MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఆస్కార్‌ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌, 200కోట్లు ఇస్తా తెప్పించండి

ఆస్కార్‌ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌, 200కోట్లు ఇస్తా తెప్పించండి

Manchu Vishnu: మంచువిష్ణు హీరోగా `కన్నప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆస్కార్‌ అవార్డులపై ఆయన బోల్డ్ కామెంట్‌ చేశారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 15 2025, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
manchu vishnu, rrr oscar

manchu vishnu, rrr oscar

మంచు విష్ణు త్వరలో `కన్నప్ప` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో ఆస్కార్‌ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు వందల కోట్లు ఇస్తాను. ఆస్కార్‌ తెప్పించండి అంటూ ఫైర్‌ అయ్యాడు. మరి మంచు విష్ణు రియాక్షన్‌ కి కారణమేంటి? రాజమౌళి గురించి ఆయన ఏం చెప్పాడనేది చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
manchu vishnu

manchu vishnu

`కన్నప్ప` సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో మంచు విష్ణు పలు యూట్యూబ్‌ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలిచ్చారు. ఇందులో `కన్నప్ప`పై నెగటివిటీ గురించి ఆయన స్పందించారు.

ఈ మూవీ టీజర్‌ విడుదలైతే తమిళంలో, కన్నడ, మలయాళంలో జీరో నెగటివిటీ వచ్చిందని, కానీ తెలుగులోనే 15-20శాతం నెగటివిటీ వచ్చిందన్నారు. తెలుగు వాళ్లే కొందరు పనిగట్టుకుని నెగటివిటీని స్ప్రెడ్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్లు ఏ సినిమానైనా ఇలానే విమర్శిస్తుంటారని తెలిపారు. 
 

36
manchu vishnu

manchu vishnu

ఇతర భాషల వాళ్లకి నచ్చినది, మన తెలుగు వారికి ఎందుకు నచ్చడం లేదు. అవే సీన్లు, అదే షాట్లు, అవే ఎమోషన్స్ కదా అని ప్రశ్నించారు మంచు విష్ణు. ఈ నెగటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన వెల్లడించారు.

రాజమౌళి తీస్తే యాక్సెప్ట్ చేస్తారు అని వెల్లడించారు. సినిమాని సినిమాలాగా చూడాలని తెలిపారు. థియేటర్లో కూర్చొని దాన్ని ఎంజాయ్‌ చేయడం మానేసి ఈకలు వెతుకుతున్నారని తెలిపారు. నా సినిమా అనే కాదు మిగిలిన సినిమాల విషయంలో కూడా ఓవర్‌ ఎనాలసిస్‌ కి వెళ్లిపోతున్నారని తెలిపారు. 
 

46
rrr oscar, keeravani, chandrabose

rrr oscar, keeravani, chandrabose

`ఆర్‌ఆర్‌ఆర్‌` లాంటి గొప్ప సినిమాని తీసిన రాజమౌళిని కూడా విమర్శించరని, ఆస్కార్‌ అందుకుని వచ్చిన తర్వాత కూడా దానిపై ఈకలు తోకలు పీకడం స్టార్ట్ చేశారని తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడమనేది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ మూమెంట్‌.

అసలు ఎంత మందికి అక్కడ ఇన్విటేషన్‌ ఉంటుంది. ఇది మనకు ఒలంపిక్‌ లాంటిది. ఆస్కార్‌ గెలిచిన తర్వాత కూడా కొంత మంది విమర్శలు చేశారు. ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200కోట్లు ఇస్తా తీసుకురమ్మని ఆస్కార్‌ని, అది ఎవరికీ సాధ్యం కాదు అన్నారు. 
 

56
manchu vishnu

manchu vishnu

మా వాడు వెళ్లి కొట్టాడు, ఇలాంటి మూమెంట్లని గర్వించాలి. కాలర్‌ ఎగరేసుకోవాలి. భారతదేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదు. ఇండియాలో డైరెక్ట్ గా ఏ సినిమాకి ఆస్కార్‌ రాలేదు. సత్యజిత్‌ రేకి గౌరవంగా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ పురస్కారం అందించారు తప్పితే, సినిమాలకు ఇవ్వలేదు.

ఇండియాలో ఇండియా టెక్నీషియన్లు చేసిన ఈ మూవీకి ఆస్కార్ రాలేదు. కేవలం `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మాత్రమే సాధ్యమైందన్నారు మంచు విష్ణు. మన తెలుగు పాటని ఆస్కార్ స్టేజ్‌ పై వేశారు, ప్రేమ్‌ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దానికన్న గొప్పతనం ఏం కావాలి మనకు అంటూ ట్రోలర్స్ పై మండి పడ్డాడు మంచువిష్ణు. 
 

66
kannappa

kannappa

మంచు విష్ణు, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, కాజల్‌, మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న చిత్రం `కన్నప్ప`. దీన్ని మోహన్‌బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు. ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

read  more: 'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర నిడివి పై మంచు విష్ణు అప్‌డేట్!

also read: `కూలీ`లో అమీర్ ఖాన్ లుక్ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌, 1000కోట్ల మూవీ లోడింగ్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved