Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్ సెన్సేషన్.. కొత్త పోస్టర్ అదిరింది
రమేష్ వర్మ నిర్మాతగా మారి `కొక్కొరోకో` మూవీని నిర్మించారు. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంతో యంగ్ సెన్సేషన్ మనస్విని తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.

ఆసక్తిని రేకెత్తిస్తోన్న `కొక్కొరోకో` ఫస్ట్ లుక్
సముద్రఖని కోలీవుడ్ నటుడైనా ఇప్పుడు తెలుగు యాక్టర్‌గా మారిపోయారు. వరుసగా తెలుగు సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇటీవల `ది రాజా సాబ్`లో మెరిసిన ఆయన ఇప్పుడు ప్రధాన పాత్రలో `కొక్కొరోకో` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యంగ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మనస్విని బాల బొమ్మల కూడా నటిస్తుండటం ఓ విశేషమైతే, దీనికి రమేష్ వర్మ దర్శకుడు కావడం మరో విశేషం. ఆయన గతంలో `ఒక ఊరిలో`, `రైడ్`, `వీర`, `అబ్బాయితో అమ్మాయి`, `రాక్షసుడు`, `ఖిలాడీ` వంటి చిత్రాలను రూపొందించారు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ మూవీతో ఆయన ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. `కొక్కొరోకో` అనే మూవీని రూపొందిస్తున్నారు. అయితే దీనికి ఆయన దర్శకుడు కాదు, నిర్మాత కావడం విశేషం. కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా నిర్మాతగా మారి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. స్పెషల్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. సంప్రదాయ వాతావరణంతో రూపొందిన ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. `కొక్కొరోకో` త్వరలో థియేటర్లలో` అనే సందేశం ఆకట్టుకుంది.
యంగ్ సెన్సేషన్ మనస్విని సినిమా ఎంట్రీ
ఈ సంక్రాంతి పోస్టర్‌తోనే మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఆ పోస్టర్‌లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర ప్రధాన నటులతో కలిసి దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ తెలుగు సినిమాల్లోకి ఆమె పెట్టిన తొలి అడుగుగా ఇది ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ లుక్‌కు సినీ వర్గాల్లో మంచి స్పందన లభిస్తోంది. సినీ రంగ ప్రవేశానికి ముందే మనస్విని తన ప్రతిభకు పక్కా పునాది వేసుకుంది. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్ పాత్రలతో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నది మనస్విని. నటనతో పాటు శాస్త్రీయ నృత్యమైన పెరిని నాట్యంలో శిక్షణ పొందిన ఆమె, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం సాధించింది. భక్తి గీతాల ప్రదర్శనలు, గ్లెండేల్ అకాడమీ ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేయడం వంటి అనుభవాలు ఆమె స్టేజ్ ప్రెజెన్స్‌కు మరింత బలం చేకూర్చాయి.
సాంప్రదాయ కోడిపందేల నేపథ్యంలో `కొక్కొరోకో`
`కొక్కొరోకో` సినిమా ఐదు విభిన్న పాత్రలతో రూపొందుతున్న చిత్రం, సాంప్రదాయ కోడిపందేల నేపథ్యంలో సాగనుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై 2026లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సంకీర్తన్ సంగీతం, ఆకాశ్ ఆర్ జోషి సినిమాటోగ్రఫీ, జివి సాగర్ సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. కొత్త తరహా కథనం, పటిష్టమైన విజువల్స్, భావోద్వేగాల లోతుతో `కొక్కొరోకో` ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయాణంలో మనస్విని బాలబొమ్మల సినీ ఆరంభం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

