- Home
- Entertainment
- Malaika Arora : చీర కట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మలైకా అరోరా.. చీర కాస్ట్ కాస్ట్ వింటే మతిపోవాల్సిందే
Malaika Arora : చీర కట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మలైకా అరోరా.. చీర కాస్ట్ కాస్ట్ వింటే మతిపోవాల్సిందే
Malaika Arora: ఎప్పుడూ వెస్ట్రన్ లో మెరిసే బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైక అరోరా.. ఈసారి చీరకట్టులోనూ గ్లామర్ ఒలకబోసింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్, స్టేట్మెంట్ బెల్ట్, జ్యూవెలరీతో రాయల్ లుక్ లో మెరిసిపోతున్నారు. మరి ఈ చీర కాస్ట్ తెలిస్తే మతి పోవాల్సిందే.

చీర కట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మలైకా అరోరా
ఫ్యాషన్ విషయంలో బాలీవుడ్ నటి మలైకా అరోరా ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటారు. సందర్భం ఏదైనా తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సాధారణంగా వెస్ట్రన్ దుస్తుల్లో ఎక్కువగా కనిపించే ఈ బ్యూటీ.. ఈసారి సంప్రదాయ చీరకట్టులో మెరిశారు. అయితే ఆమె ఎంచుకున్న లుక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. మెటాలిక్ షైన్‌తో మెరిసిపోయే చీరకు రాయల్ టచ్ ఇచ్చి తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు.
మెటాలిక్ చీరలో రాయల్ లుక్
మలైకా ఈ లుక్ కోసం ఛాంపేన్ బ్రాంజ్ కలర్లో ఉన్న మెటాలిక్ చీరను ఎంచుకున్నారు. చీరపై కనిపించే మెరుపు, అంచుల్లోని అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా పల్లూను భుజంపై అందంగా సర్దుకుని న్యూ స్టైల్లో చీరను కట్టుకున్నారు. దీంతో ఆమె లుక్కు మరింత రాయల్ టచ్ వచ్చింది.
ఈ చీరకు భారీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజ్ వేసుకున్నారు. బంగారు వర్ణం, ఆకుపచ్చ రంగు డిజైన్లు బ్లౌజ్‌కు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. ఇక నడుముకు ధరించిన స్టేట్మెంట్ బెల్ట్ ఈ లుక్‌లో మరో హైలైట్. రంగురంగుల రాళ్లు, ముత్యాలు, సంప్రదాయ డిజైన్లతో అలంకరించిన ఈ బెల్ట్ చీరకట్టుకు మరింత రాయల్ లుక్ ఇచ్చింది.
చీర ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
మలైకా ధరించిన ఈ అందమైన చీర ప్రముఖ డిజైనర్ లేబుల్ 'Itrh' కలెక్షన్‌కు చెందింది. ఆరు గజాల ఈ మెటాలిక్ చీర ధర అక్షరాలా రూ.2,20,000. అంటే కేవలం చీర కోసమే రూ.2.2 లక్షలు ఖర్చు చేశారు.
ఆభరణాలతో మరింత అందంగా..మేకప్‌లోనూ ప్రత్యేకత
చీరకట్టుకు తగ్గట్టుగా మలైకా ఆభరణాల ఎంపిక కూడా ప్రత్యేకంగా ఉంది. రాళ్లతో పొదిగిన చోకర్ నెక్లెస్, దానికి సరిపోయే ఇయర్ రింగ్స్, సంప్రదాయ మాంగ్ టిక్కా, గాజులు ధరించారు. జుట్టును చక్కగా వెనక్కి తీసి బన్‌లా కట్టుకోవడంతో ఆభరణాలు, బ్లౌజ్ డిజైన్లు మరింత ఎలివేట్ అయ్యాయి.
మేకప్ విషయంలోనూ మలైకా ఎక్కువ హంగులకు వెళ్లకుండా గ్లామరస్ లుక్‌ను ఎంచుకున్నారు. కళ్లకు ప్రత్యేకంగా కనిపించేలా ఐ మేకప్, మెరిసే చర్మం, ఐ బ్రోస్, పింక్ లిప్‌స్టిక్‌తో గార్జియస్ గా కనిపించారు. చీరలోని గోల్డెన్ టోన్లకు తగ్గట్టుగా మేకప్ వేసుకోవడంతో క్లాసిక్ గా కనిపించారు.













