- Home
- Entertainment
- Prema Entha Madhuram: ఆర్యలో మొదలైన అనుమానం.. అనుని లేపెయ్యటానికి స్కెచ్ వేసిన మాన్సీ?
Prema Entha Madhuram: ఆర్యలో మొదలైన అనుమానం.. అనుని లేపెయ్యటానికి స్కెచ్ వేసిన మాన్సీ?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో టిఆర్పి రేటింగ్ లో టాప్ ప్లేస్ ని సంపాదించుకుంటుంది. కారణం తెలియకుండా దూరమైనా తన భార్య పిల్లల కోసం తపన పడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బయటికి వెళ్తే ప్రమాదం అని జోగమ్మ చెప్పింది తను చెప్పినవన్నీ ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి అందుకే నువ్వు బయటికి వెళ్ళకు నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా అనుకి కూడా మంచిది అంటుంది శారదమ్మ. అను నా ప్రాణం అమ్మ తనని అలా వదిలేసి నేను ఇంట్లో ఎలా ఉంటాను అంటూ బయలుదేరబోతాడు ఆర్య.
నువ్వు వెళ్తే నా మీద ఒట్టే అంటూ తన మీద బలవంతంగా ఒట్టు వేయించుకుంటుంది శారదమ్మ. ఈ తల్లి గురించి తప్పుగా అనుకోవద్దు నువ్వు బాగుంటేనే అందరూ బాగుంటారు దయచేసి నా మాట విను అంటూ కొడుకుని బ్రతిమాలు ఉంటుంది శారదమ్మ. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ అయినా జోగమ్మ అంత సడన్గా రావటం ఏంటి నన్ను బయటకి వెళ్ళొద్దు అనటం ఏంటి నాకు ఏదో అనుమానంగా ఉంది అంటూ సీసీటీవీ ఫుటేజీ తీసుకురమ్మని నీరజ్ కి చెప్తాడు ఆర్య.
ఒక్కసారిగా కంగారు పడుతుంది మాన్సీ. నీరజ్ సీసీటీవీ ఫుటేజ్ తెచ్చేలోపు కొంచెం దూరంగా వెళ్లి ఎవరికో ఫోన్ చేసి అనుని ఆ ఇంట్లోనూ వీలైతే ఆ ఏరియాలోనో లేకుండా చేసేయమని ఆర్డర్ పాస్ చేస్తుంది మాన్సీ. మరోవైపు పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చలేక సతమతమవుతూ ఉంటుంది అను. బాబు ని తీసుకొని పాలు పడుతుంది.
పాప కూడా ఆకలికి తట్టుకోలేనట్లుగా ఉందమ్మా దానికి కూడా పాలుపట్టు అంటుంది బామ్మ. తన దగ్గర పాలు సరిపోకపోవడంతో బాధతో కన్నీరు పెట్టుకుంటుంది అను. ఏం జరిగిందమ్మ పాలు సరిపోవటం లేదా అని అడుగుతుంది బామ్మ. అవునన్నట్లుగా తల ఊపుతుంది అను. ఈ బామ్మ నీకు కడుపుకి ఎంత తిండి పెడుతుంది కానీ పౌష్టికాహారం పెట్టలేక పోతుంది అందుకే నీకు పాలుపడటం లేదు అని బాధపడుతూ చెప్తుంది బామ్మ.
అను చేతికి డబ్బులు ఇచ్చి పాల డబ్బా తీసుకొని రా అంతవరకు పిల్లల్ని నేను చూసుకుంటాను అనటంతో డబ్బులు తీసుకొని బయటికి వెళుతుంది అను. టైం దాటి పోవడంతో షాపులన్నీ కట్టేస్తారు. ఆ టైంలో రోడ్డుమీదికి వచ్చిన అను మీద ఒక వ్యక్తి కన్ను పడుతుంది. అదే వ్యక్తిని వెళ్లి ఇక్కడ ఎక్కడైనా పాలు దొరుకుతాయా అని అడుగుతుంది అను. పక్క సందులో దొరుకుతాయి అని చెప్తాడు ఆ వ్యక్తి.
అతని మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అనుకి అక్కడ ఎవరు కనిపించకపోవడంతో డౌట్ వచ్చి కారు వెనక్కి వెళ్లి దాక్కుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి కి అను కనిపించకపోవడంతో వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అని అనుని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది అను.
నేను ఆవుల్ని మేపుతాను నా దగ్గర పాలు ఉన్నాయి నాతో రా అని చెప్పి తనతో తీసుకు వెళ్లి ఆవు పాలు ఇచ్చి త్వరగా వెళ్లి నీ బిడ్డల ఆకలి తీర్చు అని పంపిస్తుంది ఆవిడ. ఆవిడకి కృతజ్ఞతలు చెప్పే వెళ్ళిపోతుంది అను. అప్పటికే అను రావడం లేట్ అయిందని కంగారు పడుతూ ఉంటుంది బామ్మ. ఇంటికి వచ్చిన అను జరిగిందంతా బామ్మ కి చెప్పి పాలు కాచి పిల్లలిద్దరికీ తాగిస్తుంది. పాలు తాగిన పిల్లలు ఇద్దరు హాయిగా నిద్రపోతారు. వాళ్ల పరిస్థితికి కన్నీరు పెట్టుకుంటుంది అను.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఆర్య ఆవిడ మన ఇంటికి రెగ్యులర్గా వచ్చే జోగమ్మ కాదు, ఆవిడ కళ్ళల్లోనూ మాటల్లోనూ నిజాయితీ లేదు. మాట్లాడేటప్పుడు ఎవరిదో గైడెన్స్ తీసుకుంటుంది ఆ గైడెన్స్ ఎవరిదో తెలిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు తెలిసి అను కూడా ఇలా మిస్ గైడ్ అయి ఉంటుంది అంటాడు ఆర్య. అప్పటికే మాన్సీ కంగారు పడటం గమనిస్తుంది అంజలి.
టాప్ ఫ్లోర్ లో సిసి ఫుటేజ్ కూడా తీసుకురా ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలుస్తుంది అంటుంది అంజలి. కానీ అక్కడ సిసి వ్యూ లేకపోవడంతో మాన్సీ కనిపించదు. రిలాక్స్ ఫీల్ అవుతుంది మాన్సీ. మరోవైపు మాన్సీ పురమాయించిన రౌడీలు అను ఫోటో పట్టుకుని అను కోసం వెతుకుతూ ఉంటారు. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.