MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ram Charan కు ఏమయ్యింది? పెద్ది సక్సెస్ తరువాత కనిపించని మెగా పవర్ స్టార్.. ఎక్కడికెళ్లాడు?

Ram Charan కు ఏమయ్యింది? పెద్ది సక్సెస్ తరువాత కనిపించని మెగా పవర్ స్టార్.. ఎక్కడికెళ్లాడు?

పెద్ది సినిమా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డేనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ హ్యాపీ మూమెంట్ లో రామ్ చరణ్ ఎక్కడున్నాడు? ఎవరికి కనిపించకుండా ఎక్కడికెళ్లాడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 06 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెద్దిలో రఫ్పాడించిన రామ్ చరణ్..
Image Credit : Asianet News

పెద్దిలో రఫ్పాడించిన రామ్ చరణ్..

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ లో రన్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. సినిమా అంతా తన భుజాలపై మోశాడు మెగా పవర్ స్టార్. సెకండ్ హాఫ్ తో పాటు క్లైమాక్స్‌లో ఆయన చూపించిన ఎమోషనల్ సీన్స్,అభిమానులను కదిలించింది. చరణ్ నటనపై సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పెద్ది రిలీజ్ తరువాత కనిపించని మెగా హీరో.
Image Credit : Asianet News

పెద్ది రిలీజ్ తరువాత కనిపించని మెగా హీరో.

పెద్ది సినిమా రిలీజ్ కు ముందు వరకు ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్న రామ్ చరణ్, విడుదలకు ఒక రోజు ముందు నుంచి కనిపించడం మానేశాడు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల తర్వాత జరిగిన పలు కార్యక్రమాల్లో కూడా ఆయన లేకపోవడంతో అభిమానుల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఆయన ఎక్కడికెల్లాడు..? చరణ్ కు ఏమయ్యిందని అభిమానులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.

36
షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు..
Image Credit : Asianet News

షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు..

‘పెద్ది’ చిత్రంలో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్‌కు పలు గాయాలు అయినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన చేతికి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. గాయం ఉన్నప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో షూటింగ్‌లో పాల్గొని మూవీని పూర్తి చేసినట్లు సమాచారం. అనంతరం వైద్యులు చేతికి శస్త్రచికిత్స అవసరం అని సూచించినట్లు తెలుస్తోంది.

46
చేతికి మెడికల్ బ్యాండ్ తో స్టార్ హీరో..
Image Credit : Asianet News

చేతికి మెడికల్ బ్యాండ్ తో స్టార్ హీరో..

ప్రమోషనల్ కార్యక్రమాల సమయంలో కూడా రామ్ చరణ్ తన చేతికి మెడికల్ బ్యాండ్ ధరించి కనిపించారు. ఈ గాయం గురించి ఆయన గతంలో మాట్లాడుతూ.. పెద్ది సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యి, రిలీజ్ తరువాత శస్త్రచికిత్స చేయించుకుంటానని వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకుంటే విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని, అందుకే ప్రమోషన్స్‌కు ఆటంకం కలగకుండా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.

56
చరణ్ లేకుండానే సినిమా చూసిన ఉపాసన
Image Credit : X

చరణ్ లేకుండానే సినిమా చూసిన ఉపాసన

సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ప్రమోషన్స్‌కు  ఇంపార్టెన్స్  ఇస్తూ తన శస్త్రచికిత్సను కూడా వాయిదా వేసుకోవడంతో అభిమానులు ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు.సినిమా విడుదలైన తర్వాత మూవీ యూనిట్ టీమ్ తో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా థియేటర్లలో సినిమా చూసింది. కానీ వారితో రామ్ చరణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా నిర్వహించిన సక్సెస్ ప్రెస్‌మీట్‌లో కూడా ఆయన హాజరు కాలేదు.

66
ఆస్పత్రిలో చేరి ఉంటాడా?
Image Credit : X

ఆస్పత్రిలో చేరి ఉంటాడా?

దీంతో ఆయన చేతికి శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం, ఆయనకు అపోలో ఆస్పత్రిలో చేతికి శస్త్రచికిత్స జరిగినట్లు, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్నందున, పూర్తిగా కోలుకున్న తర్వాత ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
జాన్వీ కపూర్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Recommended image2
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved