Janaki Kalaganaledu: తోడికోడలిని చూసి కుళ్ళిపోతున్న మల్లిక.. జానకికి మళ్లీ పరీక్ష?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki)జ్ఞానాంబ కోసం ఫిల్టర్ కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే రామచంద్ర అక్కడికి రావడంతో రామచంద్ర ను అడిగి ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకుంటుంది. ఆ సమయంలో ఇద్దరూ కాస్త ప్రేమగా చనువుగా కనిపిస్తాడు. మరొకవైపు గోవిందరాజులు(govindarajulu)తనకి కాఫీ కావాలి అని తంటాలు పడుతూ ఉంటాడు.
అప్పుడు జానకి కాపీ తీసుకుని రావడంతో ఇంతలో మల్లిక అక్కడికి రాగా అక్కడ గోవింద రాజు జానకిని పొగుడుతారేమో అని ఆత్రుతగా ఎదురు ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు జ్ఞానాంబ(jnanamba), గోవిందరాజులు జానకి తెచ్చిన కాఫీ తాగి ఆమెను పొగుడుతారు. కానీ మల్లిక(mallika) మాత్రం అది చూసి కుళ్లుకుంటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు మల్లిక ముందు జానకిని పొగుడుతూ మల్లికను వెటకారం చేస్తూ ఉంటాడు.
అప్పుడు జ్ఞానాంబ మల్లిక(mallika) జానకి ఇద్దరినీ దగ్గరికి పిల్చుకొని మీరిద్దరూ కూతురు లాంటి వాళ్లు ఇద్దరినీ ఒకేలా చూస్తాము అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ జానకిని(janaki) నువ్వు సొంత అక్కలా చూసుకోవాలి అని అనటంతో మల్లిక తన మనసులో వెక్కిరిస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు రామ జానకి ఫిల్టర్ కాపీ చేయడానికి నువ్వు సహాయం చేశావు కదా అని అనగానే రామచంద్ర కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు.
ఆ తర్వాత జానకి (janaki)ఫంక్షన్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పుడు జానకి ఏ చీర కట్టుకోవాలి రామచంద్రం సెలెక్ట్ చేయమని అడగగా అప్పుడు రామచంద్ర(rama chandra)వంటల ప్రోగ్రాంలో సులువుగా గెలవచ్చు కానీ ఈ చీర సెలెక్ట్ చేయడంలో మాత్రం చాలా కష్టము అని అంటాడు. అలా చివరికి జానకి అనుకున్న చీరలు రామ సెలక్ట్ చేయడంతో మన ఇద్దరి అభిరుచులు ఒకటే అని అంటుంది జానకి.
మరొకవైపు మల్లిక(mallika) కూడా గ్లామర్ గా రెడీ తన అందం చూసి తానే పొగుడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి చీర బాగా లేదు మార్చుకోమని అంటాడు. కానీ మల్లిక వినిపించుకోకుండా అలాగే బయటికి వెళ్తుంది. అప్పుడు జ్ఞానాంబ(jnanamba)మల్లికను తిట్టి చీర మార్చుకునేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత జానకి,జ్ఞానాంబ, మల్లికా ముగ్గురు ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ ఒక ఆమె జానకి ఇంకా విశేషం ఏమీ లేదా అని అనటంతో జానకి మౌనంగా ఉంటుంది.