MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: అభి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక.. సంతోషంలో వేద ఫ్యామిలీ?

Ennenno Janmala Bandham: అభి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక.. సంతోషంలో వేద ఫ్యామిలీ?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Feb 02 2023, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 ఈరోజు ఎపిసోడ్లో అందరూ ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు చిత్ర,ఖుషి ఇద్దరు డాన్స్ చేస్తూ ఉండడంతో అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు వేద టెన్షన్ తో అక్కడికి వచ్చి నేను ముగ్గుల పోటీల్లో గెలిచిన 50,000 కనిపించడం లేదు అత్తయ్య అనడంతో వెంటనే సులోచన అక్కడే ఎక్కడో పెట్టి ఉంటావు వెతుకమ్మ అనగా లేదమ్మా అంటుంది. ఇంతలోనే యష్ ఇక్కడ ఉన్నాయి అంటూ డబ్బులు తీసుకుని వస్తాడు.  మీరెందుకు డబ్బులు అవి నా డబ్బులు అనడంతో కాదు ఇవి నా డబ్బులు అని అంటాడు యష్. అదెలా కుదురుతుంది నేను ముగ్గుల పోటీలో గెలిచాను అనడంతో ఆ ముగ్గుల పోటీకి స్పాన్సర్ చేసింది నేనే కాబట్టి నేను తీసుకున్నాను అని అంటాడు యష్.

28

అదేంట్రా అనడంతో నేను ముందే చెప్పాను కదా నాన్న ఈ 50,000 అనౌన్స్ చేసింది వేద కచ్చితంగా పోటీలో గెలుస్తుందని నేను 50,000 ఇచ్చాను అని అంటాడు యష్. ఆ డబ్బులు తిరిగి నా దగ్గరకు వస్తాయని నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు అత్తయ్య నేను చేసింది కరెక్టే కదా అనగా నా అల్లుడు ఏది చేసినా కరెక్టే అంటుంది సులోచన. అప్పుడు మాలిని నా కోడలు బంగారం నా కోడలు ఏది చేసినా కరెక్టే అనడంతో వెంటనే వేద ఆ డబ్బులతో అందరికీ గిఫ్ట్ కొనిద్దామని అనుకున్నాను అనడంతో యష్ షాక్ అవుతాడు. అవునా అయితే సూపర్ యష్ ఆ డబ్బులు వేదాకి ఇచ్చేయ్ అనడంతో అమ్మ లేదు నాకు ఈ డబ్బులు అవసరం ఉంది అంటాడు. నీకేంటి రా అవసరం అంటూ యష్ చేతులు ఉన్న 50,000 తీసుకొని వేదాకి ఇస్తుంది మాలిని.

38

 అది చూసి యష్ కుళ్ళుకుంటూ ఉండగా వేద కావాలనే ఆ డబ్బులు యష్ కి అలాగే చూపిస్తూ ఉంటుంది. మీ ఆడవాళ్లకు డబ్బులు కనిపిస్తే చాలు షాపింగ్ అనగా వాడి మాటలు పట్టించుకోకు వేద నువ్వు చెప్పు మనం ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళాము అంటుంది మాలిని. అప్పుడు నన్ను క్షమించండి అత్తయ్య ఈ 50 వేలు గిఫ్ట్ లు కొనడం కోసం కాదు అనడంతో అందరూ ఆశ్చర్యంగా వేదవైపు చూస్తూ ఉంటారు. ఈ డబ్బులతో అపార్ట్మెంట్ కింద ఉన్న అనాధ పిల్లలకు బట్టలు గిఫ్ట్లు కొనివ్వాలని ఖుషి ఆశపడుతోంది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. మరొకవైపు భ్రమరాంబిక ,మాళవిక పార్టీలో జరిగిన అవమానాలను తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు.
 

48

అప్పుడు భ్రమరాంబిక పదేపదే మాళవిక అన్నమాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉండగా అది కైలాష్,అభి అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు కైలాస వీరి మధ్య ఆ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఏదో పెద్ద గొడవ జరిగినట్టు ఉంది అంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో అని కైలాష్ అంటుండగా ఇంతలోనే భ్రమరాంబిక అభిని పిలుస్తుంది. చెప్పు అక్క అనడంతో ఎవర్రా నువ్వు హూ ఆర్ యు అనడంతో అభి షాక్ అవుతాడు. నువ్వు ఈ భ్రమరాంబిక ఒక్కగానొక్క తమ్ముడువి అనడంతో అవునక్కా అని అంటాడు. నా కోట్ల ఆస్తికి వారసుడైన నువు ఒక పనికిమాలిన,ఇద్దరు బిడ్డల తల్లిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని సీరియస్ అవుతుంది భ్రమరాంబిక. దానికి ఎంత ధైర్యం నా మీద తిరగబడుతుందా నన్నే తిడుతుందా ఆ మాలవిలకు ఎంత ధైర్యం అని భ్రమరాంబిక కోపంతో ఊగిపోతూ ఉంటుంది.
 

58

వచ్చే మాఘమాసంలో తెల్లవారుజామున 3 గంటలకు నీ పెళ్లి ఫిక్స్ అనడంతో అభి,మాళవిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. నా చేతుల మీదుగా నీ పెళ్లి జరుగుతుంది ఇది ఫిక్స్ అయిపో అని అంటుంది. పెళ్లి ఫిక్స్ తాళి కట్టడం ఫిక్స్ అన్ని ఫిక్స్ కానీ పెళ్లికూతురు మాత్రం నేను చూస్తాను నేను చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందం అభినయం ఉన్న అమ్మాయి కావాలో లేక ఇద్దరూ పిల్లల్ని మొగుడిని వదిలేసిన ఆడది కావాలో నువ్వే తేల్చుకో అంటుంది భ్రమరాంబిక. తర్వాత ఆ తర్వాత రత్నం, శర్మ కలిసి మందు తాగాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విన్నీ ఫారెన్ బ్రాండ్ మందు తీసుకొని రావడంతో సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే సులోచన మాలిని రావడంతో రత్నం శర్మ ఇద్దరూ మాకేం తెలియదు అని తప్పించుకుంటారు.
 

68

అప్పుడు విన్నీ ఏం కాదు అంటే ఇది ఒక్కసారి కి ఫారెన్ గ్రాండ్ అదేపనిగా అంకుల్ వాళ్ళ కోసం తీసుకువచ్చాను అని అంటాడు విన్నీ. ఇంతలో వేద అక్కడికి వచ్చి అమ్మ అత్తయ్య వాళ్ళేదో కాస్త రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళని వదిలేయండి అని అనడంతో సులోచన, మాలిని కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు వేద వాళ్ళను పిలుచుకొని వెళ్లడంతో ఆ తర్వాత విన్నీ శర్మ రత్నం ముగ్గురు కలిసి ఎంచక్కా మందు తాగుతూ ఉంటారు. అప్పుడు యష్ రావడంతో యష్ ని చూడడంతో రత్నం శర్మ ఇద్దరూ తలదించుకుంటారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఎంచక్కా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు.
 

78

మరోవైపు మాలిని ముగ్గుల పోటీలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సులోచన వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వేద ,యష్ గురించి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వదిన గారు మీరు లేకపోతే నేనేం అయ్యే దాన్ని అనడంతో మీరు లేకపోతే నేను అలాగే దాన్ని వదిన గారు అంటూ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే మళ్లీ ఫన్నీగా గొడవ స్టార్ట్ చేసి పోట్లాడుకుంటూ ఉంటారు.  మరోవైపు యష్ బెడ్రూంలోకి వెళ్లి మొగుడు మీద ధ్యాసే లేదు ఈ పాటికి డిన్నర్ కి రావాలని పిలవాలి కదా తెలియదా అనుకుంటూ ఉంటాడు.

88

ఇంతలో వేద అక్కడికి వచ్చి డిన్నర్ తినకుండా పడుకున్నారు ఏంటి వచ్చి డిన్నర్ చేదురు అండి అనడంతో కావాలని బెట్టు చేస్తూ నాకు ఆకలిగా లేదు అంటాడు. అప్పుడు సరేలెండి ఆ బిర్యానీ పొద్దునే పనిమనిషికి ఇస్తాను అనడంతో ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు యష్ సిగ్గు పడుతూనే సరే నాకోసం అంతలా ప్రేమగా చేసి అంటున్నావు కదా తిందాం పద అని వేద,యష్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Lavanya Tripathi: ప్రెగ్నెన్సీతోనే ఫైట్‌ చేసిన లావణ్య త్రిపాఠి.. వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?
Recommended image2
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image3
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved