- Home
- Entertainment
- Prema Entha Maduram: ఆర్య వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా.. మద్యం మత్తులో ఊగుతూ వచ్చిన మాన్సీ.. ఏం చేసిందంటే?
Prema Entha Maduram: ఆర్య వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా.. మద్యం మత్తులో ఊగుతూ వచ్చిన మాన్సీ.. ఏం చేసిందంటే?
Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాగసుధ (Raga sudha) సుబ్బు, వాళ్ళ ఇంటికి వచ్చి దేవుడు ఫొటోస్ వైపు చూస్తుంది. కానీ అక్కడ దేవుడు ఫోటోలు ఉండవు వాటి వెనుకాల గన్ కూడా ఉండదు.

ఇక రాగ సుధ (raga sudha) ఇంట్లో కంగారు పడుతూ ఆ గన్ కోసం వెతుకుతూ ఉంటుంది. దాంతో సుబ్బు దేని కోసం వెతుకుతున్నావమ్మా అంటూ వస్తాడు. ఇక ఆ తర్వాత సుబ్బు (Subbu) నువు వెతుకుతున్న ఆ వస్తువు ఇదేనా.. అని గన్ బైయటకి తీస్తాడు. ఇక రాగ సుధ కూడా ఇదే అని చెప్పేస్తుంది. ఇక ఆ గన్ ఎక్కడినుంచి వచ్చిందో కూడా చెప్పేస్తుంది.
ఆ తర్వాత సుబ్బు (Subbu) ఇలా చేయడం తప్పు అని చెబుతాడు. అంతే కాకుండా ఇంకెప్పుడు ఇలా చేయకు అని అంటాడు. ఆ తర్వాత అను, మాన్సీ కి భోజనం తీసుకు వస్తుంది. ఇక అక్కడ ఉన్న నీరజ్ (Neeraj) చాలా థ్యాంక్స్ వదినమ్మ అంటూ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు.
ఆ క్రమంలో ఆ ఆర్య (Arya) , మాన్సీ గురించి అడుగుతాడు. ఇక నీరజ్ తాను ఈరోజు భోజనం చేయను అని చెప్పింది అని అబద్ధం చెప్తాడు. ఇక అను కూడా మాన్సీ డైట్ ఫాలో అవుతుంది అని చెబుతుంది. ఇంకా నిద్ర లేచిన మాన్సీ (Mansi) ఊగుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది.
ఇక మాన్సీ (Mansi) ఫుడ్ పెట్టుకొని ఎవర్నీ పట్టించుకోకుండా అసభ్యకరంగా తింటుంది. ఇక ఆర్య చూస్తుండగా కవర్ చేయడానికి అను, నీరజ్ (Neeraj) లు ఎంతగా ప్రయత్నించినా మాన్సీ అదే విధంగా తింటూ ఉంటుంది.
ఇక ఆర్య (Arya) ముందు మాన్సీ ను చాలా రకాలుగా కవర్ చేయాలని చూస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే నీరజ్, మాన్సీ తిండి తింటూ తాను డైట్ ఫాలో అవుతున్న విషయమే మర్చిపోయింది అని అంటాడు. దాంతో మాన్సీ(Mansi) షాక్ అవుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.