- Home
- Entertainment
- కృష్ణ, ఎన్టీఆర్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? సీనియర్ నటుడు చలపతిరావు చెప్పిన అసలు నిజం
కృష్ణ, ఎన్టీఆర్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? సీనియర్ నటుడు చలపతిరావు చెప్పిన అసలు నిజం
పెద్దాయన ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో అందరికి గౌరవమే. హీరోలంతా ఆయన్ను ఎంతో గౌరవించేవారు. కొంత మంది హీరోలతో కొన్ని వివాదాలు ఉన్నా తర్వాత అవి పెద్దగా పట్టించుకోలేదు. కాని కృష్ణతో ఎన్టీఆర్ కు పెద్ద వివాదాలు జరిగాయని అంటుంటారు. ఈ విషయంలో నిజం ఎంత?

తెలుగు సినీపరిశ్రమకు పునాదివేసిన స్టార్ నటులలో నందమూరి తారక రామారావు ముందుంటారు. ఆయన తరువాత అక్కినిని నాగేశ్వరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి నటులు కూడా తెలుగు జాతి ఖ్యాతిని పెంచుతూ వచ్చారు. ఎవరికి వారు నటనలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పెద్దాయన ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు తెలుగు సినిమాకు ఎనలేని ఖ్యాతిని తీసుకువచ్చారు.
అప్పట్లో హీరోలంతా సినిమాల పరంగా పోటీ పడ్డా.. పర్సనల్ గా ఎంతో ప్రేమగా ఉండేవారు. అన్నదమ్ముల్లా మెలిగేవారు. ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబంలా భావించేవారు. చిన్న చిన్న మన్పర్ధలు వచ్చినా.. వాటిని కొతం కాలానికి మర్చిపోయి మళ్లీ కలుసుకునేవారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ కు అక్కినేనికి మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయి. కాని ఎక్కడా కూడా వీరు ఒకరిని మరొకరు కించపరుచుకోలేదు. కాని ఎన్టీఆర్ కు కృష్ణకు మాత్రం కాస్త ఎక్కువగానే గొడవలు జరిగాయని అంటుంటారు. పెద్దాయన మీద కోపంతో కృష్ణ ఆయన మీద సినిమాలు కూడా తీశారని టాక్.
మరి అందులో నిజం ఎంత అనేది అప్పటి వారికి బాగా తెలుసు. అయితే అసలు వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. ఈ విషయంలో దివంగత సీనియర్ నటుడు చలపతిరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
వారిద్దరిని చాలా దగ్గర నుంచి చూసిన చలపతిరావు ఇద్దరి మధ్య మనస్పర్ధల విషయంలో ఏమన్నారంటే? ఎన్టీఆర్ కృష్ణ మధ్య పెద్దగా చెప్పుకోవలసిన శత్రుత్వం ఏమీ లేదు. పెద్దాయన దానవీరశూరకర్ణ సినిమా చేస్తున్న టైమ్ లో కృష్ణ కురుక్షేత్రం సినిమా మొదలు పెట్టాడు.
ఈ రెండు సబ్జెక్టులు ఒకటే కాబట్టి.. కృష్ణను పిలిచి ఎందుకు బ్రదర్ నా సినిమా వస్తుంది కదా, రెండు ఒకటే కథలు, మీ సినిమా ఆపేయండి అని అడిగాడు. ఒకటి చేస్తున్నాను కదా..మళ్లీ ఆసినిమా ఎందుకు ఇప్పుడే చేస్తే ఆ సినిమాకే నష్టం కదా అన్న ఉద్దేశ్యంలో పెద్దాయన చెప్పారు.
కాని కృష్ణ మాత్రం వినలేదు సినిమా చేయాల్సిందే అన్నారు. కాని ఆసినిమా ప్లాప్ అయ్యింది. దానవీరశూరకర్ణ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇలానే అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో కూడా పోటీ జరిగింది.
కాని కృష్ణ మాత్రం ఈ సారి పట్టుదలతో తన సినిమా హిట్ కొట్టాల్సిందే అని చెప్పి మన్యంలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉంటూ సీతారామరాజు గురించి అంతా రీసెర్చ్ చేశాడు. పక్కా ఇన్ఫర్మేషన్ తో సినిమాను చేసి హిట్ కొట్టాడు. ఇలా సినిమాల పరంగా వీరిమధ్య విభేదాలు ఉన్నాయి కాని అవి వారు కూడా పర్సనల్ గా తీసుకోలేదు అని అన్నారు.
బయట మీడియా వాళ్లు చేసే హడావిడి వల్ల అది పెద్దదని అనిపించిందన్నారు చలపతిరావు. ఇక వీరిద్దరి సినిమాల్లో తాను నటించానని, చలపతిరావు అన్నారు. ఆతరువాత కాలంలో ఇద్దరు హీరోలు కలిసిపోయారు. ఎన్టీఆర్ కంటే చాలా చిన్నవాడు కృష్ణ. ఈ విభేదాల తరువాత కూడా ఇద్దరు కలిసి చాలా వేదికలను పంచుకున్నారు. రాజకీయంగా వారి దారులు వేరయినా.. సినిమాలకు సబంధించి మాత్రం ఇద్దరు అన్నదమ్ముల్లా ఉందేవారు.