బాలీవుడ్ డ్రగ్ కేసుః మహేష్‌బాబు భార్య నమ్రత పేరు ?
బాలీవుడ్ డ్రగ్ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, దీపికా మేనేజర్ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఇందులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. అంతేకాదు సుశాంత్‌కి అలవాటు చేసినట్టు తేలింది. ఈ కేసులో రియాని విచారించగా 25 మంది సినీ ప్రముఖుల పేర్లని బయటపెట్టినట్టు వార్తలొచ్చాయి.
ఇటీవల దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, రకుల్, సారా అలీఖాన్ పేర్లు వినిపించగా, ఇప్పటికే శ్రద్ధాకి, సారి నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వారికి సమన్లు పంపినట్టు తెలిపింది. తాజాగా దీపికా మేనేజర్ కరిష్మాకి సమన్లు పంపింది. నెక్ట్స్ దీపికాకి పంపేందుకు ఎన్సీబీ రెడీ అవుతుందట.
ఈ నేపథ్యంలో డ్రగ్ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు భార్య, మాజీనటి నమ్రత పేరు వినిపించడం కలకలం సృష్టిస్తుంది. ఆజ్‌తక్ అనే మీడియా సంస్థ నమ్రత పేరుని వెల్లడించింది.
రకుల్ పేరు వచ్చినప్పుడే టాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ మీడియా నమ్రత పేరు డ్రగ్ కేసులో ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
నమ్రత పేరు వచ్చిందంటే దాని వెనకాల మహేష్ పేరు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ఇప్పుడిది టాలీవుడ్లో పెద్ద దుమారం రేపుతుంది. మహేష్ ఫ్యామిలీ ఆందోళన చెందుతుందని తెలుస్తుంది.
మోడలింగ్ నుంచి నటిగా మారిన నమ్రత మొదట బాలీవుడ్లో పలు సినిమాలు చేసింది. హిందీ,కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత 2000లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌బాబు హీరోగా రూపొందిన `వంశీ`లో హీరోయిన్గా ఎంపికైంది.
`వంశీ` చిత్ర షూటింగ్ టైమ్‌లోనే మహేష్‌బాబు, నమ్రతల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమబలంగా మారడంతో ఏకంగా సూపర్ స్టార్ కృష్ణని ఎదురించి మరీ మహేష్.. నమ్రతని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీరి వివాహాన్ని కృష్ణ ఒప్పుకున్నారు.
వీరికి కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఉన్నారు. ఇద్దరికి వీరిద్దరు ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటారు.
మహేష్‌తో పెళ్ళి తర్వాత నమ్రత తెలుగులో కేవలం చిరంజీవి `అంజి` చిత్రంలోనే నటించింది. బాలీవుడ్ చిత్రాలు మాత్రం బాగానే చేసింది.
పెళ్ళి తర్వాత నాలుగేళ్ళపాటు హీరోయిన్గా నటించిన నమ్రత 2005 నుంచి సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.
ప్రస్తుతం మహేష్‌కి సంబంధించిన డేట్స్, బిజినెస్‌లు చూసుకుంటుంది.
మహేష్‌కి సంబంధించిన ప్రతిదీ నమ్రతనే హ్యాండిల్ చేస్తారనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తుంటాయి. ఓ రకంగా మహేష్‌ని తెరవెనుక శాసిస్తుందనే టాక్ వినిపిస్తుంటుంది.
ఎంబీ కార్పొరేషన్, ఏఎంబీ సినిమాస్‌ని సైతం నమ్రతనే డీల్ చేస్తున్నారు. మహేష్ ప్రారంభించిన ఆన్లైన్ మెన్స్ వేర్ని సైతం చూసుకుంటున్నారు.
దీంతోపాటు మహేష్ నటించే టీవీ యాడ్స్ ని కూడా నమ్రతనే హ్యాండిల్ చేస్తుంటారు. మహేష్ కేవలం బొమ్మ అయితే నమ్రత కర్త, కర్మ, క్రియ.
ఇక సోమవారం నమ్రత ప్రేమ గురించి చెబుతూ, మహేషే తన ప్రేమ అని, ఆయన వల్లే తాను సంతోషంగా ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డ్రగ్ కేసులో ఆమె పేరు వినిపించడంతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.