- Home
- Entertainment
- Janaki kalaganaledu: బయటకొచ్చిన జానకి, రామచంద్ర.. పెళ్లి సంబంధం కుదరడంతో ఆలోచనలో పడ్డ వెన్నెల!
Janaki kalaganaledu: బయటకొచ్చిన జానకి, రామచంద్ర.. పెళ్లి సంబంధం కుదరడంతో ఆలోచనలో పడ్డ వెన్నెల!
Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ బాధ్యతగల కుటుంబం అనే కాన్సెప్ట్ తో ప్రసారమవుతుంది. దీంతో ఈ సీరియల్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

జ్ఞానాంబ (Jnanamba).. పూజారి పూజా విషయం గురించి చెప్పటంతో.. జానకి, రామచంద్రలను గుడికి పంపించాలని అనుకుంటుంది. దాంతో మల్లికకు తెగ మండిపోతుంది. తాను కూడా వెళ్తాను అనడంతో గోవిందరాజు (Govindha Raju) వెంటనే తన గత పురాణాన్ని బయట పెట్టి అందరి ముందు తన పరువు తీస్తాడు.
ఇక జ్ఞానాంబ జానకి (Janaki) వాళ్లను గుడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోమని చెబుతుంది. ఇక మల్లిక (Mallika) కోపంతో రగిలిపోతూ ఇలాంటి మామయ్య ఏ కోడలికి రావద్దు అని కోరుకుంటుంది. ఇక తను కూడా ఎక్కడికైనా వెళ్లాలి అని ప్లాన్ చేస్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుంది.
వెంటనే విష్ణు (Vishnu) వచ్చి అడగటంతో హనీమూన్ కి వెళ్దాం అని అంటుంది. ఇది సాధ్యమేనా అని అనడంతో తను ఒక ప్లాన్ చేస్తుంది. మరోవైపు జానకి బట్టలు సర్దుతూ ఉంటుంది. ఇక రామచంద్ర మరో బ్యాగులో బట్టలు సర్దుకుంటాడు. దాంతో జానకి ఎందుకు ఇలా సర్దుకుంటున్నారు అని అడగగా రామచంద్ర (Rama Chandra) మాత్రం నోరు విప్పడు.
ఇక జ్ఞానాంబ వంటగదిలో ఉండగా తనకు మల్లిక (Mallika) వాళ్ళ నానమ్మ ఊరు నుండి ఫోన్ వస్తుంది. మల్లిక వాళ్ళ నానమ్మకు ఆరోగ్యం బాగా లేదని తనను పంపించమని అంటారు. వెంటనే జ్ఞానాంబ విష్ణు (Vishnu) ని పిలిచి విషయాన్ని చెబుతుంది. ఇక మల్లిక నాయనమ్మ అంటూ బాగా ఫన్నీ డ్రామా క్రియేట్ చేస్తుంది.
అది చూసిన జ్ఞానంబ విష్ణుతో (Vishnu) తన ఊరికి తీసుకెళ్ళమని అంటుంది. సంతోషంలో మునిగి తేలుతుంది మల్లిక (Mallika). కానీ ఇదంతా నాటకం. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే మల్లిక వాళ్ళ నానమ్మ మల్లిక దగ్గరికి రావడానికి బయల్దేరుతుంది. దీంతో జ్ఞానాంబ చేతిలో మల్లిక పని అయిపోయినట్లే.
మరోవైపు కారులో జానకి (Janaki), రామచంద్ర ప్రయాణిస్తారు. జానకి ఎంత మాట్లాడినా రామచంద్ర పట్టించుకోడు. ఇక వెన్నెల కోసం గతంలో వద్దనుకున్న సంబంధం మళ్ళీ తిరిగి వస్తుంది. దీంతో జ్ఞానాంబ సంతోషపడుతుంది. కానీ వెన్నెల (Vennela) మాత్రం తన ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక టెన్షన్ పడుతుంది.