- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మితిమీరిన నీలాంబరి పైశాచికత్వం.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న మాళవిక?
Ennenno Janmala Bandham: మితిమీరిన నీలాంబరి పైశాచికత్వం.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న మాళవిక?
Ennenno Janmala Bandham : స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తప్పటడుగులు వేసి నడిరోడ్డు మీదికి వచ్చినా తన బుద్ధి పోనిచ్చుకోని ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అదేంటి మాళవిక అప్పుడే లేచావు అని అడుగుతుంది వేద. లేసిందే కాక ఉదయాన్నే ఏమైనా పని చేయాలా అని అడుగుతుంది. తను ఇంట్లో మనిషి కాదు పనులు చేయడానికి అతిధి గా వచ్చింది కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాది. ఇంట్లో మనిషి లాగా కలవాల్సిన అవసరం లేదు అని అంటుంది మాలిని. అప్పుడు వేద అలా మాట్లాడకండి అత్తయ్య గారు అని మాలినితో చెప్తూ, నువ్వు నిన్నటి నుంచి ఏం తినలేదు కదా టిఫిన్ తేనా మాళవికని అడుగుతుంది వేద. ఆవిడ గారికి భోజనాలు టిఫిన్లు ఎందుకు ఒక చుక్క మందు ఇస్తే అందులోనే తాగి తూగుతాది.
అయినా సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళని మన ఇంట్లో పెట్టుకున్నందుకు మన పరువు పోతుంది అని అంటుంది మాలిని. ఆవిడ చెప్పేది నిజమే కదా నేను ఇక్కడ ఉంటే ఇంటి పరువు పోతుంది అయినా నేను నా ఇష్టప్రకారం ఇక్కడకి రాలేదు. మీరు బలవంతం చేయడం వల్లే వచ్చాను. రెండు రోజులు ఆగి ఇల్లు అద్దెకి వెతుక్కొని ఆదిత్య తో పాటు వెళ్లిపోతాను అంటుంది మాళవిక. అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఆదిత్యని తీసుకువెళ్లడం ఏంటి అని అడుగుతుంది వేద. అవును నేను అతిధి అయినప్పుడు నా కొడుకు కూడా అతిధే అవుతాడు కదా అందుకే ఆదిత్యను కూడా తీసుకెళ్లిపోతాను అని మాళవిక అంటుంది.
ఆదిత్య కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడు కొన్ని రోజులు టైం ఇవ్వు. అప్పుడు వరకు ఇక్కడే ఉండండి ఇప్పుడప్పుడే మారొద్దు అని అంటుంది వేద. మాళవిక వెళ్ళిపోయిన తర్వాత, ఆదిత్యను ఆ రాక్షసి ఎలా తీసుకొని వెళ్ళిపోతాది నా మనవడు నాకు దూరంగా ఉంటాడా అని భయపడుతుంది మాలిని. మీరు బాధపడకండి అత్తయ్య ఆదిత్యని ఇక్కడ ఉంచే బాధ్యత నాది. నేనే ఎలాగైనా మాళవికను ఒప్పిస్తాను అని వేద అంటుంది. ఈ మాటలన్నీ ఒక మూల నుంచి వింటున్న మాళవిక నన్ను రాక్షసి అంటుందా? నేను వద్దుకాని నా కొడుకు కావాలా? చూపిస్తాను నేనంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటుంది.
ఆ తర్వాత సీన్లో అభి, నీలాంబరి, కైలాష్ నించొని ఉంటారు. ఈరోజు నన్నెందుకు పంచ కట్టుకుని రమ్మన్నావు అని అభి అడగగా ఈరోజు ఒక పూజ ఉంది నీ పాదాలకు అభిషేకం చేస్తున్నాను ఇప్పుడే నీళ్లు తెస్తాను అని వెళ్తుంది నీలాంబరి. హమ్మయ్య ఈరోజు ఇంకే పరీక్షలు లేవు. ఇది అయిన తర్వాత శోభనం, పిల్లలు, చివరికి ఆస్తి దొరుకుతుంది అని ఆనంద పడిపోతాడు అభి. నాకెందుకో ఇందులో కూడా ఏదో తిరకాసు ఉన్నట్టుంది అని అంటాడు కైలాష్. ఇంతలో వేడి నీళ్లు పట్టుకుని వస్తుంది నీలాంబరి. ఏంటివి అని అనగా వేడి నీళ్ళ తో నీకు అభిషేకం చేస్తాను అని అంటుంది.
ఇవి నా కాళ్ళ మీద పడితే నా ప్రాణం పోతుంది అని అంటాడు అభి. నా ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ నాకు మీ మీద ఉంది. మీకు నా మీద ఈ మాత్రం ప్రేమ లేదా. అంటే మా నాన్న చెప్పింది నిజమేనా అని బాధపడుతున్న నీలాంబరిని చూసి వీళ్ళ తండ్రి నా ప్రాణానికి వచ్చాడు అని మనసులో అనుకుంటాడు అభి. ఏడొద్దు కచ్చితంగా అభిషేకం చేయించుకుంటాడు అభి నువ్వేం బాధపడొద్దు చెల్లెమ్మా అని అంటాడు కైలాష్. కాలు కాలితే ఆయింట్మెంట్ రాసుకోవచ్చు ఆస్తి పోతే రావడం కుదరదు అని అభి కి ధైర్యం చెప్తాడు కైలాష్. వేడి నీళ్లు పోస్తున్నంత సేపు ఓర్చుకుంటాడు.
అభిషేకం అయిన తర్వాత హమ్మయ్య ఈ టెస్ట్ లో కూడా నువ్వు పాస్ అయ్యావు మళ్లీ నాకు ఎప్పుడైనా టెస్ట్ పెట్టాలనిపిస్తే అప్పుడు పెడతాను. అప్పుడు దాకా నువ్వు సేఫ్ అని అనగా మరి ఈ టెస్టులు ఎప్పుడు ముగుస్తాయి అని అడుగుతాడు కైలాష్. ఎప్పుడు ముగుస్తాయి అని ఏమీ ఉండదు నిరంతరంగా జరిగే కార్యమే ఇది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీలాంబరి. దీనికన్నా మాళవికే నయం అని అంటాడు కైలాష్. ఆ తర్వాత సీన్లో వేద ఖుషి ని రెడీ చేస్తుంది. ఇంక బయలుదేరుదాము అని యష్, ఖుషి బయలుదేరగా ఆదిను కూడా తీసుకెళ్ళు అని అంటుంది మాళవిక.
అవును కదా నేను ఆది గురించి మర్చిపోయాను రాత్రి మీరు లేటుగా పడుకోవడంతో ఆది ఈరోజు స్కూల్ కి వెళ్ళడు అనుకున్నాను అందుకే రెడీ చేయలేదు. ఆగు ఇప్పుడే క్యారేజీ కడతాను అని ఆదికి క్యారేజ్ ఇస్తుంది వేద. ఏవండీ ఆది ని కూడా తీసుకొని వెళ్ళండి అని అంటుంది వేద. సరే అంటాడు యష్. కొడుకు బాధ్యతలు ఇప్పుడు గుర్తొచ్చాయి ఇదే విధంగా కొడుకు తల్లిగా నా బాధ్యతలు కూడా తీసుకునేలా చేస్తాను ఈ ఇంట్లోనే చివరి వరకు ఉండిపోయేలా చూసుకుంటాను ఇదే నా ప్లాన్. ఎలాగైనా నా హక్కు నేను సాధించుకుంటాను అని మనసులో అనుకుంటుంది మాళవిక.
ఆ తర్వాత సీన్లో మాళవిక ఒక స్లమ్ ఏరియా కు వెళ్లి ఒక బ్రోకర్ తో మాట్లాడి ఇల్లు చూడమని చెప్తుంది. మరోవైపు ఆదిత్య తన ఇంట్లోనే ఉండాలి అని దుష్టశక్తులేవి రాకుండా ఇంటికి రక్షణగా గుమ్మడికాయ కట్టిస్తుంది మాలిని. ఇంతలో వేద కి ఒక ఫోన్ వస్తుంది వేద గారే కదా మాట్లాడేది అని అడుగుతాడు. అవును అని వేద అనగా, నేను బ్రోకర్ని మాళవిక గారు ఇక్కడ అద్దెలు తీసుకోవాలని అనుకుంటున్నారు. దానికి అసురెన్స్ గా మీ నెంబర్ ఇచ్చారు. మిమ్మల్ని కన్ఫర్మ్ చేయొచ్చు కదా అని అంటే కంగారు పడుతుంది వేద. అప్పుడే ఇల్లు మారిపోతుందా అని అనుకుంటూనే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
మరోవైపు ఆ బ్రోకర్, మీరు చెప్పినట్టే చేశాను అని మాళవికతో వెళ్లి చెప్తాడు కొంచెం డబ్బులు ఇచ్చి మరోసారి అవసరమైతే పిలుస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. మరోవైపు వేద కంగారుపడుతూ ఇప్పుడే మారిపోవడం ఎందుకు అని అనుకుంటుంది. మాలినితో జరిగిన విషయం అంతా చెప్తుంది. కోపంతో రగిలిపోతున్న మాలిని, అది నా మనవడిని ఎలా తీసుకొని వెళ్ళిపోగలదు. అది రానివ్వు దాని సంగతి చెప్తాను తాడోపేడో తేల్చుకోవాలి అని ఆవేశపడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.