- Home
- Entertainment
- 300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి న్యూమరాలజీ ఫాలో అవుతున్న హీరోయిన్.. పేరులో మార్పు
300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి న్యూమరాలజీ ఫాలో అవుతున్న హీరోయిన్.. పేరులో మార్పు
మీనాక్షి చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె వరుస సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి వరుస హిట్స్ కొడుతున్నప్పటికీ న్యూమరాలజీ ఫాలో అవుతోంది.

చిత్ర పరిశ్రమపై న్యూమరాలజీ ప్రభావం
మీనాక్షి చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె వరుస సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది. తమిళం, తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేస్తోంది. సాధారణంగా ఎవరైనా సెలెబ్రిటీ తనకి కెరీర్ లో కలసిరాకుంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ లాంటివి ఫాలో అవుతుంటారు. న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని, విజయాలు దక్కుతాయని ఆశిస్తారు.
మీనాక్షి చౌదరి పేరులో మార్పు
కానీ మీనాక్షి చౌదరి వరుస హిట్స్ కొడుతున్నప్పటికీ న్యూమరాలజీ ఫాలో అవుతోంది. న్యూమరాలజీ ప్రకారం ఆమె తన పేరులో మరొక 'a' అక్షరం జోడించి ‘Meenaakshi Chaudhary’గా మార్చుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ మార్పు కనిపిస్తోంది.
మరిన్ని అవకాశాల కోసమే..
ఈ మార్పు ద్వారా ఆమె తన కెరీర్ మరింత బలోపేతం అవుతుందని, కొత్త అవకాశాలు వస్తాయని, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో, ‘ది గోట్’ చిత్రంలో విజయ్‌తో నటించిన మీనాాక్షి, ప్రస్తుతం టాప్ సౌత్ ఇండియన్ డైరెక్టర్లకు ఫేవరెట్‌గా మారుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సంచలన హిట్
ఇక త్వరలోనే నాగ చైతన్య, నవీన్ పొలిశెట్టి సినిమాల్లో ఆమె కనిపించనున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అయితే సంచలనంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. రీజినల్ చిత్రాల్లో ఆల్ టైం హిట్ గా నిలిచింది. గతంలో మీనాక్షి హిట్ 2 చిత్రంతో కూడా సూపర్ హిట్ కొట్టింది.స్క్రీన్ ప్రెజెన్స్, నటనా నైపుణ్యం కలబోసిన మీనాాక్షి, ప్రస్తుతం టాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.
న్యూమరాలజీతో పేరు మార్చుకున్న సెలెబ్రిటీలు
ఈ సందర్భంగా న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్న బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ఇతర ప్రముఖులు పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్, రాణి ముఖర్జీ, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు వంటి వారు పేర్లలో అక్షరాల మార్పులు చేసి సక్సెస్ సాధించారు. సాయి ధరమ్ తేజ్ తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు.