- Home
- Entertainment
- 6 సినిమాలు, 150 కోట్ల ఆస్తి, లగ్జరీ లైఫ్ ను గడుపుతున్న యంగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
6 సినిమాలు, 150 కోట్ల ఆస్తి, లగ్జరీ లైఫ్ ను గడుపుతున్న యంగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
6 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు, భారీ రెమ్యునరేషన్ తో కోటీశ్వరుడయ్యాడు. ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసి 10 ఏళ్లు కాకుండానే ఇండస్ట్రీని ఏలుతున్న ఈ యంగ్ స్టార్ దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులు సంపాదించాడు. ఇంతకీ ఎవరా యంగ్ డైరెక్టర్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే చాల కష్టపడాల్సి వచ్చేది. ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసి, సినిమాలు డైరెక్ట్ చేసి, అవి హిట్ అయ్యేసరికి వయసైపోయేది. కాని ఇప్పుడు టాలెంట్ ఉన్న దర్శకులు దూసుకుపోతున్నారు. యంగ్ జనరేషన్ స్టార్స్ కు డైరెక్టర్స్ గా ఎదగడానికి పెద్దగా టైమ్ పట్టడంలేదు. చిన్న వయస్సులోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం సాధిస్తున్నారు. అలానే ఓ దర్శకుడు విజయ్ , రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలకు హిట్ సినిమాలకు ఇచ్చాడు. 6 సినిమాలతోనే కోటీశ్వరుడు అయిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు లోకేష్ కనకరాజ్.
చిన్న వయసులోనే విజయ్, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నా లోకేష్ కనకరాజ్, తక్కువ సమయంలోనే కోటీశ్వరుడయ్యారు.కోయంబత్తూరులోని కినత్తుక్కడవులో పుట్టి పెరిగిన లోకేష్ కనకరాజ్, 2016లో 'అవ్యయల్' అనే ఆంథాలజీ షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఈ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ లోకేష్ ను దర్శకుడిగా మార్చింది. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'మానగరం'. 2017లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, మునీష్కాంత్, చార్లీ, శ్రీ లాంటి యంగ్ స్టార్స్ నటించారు.
2019లో కార్తి నటించిన 'ఖైదీ' సినిమాతో లోకేష్ జాతకమే మారిపోయింది. ప్రస్తుతం హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా ఏ సినిమా హిట్ అయ్యే అవకాశం లేదు. కాని లోకేష్ మాత్రం పాటలు, హీరోయిన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా స్టార్ హీరోతో సినిమా చేసి సక్సెస్ సాధించాడు. అది కూడా సినిమా మొత్తాన్ని రాత్రి పూట షూట్ చేసి కంప్లీట్ చేశారు. ఈ యాక్షన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఆడియన్స్ నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. తెలుగులో కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ విజయం తర్వాత లోకేష్ కనకరాజ్ వరుసగా స్టార్ హీరోల తో సినిమాలు చేశారు. విజయ్ తో 'మాస్టర్', విజయ్ సేతుపతి, కమల్ హాసన్ నటించిన 'విక్రమ్', విజయ్ తో మళ్లీ 'లియో' వంటి సినిమాలకు దర్శకత్వం వహించి వరుస విజయాలు అందుకున్నారు. ఇక చాలా కాలంగా ఫెయిల్యూర్స్ చూసిన కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి చూపించాడు.
ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజినీకాంత్‌తో 'కూలీ' సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్, మోనిషా బ్లెస్సీ, జూనియర్ ఎంజీఆర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. పూజా హెగ్డే, ఆమిర్ ఖాన్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. 'కూలీ' ఆగస్టు 14న విడుదల కానుంది.
చిన్న వయసులోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం సాధించిన లోకేష్ కనగరాజ్ విజయ్, కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక లోకేష్ కనకరాజ్ ప్రతి సినిమాకు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఆయన ఆస్తుల విలువ కూడా దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చెన్నైలో సొంత ఇల్లు ఉన్న లోకేష్ కనకరాజ్, లెక్సస్, BMW వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. త్వరలో అజిత్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలతో సినిమాలు కమిట్ అయ్యాడు యంగ్ డైరెక్టర్.