Janaki kalaganaledu: నిశ్చితార్ధాన్ని ఆపేసిన మల్లిక.. మరోసారి అవమానాలపాలైన జానకి!
Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. పైగా ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu
దిలీప్, వెన్నెలల (Vennela) నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మల్లిక జానకిని మెల్లగా పిలిచి పక్కకి రమ్మంటుంది. ఇక జానకి ఇప్పుడే వస్తానని రామచంద్రకు చెప్పి మల్లిక (Mallika) దగ్గరికి వెళుతుంది. ఇక మల్లిక దిలీప్, వెన్నెల నిశ్చితార్థం నువ్వు ఆపుతావా.. లేదా నన్ను ఆపమంటావా అని జానకికి ట్విస్ట్ ఇస్తుంది.
Janaki Kalaganaledu
ఇక జానకి (Janaki) అలా ఎందుకు అంటున్నావు అని మల్లిక తో అనడంతో.. మల్లిక (Mallika) మాత్రం అసలు ఊరుకోదు. ఏదేమైనా నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలని ఆలోచనలో ఉండటంతో జానకిని తన మాటలతో బాధ పెడుతుంది. మరోవైపు ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతూ ఉంటుంది. పంతులు ఎంగేజ్మెంట్ రింగ్స్ అడగటంతో అందరూ జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
Janaki Kalaganaledu
ఇక జానకి (Janaki) భయపడుతూ అక్కడికి వస్తుంది. మల్లిక.. జానకితో చేతిలో ఉన్న రింగ్ ఇవ్వటానికి ఎందుకు భయపడుతున్నావు అని అనడంతో వెంటనే రామచంద్ర ఆ రింగులను తీసుకొని ఇస్తాడు. జానకి మాత్రం భయపడుతూనే ఉంటుంది. వెన్నెల దిలీప్ (Dileep) కు రింగ్ తొడుగుతున్న సమయంలో మల్లిక వచ్చి ఆపుతుంది.
Janaki Kalaganaledu
ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అంటూ జానకి అసలు రూపాన్ని బయటపెడుతుంది. దిలీప్, వెన్నెల ప్రేమించుకున్నారు అని.. అందుకే జానకి (Janaki) ఈ సంబంధం తీసుకొచ్చినట్లు చేసింది అంటూ బయట పెడుతుంది. జానకి ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. మల్లిక మాత్రం తన మాటలతో రెచ్చిపోతూ ఉండగా గోవిందరాజులు (Govinda Raju) మల్లికపై అరుస్తాడు.
Janaki Kalaganaledu
అయినా కూడా మల్లిక (Mallika) జానకిని అడగండి అంటూ జానకిపై నిందలు వేస్తుంది. ఇక జానకి ఎంత చెప్పకపోయే సరికి జ్ఞానంబ జానకిని తీసుకొని లోపలికి వెళ్తుంది. అక్కడున్న వాళ్ళందరూ ఏం జరుగుతుందా అన్నట్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక జానకితో (Janaki) జ్ఞానాంబ.. మల్లిక చెబుతుంది నిజమేనా.. ఎప్పుడు కూడా నిజాయితీగా మాట్లాడే దానివి ఇప్పుడెందుకు ఇలా నిశ్శబ్దంగా ఉన్నావు..
Janaki Kalaganaledu
అంటే మల్లిక (Mallika) చెప్పింది మొత్తం నిజమేనా అని అనడంతో జానకి ఏం చెప్పకుండా జ్ఞానం వైపు ఏడుస్తూ చూస్తుంది. ఇక తరువాయి భాగంలో జ్ఞానంబ తన అత్తయ్య మైరావతితో దగ్గరికి వెళ్లి మోసం చేసిన వాళ్ల కోసం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ ఇకపై జానకిని (Janaki) మీ దగ్గరే ఉంచుతాను అని అంటుంది.