MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shakeela: వేణు మాధవ్ రూమ్ లో పడుకున్న షకీలా.. మంచి స్నేహితుడు అనుకున్నా, కానీ ఇలా చేస్తాడనుకోలేదు

Shakeela: వేణు మాధవ్ రూమ్ లో పడుకున్న షకీలా.. మంచి స్నేహితుడు అనుకున్నా, కానీ ఇలా చేస్తాడనుకోలేదు

నటి షకీలా తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. కమెడియన్ వేణు మాధవ్ తో ఆమెకి మంచి అనుబంధం ఉంది. అయితే వేణు మాధవ్ తో ఎదురైన ఊహించని సంఘటనని ఓ ఇంటర్వ్యూలో షకీలా బయట పెట్టారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 20 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షకీలా తెలుగు సినిమాలు
Image Credit : Asianet News

షకీలా తెలుగు సినిమాలు

బోల్డ్ రోల్స్ తో షకీలా సౌత్ సినీ రంగంలో గుర్తింపు పొందారు. శృంగారభరితమైన పాత్రలు చేశారు. తెలుగులో ఆమె అనేక చిత్రాల్లో నటించారు. జయం, నిజం, బంగారం, తొట్టి గ్యాంగ్, దొంగోడు లాంటి చిత్రాల్లో షకీలా కామెడీ రోల్స్ చేశారు. ఈ క్రమంలో ఆమెకి తెలుగు కమెడియన్స్ బ్రహ్మానందం, వేణు మాధవ్, అలీ లతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఓ ఇంటర్వ్యూలో షకీలా తనకు వేణు మాధవ్ తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది. తెలుగులో నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో వేణు మాధవ్ ఒకరు. అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఊహించని సంఘటన ఎదురైంది. దాని గురించి తప్పకుండా చెప్పాలి.

25
వేణు మాధవ్ రూమ్ కి వెళ్లిన షకీలా
Image Credit : Asianet News

వేణు మాధవ్ రూమ్ కి వెళ్లిన షకీలా

ఆ సినిమా గుర్తుకు రావడం లేదు కానీ.. నేను, వేణు మాధవ్, బ్రహ్మానందం, రఘుబాబు అందరూ ఉన్నారు. అందరికీ హోటల్ రూమ్స్ ఇచ్చారు. అందరూ వచ్చి నా రూమ్ లోనే తిన్నారు. దీనితో రూమ్ డర్టీగా మారింది. పడుకోవడానికి వీలు కాలేదు. దీనితో నీ రూమ్ కి వచ్చి పడుకుంటా అని వేణు మాధవ్ ని అడిగా. అలాగే రా పడుకో అని చెప్పాడు.

Related Articles

Related image1
Sudharshan: ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాపై కమెడియన్ సెటైర్లు..ఆమె యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంటూ యాంకర్ పై జోకులు
Related image2
Rajamouli: రాజమౌళి జీవితాశయం, మహా భారతంలో ముగ్గురు హీరోలు ఫిక్స్ ?.. ఎవరెవరు, ఏ పాత్రల కోసమో తెలుసా..
35
వేణు మాధవ్ పై డౌట్ వచ్చింది
Image Credit : Asianet News

వేణు మాధవ్ పై డౌట్ వచ్చింది

వెళ్లి నేను బెడ్ కి ఒక వైపు పడుకున్నా. రూమ్ లో టీవీ లైట్ తప్ప అంతా చీకటిగా ఉంది. మసక మసకగా కనిపిస్తోంది. ఆ టైంలో వేణు నాతో.. ఒక మాట అడుగుతాను.. నువ్వు కాదనకూడదు అని అడిగాడు. దీనితో నాకు డౌట్ వచ్చింది. ఏమైనా చెడుగా ప్రవర్తిస్తాడా ? బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడా ? అని అనుమానం వచ్చింది.

45
మంచి స్నేహితుడు అనుకున్నా కానీ..
Image Credit : our own

మంచి స్నేహితుడు అనుకున్నా కానీ..

నేను వేణుని మంచి స్నేహితుడు అనుకున్నా కదా. ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకున్నా. ఏమైనా బ్యాడ్ గా అడిగితే ఇక్కడితో ఫ్రెండ్ షిప్ కట్ అని భావించా. సరే అడిగి చావు అని చెప్పా. దీనితో మళ్ళీ వేణు మాట్లాడుతూ.. ఒప్పుకోను అని మాత్రం చెప్పకూడదు అంటూ హస్కీ వాయిస్ తో చెబుతున్నాడు. దీనితో నా అనుమానం ఇంకా ఎక్కువైంది.

55
రోజంతా నవ్వుతూనే ఉన్నా
Image Credit : our own

రోజంతా నవ్వుతూనే ఉన్నా

అసలు ఏంట్రా నీ బాధ అని అడిగా. వేణు మాధవ్ సమాధానం ఇస్తూ.. నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. అవును నిజమే.. వాళ్ళు బావుండాలి అంటే నేను బతికి ఉండాలి.. సరే అయితే ఏంటి ఇప్పుడు అని అడిగా. దీనితో వేణు ఇద్దరి మధ్యలో పిల్లోలు పెడుతూ.. నిద్రలో నువ్వు నాపై పొరపాటున కాలు వేస్తే నేను చస్తా. అందుకే ఈ దిండ్లు పెడుతున్నా. వీటిపై నీ కాలు వేసుకో అని చెప్పాడు. నాకు రాత్రంతా నవ్వు ఆగలేదు. ఉదయాన్నే ఈ విషయాన్ని బ్రహ్మానందం, రఘుబాబుకి చెప్పు రోజంతా నవ్వుతూనే ఉన్నాను అని షకీలా పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో? రామ్ చరణ్ సపోర్టుతో ఆ సినిమా సీక్వెల్‌లో?
Recommended image2
Rajamouli: రాజమౌళి జీవితాశయం, మహా భారతంలో ముగ్గురు హీరోలు ఫిక్స్ ?.. ఎవరెవరు, ఏ పాత్రల కోసమో తెలుసా..
Recommended image3
Nawab Cafe Review: నవాబ్‌ కేఫ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఛాయ్‌ వాలాపై వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Sudharshan: ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాపై కమెడియన్ సెటైర్లు..ఆమె యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంటూ యాంకర్ పై జోకులు
Recommended image2
Rajamouli: రాజమౌళి జీవితాశయం, మహా భారతంలో ముగ్గురు హీరోలు ఫిక్స్ ?.. ఎవరెవరు, ఏ పాత్రల కోసమో తెలుసా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved