MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు

OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ థియేటర్లతో దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. నెంబర్‌ 1గా ట్రెండ్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 12 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓటీటీలోకి వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ
Image Credit : X/@Shine_Screens

ఓటీటీలోకి వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ

చిరంజీవి హీరోగా నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` థియేటర్‌ రన్‌ ముగించుకుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇది రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ జోరు చూపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఓటీటీలో ట్రెండింగ్‌ లో చిరంజీవి సినిమా
Image Credit : X/@Shine_Screens

ఓటీటీలో ట్రెండింగ్‌ లో చిరంజీవి సినిమా

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ జీ 5లో స్ట్రీమింగ్‌ అవుతుంది. బుధవారం నుంచే ఓటీటీలోకి వచ్చింది. ప్రారంభంలో పెద్దగా ఆదరణ లేని ఈ మూవీ ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతుంది. జీ 5 లో టాప్‌ 10లో నెంబర్‌ 1గా ట్రెండ్‌ అవుతుంది. మంచి వ్యూస్‌ తో దూసుకుపోతుంది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీరియల్‌గా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి పండగ కాబట్టి థియేటర్‌లో నడిచిపోయింది. కానీ ఓటీటీలో కష్టమంటున్నారు కొందరు నెటిజన్లు. ఇలాంటి విమర్శల మధ్య ఈ మూవీ జీ 5లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

34
మన శంకర వర ప్రసాద్‌ గారు క్లోజింగ్‌ కలెక్షన్లు
Image Credit : X/@Shine_Screens

మన శంకర వర ప్రసాద్‌ గారు క్లోజింగ్‌ కలెక్షన్లు

ఇక చిరంజీవి మూవీ థియేట్రికల్‌గా ఆల్మోస్ట్ క్లోజ్‌ అయినట్టే. మరి థియేటర్లలో ఈ మూవీకి ఫైనల్‌గా ఎన్ని కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే ఇప్పటి వరకు ఇది దాదాపుగా రూ.290కోట్లు రాబట్టినట్టు సమాచారం. రూ.175-180కోట్ల థియేట్రికల్‌ షేర్‌ని సాధించిందట. ఈ సినిమాకి థియేట్రికల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.120కోట్లు అయ్యింది. దీంతో బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని ఏకంగా రూ.55-60 కోట్ల వరకు లాభాలను పొందింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌ లాభాలు రాబట్టిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. గత సంక్రాంతికి వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` తర్వాత ఈ సినిమానే భారీ లాభాలను గడించిందని చెప్పొచ్చు.

44
ఫ్యామిలీని అలరించిన చిరంజీవి మూవీ
Image Credit : X/@Shine_Screens

ఫ్యామిలీని అలరించిన చిరంజీవి మూవీ

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్‌ కంటెంట్‌తో ఈ మూవీని రూపొందించారు అనిల్‌. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇది రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
దగ్గుబాటి వెంకటేష్
నయనతార
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Related Stories
Recommended image1
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ.. ఫోటోలు లీక్‌.. ఎవరీ అమ్మాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved