టాలీవుడ్ యంగ్ హీరోతో పెళ్లి..? మనసులో మాట బయటపెట్టిన మీనాక్షి చౌదరి
ఈమధ్య కాలంలో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎక్కువైపోయాయి. ఈక్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. యంగ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు తన మనసులో మాట బయటపెట్టింది స్టార్ హీరోయిన్.

మీనాక్షి చౌదరి పెళ్లి వార్తలు..
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నా, లక్కీ భాస్కర్, గుంటూరు కారంలాంటి హిట్ సినిమాలు ఆమెఖాతాలో ఉన్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ... టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మీనాక్షీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్అవుతున్నాయి. ప్రస్తుతం మీనాక్షీ చౌదరి నవీన్ పొలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. జనవరి 14న ఈసినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మీనాక్షి ప్రమోషన్స్ కి వెళ్తుంటే.. అక్కడ పెళ్లికి సబంధించిన ప్రశ్నలు ఆమెకు ఎదురవుతున్నాయి.
పెళ్లి వార్తలపై మీనాక్షి చౌదరి స్పందన..
మీనాక్షి చౌదరి తన పెళ్లి గురించి వస్తున్నవార్తలపై తాజాగా స్పందించింది. అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ రూమర్లపై మాట్లాడింది. ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ..''నాపై ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఎటువంటి పెళ్లి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారంచేస్తున్నారు. ఇవి నా కెరీర్ కు ఇబ్బందికరంగా మారాయి. అసలు నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలువంటి నిజం లేదు అని'' ఆమె తేల్చి చెప్పారు.
యంగ్ హీరోతో మీనాక్షి చౌదరి ప్రేమ నిజమేనా?
ఇక మీనాక్షి చౌదరి కెరీర్ విషయానికి వస్తే.. కథ , పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలో నటించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని మీనాక్షి తెలిపారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, కెరీర్ పరంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నానని ఆమె అన్నారు. అందుక ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.ఇటీవల టాలీవుడ్‌కు చెందిన ఒక యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారని, కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం జరగబోతోందని పలు పుకార్లు వినిపించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై ఇప్పటికే మీనాక్షి టీమ్ స్పందించి ఖండించినప్పటికీ, అవి ఆగకపోవడంతో చివరకు మీనాక్షి స్వయంగా స్పందించారు.

