- Home
- Entertainment
- Top 5 OTT Movies: ఓటీటీలో టాప్ 5 రీసెంట్ బెస్ట్ మూవీస్.. ఆ ఒక్క మూవీని భార్య భర్తలు అస్సలు మిస్ కాకండి
Top 5 OTT Movies: ఓటీటీలో టాప్ 5 రీసెంట్ బెస్ట్ మూవీస్.. ఆ ఒక్క మూవీని భార్య భర్తలు అస్సలు మిస్ కాకండి
Top 5 OTT Movies: ఇటీవల ఓటీటీలో విడుదలైన టాప్ 5 బెస్ట్ మూవీస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇందులో థ్రిల్లర్స్, కామెడీ సినిమాలతో పాటు భార్య భర్తలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా కూడా ఉంది.

Top 5 OTT Movies
ఇంట్లోనే కూర్చుని సినిమా చూడాలనుకునేవాళ్లకు ఓటీటీ ఇటీవల మంచి వినోదం అందించే ఫ్లాట్ ఫామ్ గా మారింది. వెబ్ సిరీస్ లు, సినిమాలు రియాలిటీ షోలు ఇలా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఓటీటీల ద్వారా అందుతోంది. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన టాప్ 5 బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 సినిమాలని ఆడియన్స్ అస్సలు మిస్ కాకూడదు.
1.ఆన్ పావం పొల్లాతతు
రియో రాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో తెలుగులో అందుబాటులో ఉంది. భార్య భర్తలు, ప్రేమలో ఉన్న జంటలు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. ప్రస్తుతం అమ్మాయిలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు.. భార్య భర్తల మధ్య గొడవ జరిగి విడాకుల వరకు వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయి ? కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఇలాంటి అంశాలని ఈ చిత్రంలో ఎంటర్టైనింగ్ గా అద్భుతంగా చూపించారు. శివ(రియో రాజ్), శక్తి(మాళవిక మనోజ్) ఇద్దరూ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉండాలని శివ తన భార్యకి ఫ్రీడమ్ ఇస్తాడు. దానిని అలుసుగా తీసుకున్న శక్తి ఇంటిని పట్టించుకోకుండా రీల్స్ తో కాలం గడిపేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి ? చివరికి ఈ జంట తిరిగి ఒక్కటయ్యారా ? అనేది కథ.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
2. స్టీఫెన్
ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. నగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మొత్తం 9 మంది అమ్మాయిలు హత్యకు గురవుతారు. ఆ తొమ్మిది మందిని చంపింది తానే అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. అతడి బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఆ వ్యక్తి ఎందుకు లొంగిపోయాడు ? ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనే వివరాలు సినిమాలోనే చూడాలి. ఈ చిత్రంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించారు.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
3. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఒక విలేజ్ లో హీరోకి ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఈ షూట్ తర్వాత హీరో ఓ సమస్యలో పడతాడు. ఆ సమస్య చుట్టూ కామెడీతో రూపొందించిన సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి : జీ 5
4. ది గర్ల్ ఫ్రెండ్
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్స్ ఫ్రెండ్ చిత్రం ఇటీవల థియేటర్స్ లో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీలో అలరిస్తోంది. పీజీ చదువుకునే అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడతారు. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరు బాగా లోతుగా తెలుసుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. అసలు ఇద్దరి మధ్య సమస్య ఎందుకువచ్చింది ? ఆ అబ్బాయి ఎలాంటి వాడు ? అనే వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
5. కుట్రం పరింధవాన్
థ్రిల్లర్ అంశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సీట్ ఎడ్జ్ పై కూర్చుని చూసేలా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ని కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మంచి టైం పాస్ ఉంటుంది.
ఎక్కడ చూడాలి : సోనీ లివ్

