janaki kalaganaledhu: జానకి చదువు గురించి చెప్పేసిన మల్లిక.. చితకబాదిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki)కి దెబ్బ తగలలేదు అని తెలుసుకున్న రామచంద్ర,జానకి పై కోప్పడుతూ ఉండగా ఇంతలో జానకి వెళ్లి రామచంద్రని హత్తుకుంటుంది. ఆ తరువాత రామచంద్ర ఇలాంటి ప్రయత్నాలు ఇంకొకసారి చేయకండి అని చెప్పి షాప్ కి వెళ్తాను అని అనగా మరి అత్తయ్య గారికి ఏం చెప్పి వెళ్తారు అని అనగా రామచంద్ర(rama chandra)ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.
తర్వాత జానకి(janaki) రామచంద్ర ని రెచ్చగొట్టగా రామచంద్ర మీకు ఒక శిక్ష వేస్తాను అని అంటాడు. మరొకవైపు మల్లిక అరటి తొక్క పట్టుకొని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర బుక్స్ తీసుకొని వచ్చి జానకి చదవమని చెప్పగా ఆ మాటలు విన్న మల్లిక(mallika) ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు జ్ఞానాంబ దంపతులు జానకి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మల్లిక అక్కడికి ద్రోహం మోసం అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది.
అప్పుడు మల్లిక(mallika) తిన్నగా సమాధానం చెప్పకపోయేసరికి జ్ఞానాంబ ఏం జరిగింది అని అడగగా అప్పుడు మల్లికా రాత్రి కాలేజీ వాళ్లు ఫోన్ చేసిన విషయాన్ని చెబితే నా మీద అరిచారు. అత్తయ్య గారు జానకి మరి ఇప్పుడు లోపల పెద్ద పెద్ద పుస్తకాలు ముందర పెట్టుకొని చదువుతూ ఉంది అనడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ఏంటి జానకి(janaki)పుస్తకాలు చదవుతోంది అనగా అప్పుడు మల్లిక మీకళ్ళతో మీరే చూస్తారు రండి అత్తయ్య గారు అని జ్ఞానాంబని రమ్మని చెప్పగా జ్ఞానాంబ రాను అని అంటుంది.
అప్పుడు మల్లిక(mallika)రమ్మని చెప్పి సతా ఇస్తుంది. అప్పుడు గోవిందరాజులు కాళ్ళు నొప్పి గురించి అడగగా మల్లిక వెటకారంగా సమాధానం చెబుతూ ఉంటుంది. వెళ్ళమని చెప్తున్నా కదా వెళ్ళు అని కోప్పడుతుంది. ఆ తర్వాత మల్లికను ఎలా అయినా ఇరికించాలి అని ఒక ప్లాన్ వేస్తుంది. మరొకవైపు మల్లిక, రామచంద్ర(rama Chandra) మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మల్లిక మల్లి జ్ఞానాంబ వాళ్ళను దగ్గరికి తీసుకొని వస్తుంది.
అక్కడ జానకి (janaki)వాళ్ళు హత్తుకొని ఉండటం చూసి జ్ఞానాంబ మల్లిక పై మండి పడుతుంది. రామచంద్ర అప్పుడు టెన్షన్ పడుతూ జానకిని చదువుకోమని చెబుతారు. ఆ తర్వాత మల్లిక(mallika) చేసిన పనికి జ్ఞానాంబ దంపతులు మల్లికని తిడుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్లీ మల్లిక, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి తిరిగి చూస్తూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ అది చూసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు మల్లికని వంటగదిలోకి తీసుకొని వెళ్లి వంట చేపిస్తుంది. జానకి వాళ్ళు అకాడమీకి వెళ్లడానికి రెడీ అవ్వగా అక్కడ జ్ఞానాంబ వాళ్ళని చూసి షాక్ అవుతారు.