MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: రామాని సలహా కోరిన జానకి.. పెద్ద కోడలుని ఇరికించే ప్రయత్నంలో మల్లిక!

Janaki Kalaganaledu: రామాని సలహా కోరిన జానకి.. పెద్ద కోడలుని ఇరికించే ప్రయత్నంలో మల్లిక!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Sep 09 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మల్లిక, ఈరోజు మధ్యాహ్నం వీళ్ళిద్దరూ చాలాసేపు ముఖ్యమైనవేమో మాట్లాడుకున్నారు అత్తయ్య గారు అని అంటుంది.అప్పుడు జానకి,ఏమీ లేదు అత్తయ్య గారు అఖిల్ బాగా చదవడం కోసం, తన భవిష్యత్తు కోసం కొన్ని విషయాలు చెప్పాను అంతే అని అంటుంది. జానకి మనసులో, ఇదే మంచి విషయం ఎలాగైనా అఖిల్ గురించి చెప్పేద్దాము అని అనుకోని,అత్తయ్య గారు అని అనేలోగా పక్కింటి లీలావతి వచ్చి, జ్ఞానాంబ పక్క ఊరికి పెళ్లి ఉంటే వెళ్ళాను. అలా మల్లికనీ చూసి పోదామని వచ్చాను.
 

27

చెప్పడం మర్చిపోయాను పక్క ఊరిలో ఒక సంబంధం ఉన్నది, వాళ్ళకి మీరు నచ్చారట అఖిల్ బాబు కోసం చూడడానికి వచ్చాను అని అనగా వాడికి ఇప్పుడే పెళ్లెందుకు? ఇంకా చిన్నపిల్లాడు చదువు పూర్తవని అని జ్ఞానం అంటుంది.అప్పుడు జానకి,పెళ్లి చేస్తే ఇద్దరికి ఇద్దరు తోడుగా ఉండి కలిసి ఎదుగుతారు కదా అత్తయ్య గారు అని అంటుంది.దానికి జ్ఞానాంబ,పెల్లితో బాధ్యతలతో పాటు భార్య కూడా వస్తుంది. తన ప్రతిరోజు అవసరాలు కన్నా చదువుకోవడమే మంచిది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు అని జ్ఞానాంబ అంటుంది.
 

37

అప్పుడు రామ కూడా అదే మాట అంటాడు అప్పుడు మల్లికా, మనసులో ఇక్కడేదో జరుగుతుంది,లేకపోతే జానకి అంత టెన్షన్ పడాల్సిన పని ఏంటి అనీ అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జానకి తన గదిలో, నాకు ఇచ్చిన గడువు అయిపోవస్తుంది. ఇక్కడ అత్తయ్య గారు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు.పోని, రామగారిని ఇన్ డైరెక్ట్ గా సలహా అడుగుదామా అని అనుకొని రామానిపిలిచి,ఇలా మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు రామాగారు తను కూడా పోలీస్ అవ్వాలని ధ్యాస ఉన్నది కానీ తనకి ఒక సమస్య వచ్చింది ఇప్పుడు తను ఏం చెయ్యాలి అని అడుగుతుంది.
 

47

అప్పుడు రామా,పోలీస్ అంటేనే ముందు రిస్క్ తీసుకోవాలి. ప్రతి విషయంలోనే ధైర్యంగా ఉండాలి, మీరు చేసేది మంచి అయితే ఎప్పటికైనా శుభం జరుగుతుంది అని అంటాడు. దానికి జానకి రామ గారు చెప్పేదాన్ని బట్టి, ముందు అత్తయ్య గారికి విషయం చెప్పేద్దాము,ముందు  కోప్పడినా సరే క్షమించి పెళ్లి చేస్తారని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో  వినాయకుడు విగ్రహం ఇంటి ముందు ప్రతిష్టిస్తారు.ఇంట్లో వాళ్ళందరూ దానికోసం అలంకరిస్తూ ఉండగా అఖిల్ మొఖం డల్ గా ఉంటుంది. ఏమైంది అని గోవిందరాజు అడగగా, ఏం లేదు అని తప్పించుకుంటాడు అఖిల్.
 

57

అఖిల్ మొఖం చూసినా మల్లికా, నా మట్టి బుర్రకి  అర్థం కావట్లేదు కాని ఇక్కడ జరగకూడనిది ఏదో జరుగుతుంది అంటుంది. ఇంతలో మల్లిక ఇంట్లో వాళ్ళందరికీ పనులు చెబుతూ ఉంటుంది. గోవిందరాజుకి తిక్క వచ్చి, అమ్మ మల్లిక నువ్వు పనిచేయట్లేదు కదా అమ్మ సైలెంట్ గ  పక్కకెళ్ళి కూర్చో అంతేగాని పక్క వాళ్ళు చెప్పద్దు అని అంటాడు. అప్పుడు మల్లిక అరటిపండు తింటూ ఉంటుంది. అప్పుడు మల్లికా జానకి వైపు చూస్తూ ఈరోజు నీ ఐదు అవకాశాల్లో ఒకటి చెరిపించేలా చేస్తాను, నిన్ను చదువుఆపించేలా చేస్తాను అని అనుకుంటుంది.
 

67

జానకి నడుస్తున్నప్పుడు కింద అరటి తొక్క వేస్తే తను జారీ  చేతులలో పూజ కి కావలసిన పువ్వులు కింద పడిపోతాయి. అప్పుడు ఒకతప్పు అయిపోయినట్టే కదా అని అనుకుంటుంది మల్లికా. అనుకున్నట్టే అరటి తొక్క కింద వేస్తుంది మల్లిక.జానకి చూసుకోకుండా జారి పడిపోతుంది. అప్పుడు రామా జానకిని పట్టుకుంటాడు. చేతిలో పడిపోయిన పువ్వులు, వారిద్దరి మీద అక్షంతల్లా పడతాయి. అప్పుడు జ్ఞానాంబ వచ్చి దెబ్బలు తగలేదు కదా అని అంటుంది.అంతలో మల్లికా, దెబ్బలు తగలలేదు కానీ, అత్తగారు పూజ కి అవసరమైన పువ్వులు పడిపోయాయి. జానకి తప్పు చేసింది వెళ్లి ఒక అవకాశం చేరిపేమంటారా అని అంటుంది.
 

77

గోవిందు రాజు, అమ్మ జగడం మల్లికా, నీ నిజరూపం మళ్ళీ బయట పెట్టావా! ఏంటి ఇంత జరిగినా ఇంకా మాట్లాడలేదు అనుకున్నాను నోరు మూసుకొని పక్కకు వెళ్ళు అని తిడతాడు. అప్పుడు, జ్ఞానాంబ,నీకు ఇంటి బాధ్యతలు,ఇంటి అధికారం ఇచ్చానని నువ్వు భయపడుతున్నట్లు ఉన్నావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏమీ లేదమ్మా, మేము తోడుగా ఉన్నాం కదా అని అంటాది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: పేదరాలిగా చస్తా కానీ, పేదరాలిగా బతకను.. ఫ్యామిలీపై తాప్సీ ఫన్నీ కామెంట్
Recommended image2
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image3
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved