MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Malli: మల్లీ నుదుటిన సింధూరం దిద్దిన అరవింద్.. మల్లీకి పెళ్లి చేయాలనుకుంటున్న మాలిని?

Malli: మల్లీ నుదుటిన సింధూరం దిద్దిన అరవింద్.. మల్లీకి పెళ్లి చేయాలనుకుంటున్న మాలిని?

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు జనవరి 31వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
| Updated : Jan 31 2023, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో మీరా, శరత్ తో ఫోన్ మాట్లాడుతూ దాని రెక్కల కష్టంతో ఎదగాలని చూస్తోంది దాని రెక్కలను తుంచేసి మీ ప్రేమ దానికి అక్కర్లేదు. ఇలా ఏదో ఒక కారణంతో పదేపదే ఫోన్ చేయొద్దండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మీరా. అప్పుడు ఫోన్ కట్ చేసి నన్ను క్షమించండి బాబు గారు ఇలా మాట్లాడితేనే మీరు మల్లీకి దూరంగా ఉంటారు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు మల్లీ దేవుడిని మొక్కుకుంటూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ తర్వాత నేను ఎక్కువగా తలుచుకుంది మిమ్మల్ని. మీరు అంత ఇష్టం ప్రేమ, దైర్యం అని అంటుంది. నాకు పెళ్లి జరిగినప్పుడు మిమ్మల్ని నిలదీశాను మొన్నటికి మొన్న మీపై నేను కోపడ్డాను. నాకు ఈరోజు అర్థమైంది మీరు నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు నాతోనే ఉన్నారు ఉంటారని అని అంటుంది మల్లీ.
 

26

 జీవితంలో కలెక్టర్ అవుతాను అని అమ్మకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ఎన్ని కష్టాలైనా పడతాను మీరు నాతో ఉంటే చాలు అని దేవుని వేడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మల్లీ పని చేసుకుంటూ ఉండగా ఇంతలో ఇంట్లో అందరూ వచ్చి మల్లీ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. తర్వాత తలా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇవ్వడంతో మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బందర్ ఆట పట్టించడంతో అందరూ కలిసి సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత మాలిని, అరవింద్ కలిసి మళ్ళీ ఒక గిఫ్ట్ తీసుకొని వస్తారు. అప్పుడు మాలిని ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూడాలని ఉంది అది ఓపెన్ చెయ్ మల్లీ అని అంటారు. అప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అందులో వరుడు బొమ్మ ఉండడంతో అది చూసి మల్లీ షాక్ అవుతుంది.
 

36

అది చూసి ఇంట్లో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అది ఏంటి మాలిని పెళ్ళికొడుకు బొమ్మ ఇచ్చావు పెళ్లి చేసుకోమని చెబుతున్నావా అనడంతో అత్తయ్య ఆడపిల్లకు ఎంత ఆస్తి ఉన్న భర్త ప్రేమను మించిన వేరొకటి ఉండదు. ఎంతమంది చుట్టూ ఉన్న భర్త ఉంటే ఆ ఆనందమే వేరు అని అంటుంది మాలిని. ఆడపిల్ల ఎంత గొప్ప చదువులు చదువుకున్న ఏదో ఒక రోజు ఆ మూడుముళ్ల బంధానికి తల వంచాల్సిందే అంటుంది మాలిని. అందుకే మళ్లీ కి త్వరగా పెళ్లయ్యి తనకంటూ ఒక కుటుంబం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది మాలిని. దాంతో అరవింద్, మల్లీ ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి అరవింద్ అలా ఉన్నావు నేను మల్లీకి ఆ గిఫ్ట్ ఇవ్వడం నీకు ఇష్టం లేదా అనడంతో వెంటనే అరవింద్ వాళ్ళ అమ్మ అంత మంచి గిఫ్ట్ ఇస్తే అరవింద్ కానీ ఎందుకు వద్దంటాడమ్మా అని అంటుంది.
 

46

మల్లీ నువ్వు నన్ను అక్క అని పిలుస్తావు కదా,అదే బాధ్యతతో నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అంటుంది మాలిని. అప్పుడు అరవింద్ ఏం మాట్లాడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మల్లీ ఆ బొమ్మను చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు శరత్ మీరా అన్న మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇందులో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఏంటి చాలా ఆనందంగా ఉన్నావు అనడంతో అవునమ్మా చాలా సంతోషంగా ఉన్నాను మళ్ళీ స్టేట్ సెకండ్ ర్యాంకు వచ్చింది కదా అని అంటాడు. ఇంతలో వసుంధర అక్కడికి వచ్చి మల్లీని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఎందుకు వసుంధర నువ్వు మల్లీ విజయాన్ని ఒప్పుకోవడం లేదు అనగా ఎందుకు ఒప్పుకోవాలి అది నాకు ఏమవుతుంది అని అంటుంది.
 

56

ఈరోజు నువ్వు ఎవరైతే పని మనిషి అనుకుంటున్నావు రేపు తలెత్తి చూస్తావు అనగా దాన్ని చూడడమే వేస్ట్ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు అరవింద్ మల్లీ కోసం టెర్రస్ మీద ఎదురు చూస్తూ ఉంటాడు. మల్లీ అక్కడికి రావడంతో నువ్వు నన్ను ఎప్పుడు నీ సొంతం కాదని అనుకుంటావు కదా నేను ఎప్పటికీ నీ సొంతం అని చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను అని అంటాడు. అదేంటి బాబు గారు అనడంతో కళ్ళు మూసుకో అని అంటాడు. అప్పుడు మల్లీ కళ్ళు మూసుకోవడంతో కుంకుమ తీసి కుంకుమను నుదిటిన పెడతాడు. అప్పుడు మల్లీ ఆశ్చర్య పోతుంది. చూడు మల్లీ ఎవరూ ఏమనుకున్నా సరే విధి మనల్ని ఒకటి చేసింది. మనమిద్దరం భార్యాభర్తలం పంచభూతాల సాక్షిగా మన పెళ్లి జరిగింది అని అంటాడు.
 

66

నీకు ఇప్పుడు మాట ఇస్తున్నాను మల్లీ ప్రతి ఒక్క విషయంలో నీకు ధైర్యంగా నేను ఉంటాను అండగా నీకు ఉంటాను అని అంటాడు. అప్పుడు అందుకే నీకు గుర్తుగా ఈ సింధూరాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను అని కుంకుమను మల్లీ చేతిలో పెడతాడు అరవింద్. అప్పుడు మల్లీ సంతోషంతో థాంక్యూ బాబు గారు మీరు నా కోసం చాలా చేస్తున్నారు అని అంటుంది. నాకోసం చాలా కష్టపడ్డారు మీరు లేకపోతే ఈరోజు మల్లీ అనేది లేదు అని అంటుంది మల్లీ. అప్పుడు వారిద్దరూ వారి పెళ్లి బంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image3
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved