- Home
- Entertainment
- MSG Collections: చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ 16 రోజుల కలెక్షన్లు.. 80 కోట్లు తేడా?, అయినా రికార్డు
MSG Collections: చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ 16 రోజుల కలెక్షన్లు.. 80 కోట్లు తేడా?, అయినా రికార్డు
MSG 16 Days Collections: చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ 16 రోజుల కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యంగా మారింది. సుమారు రూ.80కోట్లకుపైగా ఫేక్ కలెక్షన్లు ప్రకటిస్తున్నారని అంటున్నారు.

సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ `మన శంకర వర ప్రసాద్ గారు`. హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రమిది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు అనిల్ రావిపూడి. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే.
వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు ఫిదా
ప్రీమియర్స్ నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉండటంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. నీట్‌గా, క్లీన్‌గా ఉండటం కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యింది. పైగా కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. వీటికితోడు చిరంజీవి వింటేజ్ లుక్, వింటేజ్ కామెడీ, డాన్సులు ఆడియెన్స్ కి బాగా నచ్చాయి. మెగాస్టార్ అభిమానులు పాత రోజులకు వెళ్లిపోయారు. అందుకే పెద్దవాళ్లు, పిల్లలు అంతా ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపించారు.
బాక్సాఫీసు వద్ద చిరంజీవి మూవీ రచ్చ
ఈ క్రమంలో `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ సినిమా విడుదలై 16 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా మంచి వసూళ్లని రాబడుతుండటం విశేషం. రోజుకి కోటి, రెండు కోట్ల వరకు కలెక్షన్లు సాధించడం మరో విశేషం. ఇప్పుడు ఒక సినిమా విడుదలయ్యాక వారం రోజులు ఆడితేనే గొప్పగా భావిస్తున్న తరుణంలో ఈ మూవీ మూడో వారంలో కూడా సత్తా చాటడం విశేషం. కొత్తగా సినిమాలు కూడా లేకపోవడంతో దీనికది కలిసి వస్తుందని చెప్పొచ్చు.
మన శంకర వర ప్రసాద్ గారు 16 రోజుల కలెక్షన్లు
చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ 16 రోజుల కలెక్షన్ల వివరాలు చూస్తే, ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.279కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లని ప్రముఖ బాక్సాఫీసు సైట్ Sacnilk ప్రకటించింది. దాని లెక్కల ప్రకారం ఇండియా నెట్ రూ. 199.35కోట్లు కాగా, ఇండియా గ్రాస్ రూ.236కోట్లుగా ఉంది. ఓవర్సీస్‌లో రూ.42కోట్లు రాబట్టింది. కర్నాటకలో రూ.21.23కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.208 కోట్లు, తమిళనాడులో రూ.3కోట్లు, కేరళాలో రూ.12లక్షలు, నార్త్ లో రూ.4 కోట్లు రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 16 రోజులకుగానూ ఈ చిత్రానికి రూ.279కోట్లు వచ్చినట్టు వెల్లడించింది.
మన శంకర వర ప్రసాద్ గారు మూవీకి లాభాల పంట
మరో బాక్సాఫీసు కలెక్షన్లని ప్రకటించే సైట్ టాలీవుడ్ టూ బాలీవుడ్ లెక్కల ప్రకారం `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీకి 16 రోజులకుగానూ రూ.282కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ లెక్కన దీనికి రూ.173కోట్ల షేర్ వచ్చింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.122కోట్లు. దీంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి రూ.51కోట్ల లాభాల్లో ఉంది. మొత్తంగా `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ నిర్మాతలకు, బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పొచ్చు.
మన శంకర వర ప్రసాద్ గారు టీమ్ ఫేక్ కలెక్షన్లు ప్రకటించిందా?
ఇదిలా ఉంటే చిత్ర బృందం ప్రకటించిన కలెక్షన్లకి, సాక్నిల్క్, టాలీవుడ్ టూ బాలీవుడ్ సైట్లు ప్రకటించిన లెక్కలకు సుమారు ఎనభై కోట్ల తేడా ఉంది. చిత్ర బృందం మంగళవారానికి రూ.358కోట్లుగా ప్రకటించింది. మంగళవారం వసూళ్లు రెండు కోట్లు యాడ్ చేస్తే రూ.361కోట్లకుపైగానే చెప్పొచ్చు. అంటే సుమారు రూ.80కోట్లు ఎక్కువగా పోస్టర్ లో వేశారు. ఈ లెక్కన ఈ మూవీకి రూ.80కోట్ల వరకు బోగస్, ఫేక్ కలెక్షన్లు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి చిత్ర బృందం ఫేక్ వసూళ్లని ప్రకటించాయా? ఈ సైట్లు తప్పుగా ప్రకటించాయా అనేది సస్పెన్స్. అయితే సాధారణంగా చాలా ఏళ్లుగా సినిమా నిర్మాతలు తమ మూవీస్‌కి దాదాపు 30శాతానికిపైగా ఫేక్ కలెక్షన్లని ప్రకటిస్తుంటారు. ఇది కూడా అలాంటిదే అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఇలాంటి ఫేక్ వసూళ్లు వేయాల్సిన అసవరం ఏంటనేది ప్రశ్న.

