కూతురికి ఆ హీరోయిన్ పేరు పెట్టిన మంచు మనోజ్.. బారసాలేంటి ఇంత సింపుల్ గా చేశాడు..?
మంచువారి మనవరాలు.. మంచు మనోజ్ కూతురు బారసాల వేడుక చాలా సింపుల్ గా జరిగింది. కొద్దిమంది బంధువుల మధ్య జరిగిన ఈ వేడుకలో మనోజ్ తన గారాల కూతురికి ఓ హీరోయిన్ పేరు పెట్టి ఆశ్చర్యపరిచాడు.

మంచు మనోజ్ .. భూమా మౌనికను రెండో పెళ్లి చసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ పెళ్ళి మంచు ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా.. ఆతరువాత కాంప్రమైజ్ అయ్యి.. పెళ్ళికి ఒప్పుకున్నారు. కాగా ఈ దంపతులకు ఈమధ్యే ఓ ఆడపిల్ల జన్మించింది. ఏప్రిల్ లో మౌనిక బిడ్డకు జన్మనుఇవ్వగా.. కాస్త లేటుగా బారసాల వేడుకను నిర్వహించారు.
రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..
మంచు వారి గారాలపట్టికి.. వారి కుటుంబసభ్యుల నడుమ చాలా నిరాడంబరంగా బారసాల వేడుకను వారు నిర్వహించారు. ఇక ఆ పాపకు ఏ పేరు పెడుతున్నాము అనేది తెలియజేస్తూ.. మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తమ కూతురు పేరును ప్రకటించాడు.
Manchu Manoj
మనోజు తన కూతురికి దేవసేన శోభా ఎంఎం అనే పేరును పెట్టారు. తాను ఈ పేరును ఎందుకు పెట్టానో కూడా తెలుపుతూ.. సోషల్ మీడియా పోస్ట్ లో విరన ఇచ్చారు మనోజ్. ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు.. మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ దేవసేన శోభ ఎంఎం ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇప్పటికే ఎంఎం పులి అనే ముద్దు పేరు ద్వారా తను మీ అందరికీ తెలుసు.
ఆ పరమేశ్వరుని భక్తులమైన మేము మా చిన్నారి తల్లికి సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలోని సుబ్రహ్మణ్యస్వామి భార్య అయిన దేవసేన పేరును పెట్టుకున్నాము. అంతే కాదు మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుండి శోభ అనే పేరును కూడా తీసుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి అన్నారు.
అలాగే మా ఇంటి దీపం.. మా కంటి వెలుగు చిన్నారి దేవసేన శోభకు మీ అందరి దీవెనలు కూడా కావాలి అంటూ మంచు మనోజ్ కూతురి పేరును అనౌన్స్ చేశాడు. ఈ విధంగా పోస్ట్ పెట్టిన మనోజ్ ఫైనల్ గా అందరి ఆశీస్సులు అడిగారు. బారసాల వేడుకకు సబంధించిన కొన్నిపోటోలు కూడా ఆయన నెట్టింట పంచుకున్నారు.
అయితే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో అనుష్క క్యారెక్టర్ పేరు కూడా దేవసేన కావడంతో.. హీరోయిన్ పేరు పెట్టాడు మనోజ్ అంటూ.. సరదాగా స్పందిస్తున్నారు. పేరు చాలా బాగుంది అంటున్నారు.ఈ పేరును వైరల్ చేస్తున్నారు. అంతే కాదు ఈ వేడుకల్లో మోహన్ బాబు కూడా పాలు పంచుకున్నారు. కాని విష్ణు, మంచు లక్ష్మి మాత్రం కనిపించలేదు.