైనబ్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది.
అఖిల్ భార్య జైనబ్ బడా పారిశ్రామిక వేత్త అయిన జుల్ఫీ కుమార్తె. జైనబ్ నుంచి నాగార్జున సర్ప్రైజింగ్ బర్త్ డే విషెస్ అందుకున్నారు. జైనబ్ ఎంతో అందంగా తన మామగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె నాగార్జునని పిలిచిన విధానం వింతగా ఉన్నపప్టికీ.. ఆమె పిలుపులో ఎంతో ఆప్యాయత కనిపిస్తోంది.
ఇంతగా జైనబ్ నాగార్జునకి ఏవిధంగా బర్త్ డే విషెస్ చెప్పిందో ఇప్పుడు చూద్దాం. హ్యాపీ బర్త్ డే డాడ్.. మీరు ప్రతి రోజూ మాకు ఆదర్శంగా ఉంటున్నారు. ప్రతి విషయంలోనూ మీరు నిజమైన కింగ్. మీలాంటి తండ్రి ఉండడం అదృష్టం అంటూ జైనబ్ నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
నాగార్జునని మామగారు అని కాకుండా తండ్రి అని సంబోధించడం విశేషం. కోడలితో నాగార్జునకి ఎలాంటి బాండింగ్ ఉందో జైనబ్ చేసిన పోస్ట్ ద్వారా అర్థం అవుతోంది. నాగార్జునని ఆమె మామగారిలా కాకుండా తండ్రిలా భావిస్తోంది.