మళ్లీ రాజుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ?, ర్యాలీగా మంచు మనోజ్.. మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
మంచు మనోజ్ తన భార్యతో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్తున్నాడు. దీంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. పోలీసులు మోహరించారు.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఇటీవల గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అవి కేసుల వరకు వెళ్లాయి. మంచు మనోజ్‌ని ఇంటి నుంచి వెళ్లిపోవాలని మోహన్ బాబు డిమాండ్ చేస్తున్నారని, ఆయన్ని ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిసింది. ఏకంగా మోహన్‌బాబే వీడియోని విడుదల చేశారు. మనోజ్ తప్పులు చేస్తున్నాడని, తాగి ఇంటికి వస్తున్నాడని, నా ఇంట్లో ఉండొద్దంటూ ఆయన ఓపెన్‌గానే చెప్పారు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. మనోజ్‌ని కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. తనని ఇంట్లోకి రానివ్వకపోతే గేట్ పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు మీడియాపై కూడా దాడి చేశారు. ఇది పెద్ద కేసు అయ్యింది. మంచు విష్ణు, మోహన్‌బాబు ఒకటిగా ఉన్నారు. మనోజ్ వారిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు.
యూనివర్సిటీలో అవకతవకలు జరిగాయని చెబుతున్నాడు. స్కూల్స్ లోనూ అవకతవకలు జరుగుతున్నాయని చెబుతున్నాడు. అటు ఏపీ, ఇటు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాడు.
మరోవైపు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం మోహన్‌బాబు, విష్ణుకి ఇష్టం లేదని, అందుకే ఆయన్ని దూరం పెడుతున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలు ఇటీవల సర్దుమనిగాయి. కానీ ఇప్పుడు మళ్లీ రాజుకుంటున్నాయి. మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వెళ్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందట.
తన భార్య మౌనికా రెడ్డితో కలిసి ర్యాలీగా యూనివర్సిటీకి వెళ్తున్నారు మనోజ్. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారట. అంతేకాదు యూనివర్సిటీలోనే మోహన్‌బాబు, విష్ణు కూడా ఉన్నారని తెలుస్తుంది.
మంచు మనోజ్ రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు అభిమానులు, అనుచరులు భారీగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కార్లల్లో ర్యాలీగా బయలు దేరారు. మంచు ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మొహరించారు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ ఎందుకు యూనివర్సిటీకి వెళ్తున్నారు? ఏం చేయబోతున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
read more: `సంక్రాంతికి వస్తున్నాం` మొదటి రోజు కలెక్షన్లు, వెంకటేష్ సంచలనం, విక్టరీ ఈజ్ బ్యాక్?
also read: నిధి అగర్వాల్ పై కాజల్ ఫ్యాన్స్ ట్రోల్స్.. కొంప ముంచిన `అందరికి నమస్కారం`.. క్లారిటీ ఏంటంటే?