- Home
- Entertainment
- Janaki Kalaganaledhu: సొంత తమ్ముడుతో వెన్నెల పెళ్లి చెయ్యాలనుకుంటున్న మల్లిక.. షాకింగ్ ప్లాన్ తో ట్విస్ట్!
Janaki Kalaganaledhu: సొంత తమ్ముడుతో వెన్నెల పెళ్లి చెయ్యాలనుకుంటున్న మల్లిక.. షాకింగ్ ప్లాన్ తో ట్విస్ట్!
Janaki Kalaganaledhu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ జానకి కలగనలేదు. ప్రతిరోజు సరికొత్త ట్విస్ట్ తో కొనసాగుతున్న ఈ సీరియల్ లో ఈరోజు వెన్నెల పెళ్లి గురించి సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జానకి దిలీప్ వాళ్ళ అమ్మకి దిలీప్, వెన్నెల ప్రేమించుకుంటున్న విషయాన్ని చెప్పద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మల్లిక వినడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక జానకి వచ్చి మల్లికను చూడడంతో మీ ఇల్లు బాగుంది అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ కట్నం ఎంత అడిగిన ఇద్దాం అని చెప్పగా జానకి అసలు కట్నమే వద్దంటున్నారు అని ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడింది అని మాట మార్చి చెప్తుంది. దాంతో సంతోషపడిన జ్ఞానాంబ తన భర్త, అత్తయ్యతో చెప్పి మీకు కబురు పెడతాను అని చెప్పి వెళ్లిపోతుంది.
దిలీప్ వెన్నెల కు ఫోన్ చేసి అంతా బాగా జరిగింది అని చెబుతూ ఉంటాడు ఈలోపు మల్లిక నా ఫోన్ మర్చిపోయాను అత్తయ్య గారు వెళ్లి తెచ్చుకుంటాను అని మళ్ళీ లోపలికి వెళుతుంది.దిలీప్ మీ వదిన జానకి చాలా గ్రేట్ అంటూ మన పెళ్లి విషయంలో ఎలాంటి భయం వద్దు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఈ లోపు అక్కడికి వచ్చిన మల్లికను చూసి కాల్ కట్ చేస్తాడు. మల్లిక మాత్రం అనుమానంగా చూస్తూ వెళ్ళిపోతుంది.
జ్ఞానాంబ దిలీప్ వాళ్ల సంబంధం నాకు నచ్చిందని మీ నాన్న రాగానే పెళ్లి ముహూర్తం పెట్టిదం అంటుంది. మల్లిక మాత్రం ఈ పెళ్లి పెటాకులు చేసి తన తమ్ముడికి వెన్నెలను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. జ్ఞానాంబ వెన్నెల ను పిలిచి మీ వదిన నీకు చాలా అద్భుతమైన సంబంధం చూసిందని పొగుడుతుంది. వెన్నెల జానకి కి థాంక్స్ చెప్తుంది. దాంతో మల్లిక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
జానకి ఈ పెళ్లి ప్రేమ పెళ్లి అని ఎవరికీ తెలియకూడదు అని పెద్దలు కుదిర్చిన పెళ్లి లాగానే ఉండాలని అనుకుంటూ ఉంటుంది. వెన్నెల తనకి నచ్చిన వాడితో పెళ్లి సంబంధం కుదర్చినందుకు జానకి దగ్గరికి వచ్చి సంతోష పడుతూ ఉంటుంది. జానకి ఈ విషయం మల్లికకు తెలియకూడదని, ఈ విషయం గురించి మాట్లాడొద్దు అంటుంది. రామచంద్ర జానకి కోసం నైట్ కోచింగ్ అప్లికేషన్ ఫామ్ తీసుకువస్తాడు.
జానకి రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలి అని రామచంద్రను అడుగుతుంది. దాంతో రామచంద్ర అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడడం, మీ చదువు కోసం కష్టపడదాం, ఆ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్తాడు. ఇక నైట్ కోచింగ్లో ఇవ్వాలి జాయిన్ అవ్వాలని పుస్తకాలని సర్దుకొమ్మని చెప్తాడు.
ఇక జ్ఞానాంబ ఫోన్ లో కేకుల ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. జానకి ని పిలిచి బర్తడే కోసం కేకులు తయారు చేయమని చెబుతుంది.
రామచంద్ర జానకి కోసం ఎదురు చూస్తూ, జానకి చాలా సమయమైనా రాకపోయేసరికి ఫోన్ లో జానకి ఫోటో ని చూపించి అందర్నీ అడుగుతూ ఉంటాడు. జానకి ఆటోలో వస్తూ ఉంటుంది. ఆటో డ్రైవర్ ఆటోను ఒక చోట అపి నీ నగలన్నీ ఇచ్చేయి అని బెదిరిస్తాడు. ఇక రానున్న రేపటి ఎపిసోడ్లో జరగబోతుందో తెలుసుకోవాల్సిందే