- Home
- Entertainment
- రికార్డులకు పాతరేసిన మన శంకర వరప్రసాద్ గారు, ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య, వెంకీ, నాగ్ లకు సాధ్యంకాని ఘనత
రికార్డులకు పాతరేసిన మన శంకర వరప్రసాద్ గారు, ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య, వెంకీ, నాగ్ లకు సాధ్యంకాని ఘనత
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే స్టార్ట్ అందుకుంది. తొలి రోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. రిలీజ్ కి ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కనిపించింది. ఇప్పుడు అంతా ఆశించినట్లుగానే తొలి రోజు వసూళ్లు అదిరిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ డే కలెక్షన్స్ లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.
ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్
తొలి రోజు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రికార్డు కలెక్షన్స్ నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 84 కోట్ల గ్రాస్ దక్కినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, సాహు గారపాటి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
టార్గెట్ 200 కోట్ల గ్రాస్
ట్రెండ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రం 75 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి ఉండవచ్చు అని తెలుస్తోంది. మొత్తం 200 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బరిలోకి దిగింది. తొలిరోజు వసూళ్లతో 35 శాతానికి పైగా రికవరీ సాధించినట్లు అయింది.
ఓవర్సీస్ లో పరుగులు
నైజాం ఏరియాలో తొలి రోజు 9 కోట్ల వరకు ఈ చిత్రం షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 40 కోట్ల వరకు షేర్ పొందినట్లు తెలుస్తోంది. ట్రెండ్ పండితులు ఇది టెరిఫిక్ స్టార్ట్ గా చెబుతున్నారు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్, ఫస్ట్ డేతో కలిపి ఈ చిత్రం 1.7 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ అందుకుంది. 2 మిలియన్ల వైపు పరుగులు పెడుతోంది.
అరుదైన రికార్డ్
ఈ కలెక్షన్స్ తో చిరంజీవి అరుదైన రికార్డ్ సాధించారు. మిగిలిన సీనియర్ హీరోలు బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఎవరికీ లేని ఘనత చిరంజీవికి దక్కింది. సీనియర్ హీరోల్లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్. అంతే కాదు 80 కోట్లకి పైగా గ్రాస్ అందుకోవడం చిరంజీవికి ఇది 2 వ సారి. గతంలో సైరా నరసింహా రెడ్డి చిత్రంతో చిరంజీవి తొలి రోజు 80 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥
₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥
ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSG
Megastar @KChiruTweets
Victory @VenkyMama@AnilRavipudi#Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026

