- Home
- Entertainment
- Janaki kalagana ledu: రామచంద్ర, జానకిపై జ్ఞానంబ ఉగ్రరూపం.. జానకి ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నలు?
Janaki kalagana ledu: రామచంద్ర, జానకిపై జ్ఞానంబ ఉగ్రరూపం.. జానకి ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నలు?
Janaki kalagana ledu: బుల్లితెరపై ప్రసారమౌతున్న జానకి కలగనలేదు (Janaki kalagana ledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జానకి కేకులు తయారు చేసే అలిసిపోయి ఒక పిల్లర్ కి ఆనుకొని నిద్ర పోతూ ఉంటుంది. ఇక జానకి మీద సూర్యుడు ఎండ పడుతుందని రామచంద్ర (Ramachandra) కండువా అడ్డు పెట్టి నీడ ఉండేలా చేస్తాడు. ఇక అలా నిద్రపోతున్న జానకిని కంటికి రెప్పలా నిద్ర చెడిపోకుండా చూసుకుంటాడు రామచంద్ర (Ramachandra) .
ఆ తర్వాత జానకి నిద్రపోతుండగా ఎత్తుకొని మంచం దగ్గరికి తీసుకు వెళ్ళి పడుకో పెడతాడు. ఇక అది జానకి (Janaki) కూడా గ్రహించుకొని కావాలనే ఫన్నీగా పడుకుంటుంది. ఆ తర్వాత మల్లిక (Mallika) వంట చేస్తూ ఉండగా చేయి కాలిందని గట్టిగా గోల చేస్తూ ఫన్నీ గా అరుస్తుంది. దాంతో జానకి వంట నేను చేస్తాను లే నువ్వు మందు రాసుకో అని చెబుతుంది.
ఆ తర్వాత సుబ్బయ్య కూతురు పెళ్ళికి తాంబూలం ఇవ్వడానికి నేను రామచంద్ర (Ramachandra) గారు వెళ్తాము అని జానకి తాంబూలం తీసుకుంటుంది. ఆ తర్వాత మల్లిక (Mallika) , సుబ్బయ్య కూతురు పెళ్ళికి బావగారు ఒక్కరు వెళ్లారని జానకి వెళ్లలేదని జ్ఞానాంబ కు చాడీలు చెబుతుంది. కానీ జ్ఞానాంబ అది నమ్మక పోవడంతో మల్లిక ఇంటి పక్కన లీలావతి ఆంటీ ని పిలిపించి మరి చెప్పిస్తుంది.
ఇక అక్కడికి వచ్చిన లీలావతి చీర సారె కూడా రామచంద్ర (Ramachandra) ఒక్కడే పెట్టాడు అని చెబుతోంది. ఇక ఆ విషయం తెలిసిన జ్ఞానాంబ (Jnanaamba) మరింత కోపం వ్యక్తం చేస్తుంది. ఈ లోపు జానకి, రామచంద్రలు రానే వస్తారు. ఇక పెళ్ళికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావ్ అని జ్ఞానాంబ నీలాదీసి అడుగుతుండగా ఈలోపు రామచంద్ర (ramchandra) మేనమామకు బదులుగా మెట్టలు తీసుకొని రావడానికి వెళ్ళింది అని కవర్ చేస్తాడు.
ఆ తరువాత జానకి (Janaki) ను క్లాస్ కి తీసుకు వెళ్ళడానికి రామచంద్ర చాటుగా గోడ దూకిస్తాడు. ఇక వీరిద్దరూ దొంగచాటుగా గోడ దూకుతూ ఉండగా అది మల్లిక (Mallika) చూస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందొ చూడాలి.