Brahmamudi: టెన్షన్ తో వణికిపోతున్న మీనాక్షి.. రాజ్ మీద నిఘా పెట్టిన కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో అత్తింట్లో అడుగు పెట్టి ఇప్పుడిప్పుడే భర్త మనసులో స్థానం సంపాదించుకుంటున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను మియాపూర్ పోవాలి అంటుంది అప్పు. అదేంటి మీ ఇల్లు అటు కాదు కదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కళ్యాణ్. షాపింగ్ ఉంది అది చేసుకుని వెళ్లాలి అంటుంది కప్పు. షాపింగా అంటూ షాక్ అవుతాడు కళ్యాణ్. అవును ఏం నీకు ఇబ్బంది చెప్పు నేను ఆటోలో వెళ్తాను అంటుంది అప్పు. ఒకసారి మాటిస్తే వెనక్కి తగ్గే వంశం కాదు మాది అంటూ గొప్పగా చెప్తాడు కళ్యాణ్.
అవును ఇప్పుడే చూశాను మీ ఇంట్లో అందరికీ అన్ని ఎక్కువే అని వెటకారం గా ఉంటుంది అప్పు. మరి నాకో అంటాడు కళ్యాణ్. నీకు అన్నీ తక్కువే అని ఆట పట్టిస్తుంది అప్పు. మరోవైపు ప్రశాంతంగా వంట చేసుకుంటున్నా చెల్లెల్ని చూసి టెన్షన్ పడుతుంది మీనాక్షి. నేను నీకు ఏమన్యాయం చేశాను వంట చేసుకునే భర్త చాటు భార్యని అలాంటిది నన్ను మనుషుల్ని కిడ్నాప్ చేసే స్థాయికి తీసుకువచ్చేసావు.
ఇంక మిగిలింది ఒకటే హత్య చేయటం అది నీతోనే ప్రారంభిస్తాను అంటూ చెల్లెలు మీద విరుచుకుపడుతుంది. మరిది గారు స్టోర్ రూమ్ కి వెళ్తారేమో అని నీకు భయం కూడా లేదా అంటుంది. నిలువెత్తు మనిషిని కిడ్నాప్ చేసి ఇంత ప్రశాంతంగా వంట చేసుకుంటున్నావు అది గుండా గుండ్రయా అంటూ కేకలు వేస్తుంది. నువ్వు ఆవేశపడకు ప్రశాంతంగా ఉండు అని అక్కకి నచ్చచెప్పితుంది కనకం.
అయినా టెన్షన్ ఆపుకోలేక మీనాక్షి కృష్ణమూర్తి దగ్గరికి వెళ్లి మీకు స్టోర్ రూమ్ లో పనేమీ లేదు కదా నీకేమైనా అవసరమైతే చెప్పండి నేను చేసి పెడతాను అంటుంది. స్టోర్ రూమ్ లో నాకేం పని ఉంటుంది అయినా ఈ పనులు చేయడానికి మీకు ఏమీ పని లేదా అని అడుగుతాడు కృష్ణమూర్తి. అలాంటిదేమీ లేదు అనుకొని కంగారుపడుతూనే సోఫాలో కూర్చుంటుంది. మరోవైపు ఇంటికి ఏదో మూట తీసుకువస్తాడు రాజ్.
దానిని దొంగ చాటుగా దొడ్డి గుమ్మం వైపు తీసుకువచ్చి అక్కడినుంచి తన రూమ్ కి తీసుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా చూస్తున్న కావ్య రాజ్ మీద నిఘా పెడుతుంది. దొంగ చాటుగా చూస్తున్న కావ్యని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ప్రకాష్. మా ఆయన ఏదో తీసుకువచ్చారు బ్యాక్ డోర్ ద్వారా తీసుకు వెళ్తున్నారు అది ఏంటో అని చూస్తున్నాను అంటుంది కావ్య.
మా వాడు అలా చేయడే అని రాజ్ ని వెనకేసుకొస్తాడు ప్రకాష్. కావాలంటే మీరే వెళ్లి చూడండి అంటుంది కావ్య. సరే అంటూ బ్యాక్ డోర్ వైపు వెళ్తాడు ప్రకాష్. అప్పటికే ఆ మాటని పైకి లాగుతూ ఉంటాడు రాజ్. అంతలోనే సుభాష్ రావటంతో కంగారుపడి తాడు వదిలేస్తాడు నేరుగా వెళ్లి ప్రకాష్ తల మీద పడుతుంది ఆ మూట. కంగారు పడుతూనే తండ్రితో మాట్లాడి పంపించేసిన తర్వాత కిందికి చూసేసరికి ప్రకాష్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు.
కిందికి వెళ్లి అతనికి స్పృహ వచ్చేలాగా చేసి మాటల్లో పెట్టి అతనిని అక్కడ నుంచి పంపించేస్తాడు రాజ్. మరోవైపు స్టోర్ రూమ్ వైపు వెళ్ళబోతున్న కృష్ణమూర్తిని అడ్డగించి మీకేం కావాలో నాకు చెప్పండి అని కంగారుగా అడుగుతుంది మీనాక్షి. నా పని నన్ను చేసుకొని ఇవ్వండి అని వదిన గారిని కసురుకుంటాడు కృష్ణమూర్తి. ఈరోజు నా పని అయిపోయింది అని టెన్షన్ పడుతుంది మీనాక్షి. స్టోర్ రూమ్ లోకి వెళ్లిన కృష్ణమూర్తి ప్రశాంతంగా బయటికి రావడంతో ఆశ్చర్య పోతుంది.
ఆ గదిలో సేటు లేడా అనుకుంటూ వెళ్లి స్టోర్ రూమ్ లో చూస్తుంది. అక్కడ సేటు లేకపోతే మరింత కంగారుపడి కనకంతో అదే విషయం చెప్తుంది. తను ప్రశాంతంగా నేనే దాచి పెట్టాను అని చెప్తుంది. ఎంత ప్రొఫెషనల్ కిడ్నాపర్ గా తయారయ్యావు అంటూ రిలాక్స్డ్ గా ఒక మూట మీద కూర్చుని ఇంతకీ వాడిని ఎక్కడ దాచి పెట్టావు అని అడుగుతుంది మీనాక్షి. నువ్వు కూర్చున్నది వాడి మీదే అని కనకం అనటంతో కంగారుపడి అక్కడినుంచి లేచిపోతుంది మీనాక్షి. మరోవైపు రైతు బజార్ అంతా కళ్యాణ్ చేత మూయిస్తూ తీసుకువస్తుంది అప్పు.
అంతలోనే రౌడీలు వచ్చి ఒంటి మీద ఉన్న బంగారాన్ని బయటకు తీయమని బెదిరిస్తారు. బంగారం నా దగ్గర ఎందుకు ఉంటుంది డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటుంది అనటంతో రౌడీలు దృష్టి కళ్యాణ్ మీద పడుతుంది. నన్ను ఇరికించేసావేంటి అంటాడు కళ్యాణ్. రౌడీలు మెడలో చైన్ తీసేయమనటంతో బుద్ధిగా చైన్ తీసి ఇచ్చేయబోతాడు. ఏం చేస్తున్నావ్ అంటూ కళ్యాణ్ ని మందలిస్తుంది అప్పు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.