- Home
- Entertainment
- Ram Charan: మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో? రామ్ చరణ్ సపోర్టుతో ఆ సినిమా సీక్వెల్‌లో?
Ram Charan: మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో? రామ్ చరణ్ సపోర్టుతో ఆ సినిమా సీక్వెల్‌లో?
Ram Charan: మెగా కాంపౌండ్ సపోర్టుతో మరో హీరో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ కొడుకు దృషిక్ హీరోగా రాబోతున్నాడు. అది కూడా పెద్ద బ్యానర్లో పరిచయం అవ్వబోతున్నాడు.

మరో మెగా హీరో?
టాలీవుడ్ లోకి మరో కొత్త హీరో రాబోతున్నాడు. అది కూడా మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్ కు వ్యక్తిగత మేనేజర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమారుడే దృషిక్. ఇతడిని హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి అంతా సిద్ధమైంది. సాధారణంగా స్టార్ కుటుంబాల నుంచి హీరోలు వస్తుంటారు. కానీ స్టార్ కు సన్నిహితంగా ఉన్న వ్యక్తి కుటుంబం నుంచి హీరో రావడం కాస్త ఆసక్తికరమైన విషయం. దృషిక్ చిన్నప్పుడు నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగాడు. అతడి తండ్రి హీరో హీరోయిన్లకు మేనేజర్ గా వ్యవహరిస్తూ పూర్తిగా సినీరంగానికి అంకితమయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ దగ్గర మేనేజర్ గా గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ అండా దండతోనే దృషిక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
దృషిక్ ప్రత్యేక శిక్షణ
చిన్నప్పటినుంచి హీరో అవ్వాలన్న కలతోనే దృషిక్ పెరిగాడు. అందుకోసమే విదేశాలకు వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. లండన్ లోని ప్రముఖ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఆయన కోర్సు పూర్తి చేసినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. అక్కడ నటనతో పాటు స్క్రీన్ ప్రజెన్స్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. విదేశాల్లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అతనిలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కెమెరా ముందు సహజంగా నటించే అవకాశం ఉంటుంది. మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నాడని చెప్పుకోవచ్చు.
ఏ సినిమాలో?
ఇక దృషిక్ నటించబోయే సినిమా ఏదో తెలుసా మ్యాడ్, మ్యాట్ స్క్వేర్.. పేరుతో హిట్టు కొట్టిన సీక్వెల్ లోనే. మ్యాడ్ క్యూబ్ గా మరొక సినిమా రాబోతోంది. ఇందులోనే ఆయన హీరోగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం కాలేజీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది. యూత్ కు దగ్గరగా ఉండే కథ కావడంతో హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమానే ఎంపిక చేసుకున్నారని సమాచారం. ఇక దీనిని నిర్మించేది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇది కూడా బలమైన బ్యానర్.
మెగా హీరోల మద్దతు
దృషిక్ సినిమా ఎంట్రీకి మెగా హీరోల నుంచి మద్దతు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ కూడా సాగుతోంది. రామ్ చరణ్ కు ప్రవీణ్ చాలా ఏళ్లుగా తెలుసు. అంతేకాదు చాలా దగ్గరగా వ్యవహరించే వ్యక్తి కూడా. కాబట్టి దృషిక్ కెరీర్ ను తీర్చేది కూడా రామ్ చరణ్ అని, అతని ఆశీర్వాదం ఉండొచ్చని అంటున్నారు సినీ ప్రముఖులు. చూసేందుకు దృషిక్ హ్యాండ్సమ్ గా కూడా ఉండడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని తెలుస్తోంది. సినిమా ప్రకటన కూడా అధికారికంగా త్వరలో వచ్చే అవకాశం ఉంది. దీనిబట్టి మరో కొత్త హీరో మనకు దొరికినట్టే.

