- Home
- Entertainment
- Janaki Kalaganaledhu: సీన్ అదుర్స్.. గోవిందా రాజు, జ్ఞానంబ పెళ్లి చూపులు.. ఎలా జరిగాయంటే?
Janaki Kalaganaledhu: సీన్ అదుర్స్.. గోవిందా రాజు, జ్ఞానంబ పెళ్లి చూపులు.. ఎలా జరిగాయంటే?
Janaki Kalaganaledhu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ఏ రేంజ్ లో సూపర్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐఏఎస్ చదువును ఆమె అత్తారింటికి వెళ్ళాక ఎలా కొనసాగిచ్చింది అనేది తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరీ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.

గోవిందా రాజు 1992లో జ్ఞానంబ పెళ్లి చూపులు ఎలా జరిగాయానేది చూపిస్తారు. గోవిందా రాజు ఏచ్చులకు పోయి జ్ఞానంబ దగ్గర బుక్ అవుతాడు. మధ్యలో రామచంద్ర, మల్లికలు గోవింద్ రాజుపై పంచ్ లు వేస్తాడు. దీంతో జ్ఞానంబ చివరి వరకు చూడండి అని చెప్తుంది..
జ్ఞానంబ అప్పట్లో ఎలా గోవింద్ రాజుకు చుక్కలు చూపించిందో చూపిస్తుంది.. మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన పనిలేదు అంటూ షాక్ ఇస్తుంది.. దీంతో జ్ఞానంబ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకోవాలని బ్రతిమిలాడుతాడు. దీంతో ఇద్దరి పెళ్లి చూపుల సీన్ పూర్తవుతుంది.
నీ కోసం నీ కోసం అనే పాట బ్యాగ్రౌండ్ లో వచ్చి జ్ఞానంబ, గోవిందా రాజు నవ్వులు చూపిస్తారు. అతర్వాత జ్ఞానంబ, గోవిందరాజుకు సంప్రదాయంగా మరోసారి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి కోసం చేసినవి చూసి మల్లిక కుళ్ళుకొని ఏడుస్తుంది. అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరుగుతుంది.
పెళ్లి తర్వాత జరిగే తంతులో చంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారో కార్యక్రమం పెడుతారు. అందులో జ్ఞానంబనే రెండు సార్లు గెలుస్తుంది. ఇక మరోవైపు మల్లిక పెద్దమ్మకు ఫోన్ చేసి జ్ఞానంబను అవమానించడానికి ప్లాన్ ఇస్తుంది. రూ.50 పారితోషికం ఇస్తా అంటుంది.. ఆమె 500 రూపాయిలు కావాలని పట్టుబడుతుంది.
ఇస్తా అంటేనే వస్తా అంటే.. సరే వచ్చి చావు ఇస్తాను అంటుంది. ఆమె వచ్చి వీరి సంతోషాన్ని పాడుచేయ్యడం కోసం అన్నీ రకాల ఎత్తులు వేస్తుంది. బంగారా బంగారా అనే సాంగ్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆమె వచ్చి సీన్ కట్ చేస్తుంది.. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.