MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?

Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలుగులో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్. హిందీలో మాత్రం ఎందుకు సినిమాలు చేయలేదు. అవకాశాలు వచ్చినా.. ఆయన బాలీవుడ్ మూవీ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ సూపర్ స్టార్.. ప్రిన్స్ మహేష్ బాబు..
Image Credit : Mahesh Babu\Instagram

టాలీవుడ్ సూపర్ స్టార్.. ప్రిన్స్ మహేష్ బాబు..

మహేష్ బాబుకి టాలీవుడ్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మిల్క్ బాయ్, ప్రిన్స్ లాంటి ఇమేజ్ లను దాటుకుని.. సూపర్ స్టార్ గా ఎదిగాడు. 50 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగానే ఉన్నాడు. మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని.. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. హిందీలో సినిమాలు చేయకపోయినా.. ఆయనంటే అక్కడ కూడా కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. మరి అక్కడ అభిమానులు ఉన్నప్పుడు మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేయాల్సింది కదా? సూపర్ స్టార్ హిందీలో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..
Image Credit : urstrulymahesh/Instagram

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..

మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు ఏడాదికి 15 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఉంది. ఆయన సినిమానే శ్వాసగ బ్రతికాడు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేసి వరుస సినిమాలు రిలీజ్ చేసేవారు. ఆయన అంత కష్టపడటం చిన్నప్పటి నుంచి చూడటంవల్లనో ఏమో.. మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నాడు. 

ఆ ఒక్క సినిమాతోనే అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుంటాడు మహేష్. సినిమా లేకపోతే తన టైమ్ మొత్తం ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. దాంతో మహేష్ కి టాలీవుడ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. బాలీవుడ్ సినిమా చేసే టైమ్ దొరకలేదు. అంతే కాదు మహేష్ హిందీ సినిమా చేయకపోవడానికి మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

35
అసలు కారణం అందేనా?
Image Credit : Asianet News

అసలు కారణం అందేనా?

మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై గతంలో కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు, మహేష్ తో కలిసి నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా ఓ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ దేవ్‌ను మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు. దీనికి ఆయన నవ్వుతూ స్పందించారు. “ఆయనకు భాష రాదు, అందుకే బాలీవుడ్‌లో నటించడంలేదు. నిజం అదే” అంటూ సరదాగా కామెంట్లు చేశారు. ఆయన చెప్పిన “ఉన్‌కో జుబాన్ నహీ ఆతి, సహీ బాత్ తో యే హై” అనే వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

45
మహేష్ బాబు ఏమన్నాడంటే?
Image Credit : Mahesh Babu\Twitter

మహేష్ బాబు ఏమన్నాడంటే?

కొన్నేళ్ల క్రితం విడుదలైన ‘మేజర్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మహేష్ బాబు చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ, “నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వాళ్లు నన్ను భరించలేరని అనుకుంటున్నాను. నా సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు” అని చెప్పారు.

అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ, స్టార్‌డమ్‌తో తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. తన లక్ష్యం తెలుగు సినిమాల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమేనని అప్పట్లో మహేష్ అన్నారు.

55
అనుకున్నట్టే చేస్తోన్న సూపర్ స్టార్...
Image Credit : jiohotstar

అనుకున్నట్టే చేస్తోన్న సూపర్ స్టార్...

మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చేస్తున్నాడు. ఆయన అన్నట్టుగానే తెలుగు సినిమా ద్వారానే ప్రపంచ వ్యాప్తం గుర్తింపు సాధించడానికి చాలా కష్టపడుతున్నారు మహేష్ బాబు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా.. భారీ స్థాయిలో ఈమూవీ తెరకెక్కుతోంది. 

దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో వారణాసిని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వారణాసి మూవీని వచ్చే ఏడాది అంటే.. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Meena: ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved