- Home
- Entertainment
- మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ ఏ భార్య కొడుకో తెలుసా? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడంటే?
మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ ఏ భార్య కొడుకో తెలుసా? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కొడుకు మార్క్ శంకర్ చదివే స్కూల్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుందని, అతను గాయపడ్డాడని తెలిసింది. ఈ విషయం తెలిసి పవన్ హుటాహుటిన సింగపూర్ వెళ్తారని భావించారు. కానీ తాను అల్లూరి సీతారామరాజు జిల్లాలఓ పర్యటించాల్సి ఉంది, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. దీంతో ఆయా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాకనే తాను కొడుకు వద్దకు వెళ్తానని చెప్పారు. జనాలకు మాట ఇచ్చినట్టుగానే ఆ మాటమీద నిలబడటం కోసం ఆయా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తున్నారు. అయితే గాయపడ్డ మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకు? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరం. మరి ఆ కథేంటో చూద్దాం.

Pawan Kalyan son
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురి కావడం ఆయన అభిమానులను, జనసేన కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తుంది.
సింగపూర్‌లోని మార్క్ శంకర్ చదువుకునే స్కూల్‌లో ఈ అగ్నిప్రమాదం జరగడంతో అతను గాయాలపాలయ్యాడని తెలిసింది. చేతులు, కాళ్లకి గాయాలయ్యాయని, ఊపిరితిత్తులకు పొగ వెళ్లి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడిందని పవన్ టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Pawan Kalyan, Nandini
ఇదిలా ఉంటే పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న నేపథ్యంలో ఏ భార్యకి ఎంత మంది పిల్లలు, మార్క్ శంకర్ ఏ భార్య కొడుకు అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి ఆ వివరాలు చూస్తే,
పవన్ కళ్యాణ్ మొదట 1997లో నందిని ని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కుదరలేదు, దీంతో రెండేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. కానీ విడాకులు రావడానికి పదేళ్లు పట్టింది. అలా 2008లో అధికారికంగా విడిపోయారు. వీరికి సంతానం లేదు.
pawan kalyan, renu desai
నందినితో విడిపోయాక రేణు దేశాయ్‌కి దగ్గరయ్యాడు పవన్. వీరిద్దరు చాలా ఏళ్లపాటు కలిసి సహజీవనం చేశారు. నందినితో విడాకులు రాకపోవడంతో అనధికారికంగానే కలిసి ఉన్నారు. వీరికి ఇద్దరు సంతానం. మొదట అకీరా నందన్ జన్మించారు. పెళ్లికి ముందే అకీరా పుట్టాడు. 2009లో రేణు దేశాయ్, పవన్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఏడాదికి ఆధ్య జన్మించింది. ఇలా రేణు దేశాయ్, పవన్ లకు ఇద్దరు సంతానంగా చెప్పొచ్చు. వీరి బాగోగులు రేణు దేశాయ్ చూసుకుంటున్నా, పవన్ కూడా వారికి సపోర్ట్ గా ఉన్నారు. ఆ మధ్య ఎన్నికల సమయంలో అకీరా పవన్ వెంటనే ఉన్న విషయం తెలిసిందే. ఆద్య కూడా పలు మార్లు పవన్‌తో కనిపించింది.
Pawan Kalyan, anna lezhneva
2012లో రేణు దేశాయ్, పవన్ విడిపోయారు. కానీ అప్పటికే రష్యాకి చెందిన నటి అన్నా లెజ్‌నేవాతో ప్రేమలో పడ్డారు పవన్. 2013లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
కూతురు పోలేనా అంజనా పవనోవిచ్ తోపాటు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు. ఇప్పుడు గాయపడ్డ మార్క్ శంకర్ పవనోవిచ్.. అన్నా లెజ్‌నేవా కొడుకు కావడం విశేషం. మార్క్ శంకర్.. అందరికంటే చిన్నవాడు.
pawan kalyan
మరి వీరు సింగపూర్‌లో ఎందుకు ఉన్నారనేది చూస్తే, పవన్ మూడో భార్య సింగపూర్‌లో చదువుకుంటుంది. దీంతో కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నారు.
అంతేకాదు అక్కడ బిజినెస్‌లు కూడా ఉన్నాయట. వాటిని అన్నా చూసుకుంటుందని తెలుస్తుంది. అదే సమయంలో తాను కూడా స్టడీస్ చేస్తూ కుమారుడి మార్క్ ని అక్కడే చదివిపిస్తుంది.
pawan kalyan, mark shankar
మార్క్ ప్రస్తుతం రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌లో చదువుకుంటున్నారని సమాచారం. ఇందులో కిచెన్ లెసెన్స్ చెబుతారట. ఆ మధ్య భార్య అన్నా సింగపూర్‌లో మాస్టర్ డిగ్రీ అందుకుంది. ఆ కార్యక్రమానికి పవన్ కూడా వెళ్లారు.
అంతకు ముందు రష్యాలో ఆసియా దేశాల చరిత్ర చదవడం కోసం ఓరియంటల్ స్టడీస్ చేసింది అన్నా లెజ్‌నేవా. ఇలా స్టడీస్, వ్యాపారాలు చూసుకోవడం కోసం పవన్ భార్య సింగపూర్‌లో ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
read more: ఎన్టీఆర్‌ని కోరిక తీర్చమని అడిగా, అలా ఎలా చేశానో అర్థం కాలేదు.. జయమాలిని షాకింగ్ కామెంట్
also read: పెళ్లైయ్యాక కూడా శ్రీదేవి, హేమా మాలిని, జయప్రదలతో ఎఫైర్ నడిపించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?