Guppedantha Manasu: దేవయానిని అడ్డుపడ్డ మహేంద్రవర్మ.. రీ కౌంటర్ ఇచ్చిన వసు, జగతి?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రిషి (Rishi), వసులు (Vasu) ఒకరికొకరు చాటింగ్ చేసుకుంటా ఒకరి గురించి ఒకరు తలుచుకుంటారు. వసు రిషితో దిగిన ఫోటోలు చూసి మురిసి పోతుంది. వెంటనే రిషికి పంపిస్తుంది. ఇక రిషి కూడా ఆ ఫోటోను చూసి కాసేపు సంతోషంగా ఫీల్ అవుతూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు.
ఉదయాన్నే దేవయాని (Devayani) రిషి రూమ్ దగ్గరికి వచ్చి రిషి పక్కనే ఉన్న ఫోన్ చూస్తుంది. అందులో రిషి పక్కన ఫోటో ఎవరో ఉన్నారని చూడాలని అనుకునేసరికి మహేంద్ర వర్మ (Mahendra) అక్కడికి వస్తాడు. మళ్లీ ఫోన్ తీయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే రిషిని పిలుస్తాడు మహేంద్రవర్మ.
రిషి (Rishi) లేవడంతో ఆ ఫోటో కనిపించకుండా పోతుంది. దీంతో దేవయాని చిరాకు పడుతుంది. వెంటనే దేవయాని తన మనసులో ఆ ఫోటోలో ఉన్నది ఎవరు చూడలేకపోయాను అని అనుకుంటుంది. ఇక మహేంద్ర రిషికి, దేవయానికి (Devayani) కాఫీ ఇస్తాడు.
తన మనసులో దేవయాని (Devayani) ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చిందో అని అనుకుంటాడు మహేంద్ర. ఇక దేవయాని కూడా తనను చూసి మహేంద్ర వచ్చాడని అనుకుంటుంది. మహేంద్ర ఇంటి బయట రిషి (Rishi) ఎక్కిడికి వెళ్తున్నాడని అనుకోని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
కానీ రిషి మాత్రం మహేంద్రను (Mahendra) రానివ్వకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మహేంద్ర వర్మ తను వెళ్ళేది అక్కడికి కాదనుకొని అనుకుంటాడు. ఇంట్లో వసు పువ్వులను మారుస్తున్నప్పుడు రిషి వచ్చి హారన్ కొడతాడు. జగతి (Jagathi) ఎవరు అని బయటికి వచ్చి చూస్తుంది.
వెంటనే రిషి (Rishi) సార్ వచ్చాడని బయటికి వెళ్తుంది. ఇక రిషి ఫ్లవర్స్ గురించి అడగటం తో రిషి కి ఫ్లవర్స్ తీసుకోమని ఇస్తుంది వసు. దూరం నుండి జగతి (Jagathi) సంతోషంగా చూస్తుంది. ఇక రిషి తీసుకోడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి వచ్చానని అంటాడు.
అప్పుడే జగతి (Jagathi) వచ్చి ఇంట్లోకి పిలిచి కాఫీ ఇవ్వమని అంటుంది. ఇక రిషి (Rishi) ఇంట్లోకి వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మొత్తం వివరిస్తాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మిషన్ ఎడ్యుకేషన్ ప్లాన్ వుంటుందని దానికి కంటెంట్ ఇవ్వాలని జగతికి చెబుతాడు.
జగతి (Jagathi) వాళ్ళు బయటికి వెళ్లేటప్పుడు దేవయాని వచ్చి వసును రిషితో ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో వెంటనే వసు దేవయానికి కౌంటర్ వేస్తుంది. తరువాయి భాగంలో దేవయాని జగతి, వసుల అంత చూడటానికి రెస్టారెంట్ కి వెళ్తుంది. అదే సమయంలో రిషి కూడా అక్కడికి వెళ్తాడు. మొత్తానికి దేవయానికి (Devayani) మూడినట్లే కనిపిస్తుంది.