- Home
- Entertainment
- ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?
ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?
ఇప్పుడంటే స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే ఎక్కువైపోయింది. కాని సీనియర్ హీరోలు ఏడాదికి పది సినిమాలకు పైనే చేసేవారు. ఇక రికార్డ్ స్థాయిలో ఓ హీరో అయితే ఒక ఏడాది 36 సినిమాల్లో నటించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?

Mammootty
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు జోరు పెరిగింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే స్టార్ హీరో స్టేటస్ ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే ఘనం అయ్యింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ.. ఇలా స్టార్ హీరోలంతా రెండు మూడేళ్ళు ఒక్క సినిమా కోసం కష్టపడుతున్నారు.
కాని గతంలో పెద్ద హీరోలంతా ఏడాదికి కనీసం 5 సినిమాలు తక్కవలో తక్కువ చేసేవారు. అంతే కాదు క)ష్ణలాంటి హీరోలు అయితే ఏడాదికి 16 సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాల విషయంలో మాత్రం ఎవరికి సాధ్యం కాని రికార్డ్ ను క్రియేట్ చేసి.. సంచలనంగా మారాడు ఓ స్టార్ హీరో.
Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?
Actor Mammootty
ఒక్క ఏడాదిలో 36 సినిమాలు రిలీజ్ చేసి.. ఇంకెవరికి సాధ్యం కాని సంచలనం నమోదు చేశాడు ఆహీరో. 70 ఏళ్ళుదాటినా ఇంకా అదే గ్లామర్ మెయింటేన్ చేస్తూ.. కుర్రా హీరోలు కూడా కుళ్ళుకునేలా చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా ఎవరో కాదు మలయాళ స్టార్ మమ్ముట్టి. మమ్ముట్టికి 70 ఏళ్ళు దాటాయి అంటే ఎవరైనా నమ్ముతారా..?
Also Read: సమంత కాదు, త్రిష కాదు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన షాకింగ్ హీరోయిన్ ఎవరు..?
Mammootty
మమ్ముట్టి హీరోగా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఎంట్రీ అయ్యి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. దుల్కర్ కే 40 ఏళ్ళ దాటాయి. కాని వీళ్లద్దిరిని పక్క పక్కన నించోబెడితే తండ్రి కొడుకుల్లా కాదు అన్నతమ్ముళ్ళ ఉంటారు. ఇలా గ్లామర్ ను, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ వస్తున్న మమ్ముట్టి.. 70 ఏళ్ళు దాటినా హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
Also Read:రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Mammootty
1971లో అనుభవంగల్ పాలిచకల్ అనే సినిమాలో చిన్న పాత్రతో మమ్ముట్టి సినిమా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. 71 లో ఎంట్రీ ఇస్తే.. 80 లో హీరోగా చేసే అవకాశం వచ్చింది. మమ్ముట్టి ఎంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తారంటేు.. ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన రికార్డ్ లు అన్నీ ఆయన పేరుమీదనే ఉన్నాయి. మొదటి సారి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 1980లో మేళ సినిమాతో హీరోగా మారాడు.
Also Read:ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?
Mammootty
ఆ తర్వాత మలయాళ సినిమాల్లో అత్యంత బిజీగా ఉండే నటులలో ఒకరు 1982లో 24 సినిమాల్లో నటించిన మమ్ముట్టి.. 1983 నుండి 1986 వరకు ప్రతి ఏడాది 30కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్స్ క్రియేట్ చేశాడు. హీరోగా 400 సినిమాలకు పైగా నటించిన మమ్ముట్టి. 1983ఒక సంవత్సరంలో 36 సినిమాల్లో నటించి ఎవరికి అందరి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. మమ్ముట్టి ఒక ఏడాదిలో నటించిన 36 సినిమాలు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ చేయడానికి 13 ఏళ్లు పట్టింది.